Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ముమ్మరంగా సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో దాదాపు లక్ష్యాన్ని మించి సభ్యత్వాలు నమోదవగా గడువు సమీపిస్తుండటంతో రెట్టింపు చేసే దిశగా టీఆర్‌ఎస్ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. సభ్యత్వాలు స్వీకరించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో నాయకులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 20వ తేదీతో నమోదు కడువు ముగుస్తుండటంతో గురు, శుక్రవారాల్లో భారీగా సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Memebership-drive-in-Rangareddy

-సభ్యత్వం తీసుకున్న 900 మంది న్యాయవాదులు గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రతి డివిజన్‌లో నగరవాసులు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 8లక్షల 60వేల సభ్యత్వం నమోదు అయినట్లు పార్టీ నేతలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో గ్రేటర్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్‌గా మైనంపల్లి హన్మంతరావు, పద్మారావు, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు విస్తృతంగా పర్యటించి క్యాడర్‌లో ఉత్సహం నింపారు. నాంపలి క్రిమినల్ కోర్టులు, రంగారెడ్డి కోర్టు, సిటీ సివిల్ కోర్టు, సికింద్రాబాద్ కోర్టు, రంగారెడ్డి జిల్లాలోని కోర్టుల్లో దాదాపు 900 మంది న్యాయవాదులు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.

కార్యక్రమంలో న్యాయవాదుల జేఏసీ నాయకులు కే గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్, ఆదిత్యా, వినయ్‌కుమార్, జనార్దన్‌రావు, ప్రసాదచారి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం సిరికొండలో టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ చందుర్తి మండలంలో, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి బెజ్జంకిలో పర్యటించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్‌లో పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్ పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

అర్‌అండ్‌బీశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో న్యాయవాదులకు సభ్యత్వం అందచేని మాట్లాడారు. రాష్ర్టానికి త్వరలోనే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కానున్నదని తెలిపారు. అనంతరం బుర్హాన్‌పురంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. జిల్లాలో సాధారణ సభ్యత్వాలు 2.57లక్షలు, క్రియాశీలక సభ్యత్వాలు 68,450 పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రూ.24 లక్షలు డీడీల రూపంలో చెల్లించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, టీఆర్‌ఎస్ నేతలు షేక్ బుడాన్ బేగ్, ఆర్‌జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

-రాష్ర్టాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి మహేందర్‌రెడ్డి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్‌ల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని నమోదు చేసుకునేందుకు యువకులు, వృద్ధులతోపాటు మహిళలు పోటీ పడుతున్నారన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్, వంగేటి లకా్ష్మరెడ్డి, జేపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. షాబాద్ మండలంలో ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, వికారాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజీవరావు, జిల్లా అధ్యక్షులు నాగేందర్‌గౌడ్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కెరమెరి, జైనూర్ మండల్లాలో పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, దండేపల్లి మండలం ముత్యంపేటలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. సింగరేణి గనులపై సైతం ఉత్సాహంగా సభ్యత్వ నమోదు సాగుతున్నది. వరంగల్ జిల్లా లక్ష్యానికి మించి ఐదు లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసుకొని ఆరు లక్షల సభ్యత్వ నమోదు దిశగా దూసుకపోతున్నది. బుధవారం జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ లింగాలఘనపూర్ మండల నాయకులకు సభ్యత్వం అందజేశారు. నగరంలోని హరిత కాకతీయ హోటల్‌లో టీఆర్‌ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఇండ్ల నాగేశ్వర్‌రావు పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కన్నెబోయిన రాజయ్యయాదవ్‌కు పార్టీ సభ్యత్వం అందజేశారు.

జిల్లాలో సభ్యత్వ నమోదు ఆన్‌లైన్ ప్రక్రియ చురుగ్గా సాగుతున్నదని జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి కార్యాలయానికి సభ్యత్వ రుసుము రూ.50 లక్షలు చెల్లించామన్నారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారంలో పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, తుర్కపల్లి, ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, నల్లగొండ పట్టణంలో నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, మహిళా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్, భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజక వర్గాల్లో నిర్దేశించిన లక్ష్యంను మించి సభ్యత్వ నమోదు పక్రియ జరుగుతున్నది.

బుధవారం నాటికి జిల్లాలో 4లక్షల 20వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 4,35,000 సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇందులో క్రియాశీలక సభ్యత్వాలు 76,625 కాగా, సాధారణ సభ్యత్వాలు 3,58,375 ఉన్నాయి. సభ్యత్వ నమోదు జిల్లా పరిశీలకుడు ఎల్ రూప్‌సింగ్ బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో పర్యటించారు. బాన్సువాడలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు 100 మంది పార్టీ సభ్యత్వాన్ని రూప్‌సింగ్ సమక్షంలో స్వీకరించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.