-ధైర్యంగా ఉండండి.. కరోనాను జయించండి -కొవిడ్ బాధితులకు సీఎం కేసీఆర్ భరోసా -గాంధీ దవాఖానలో గంటపాటు పర్యటన -జనరల్‌వార్డు నుంచి ఐసీయూదాకా పరిశీలన -నేరుగా కరోనా పేషెంట్లతో మాట్లాడిన సీఎం -ప్రాణాలకు తెగించి డాక్టర్లు, సిబ్బంది సేవలు -అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్

మీకు నేనున్నా.. ధైర్యంగా ఉండండి.. మన డాక్టర్లు, నర్సులు మంచి వైద్యం అందిస్తున్నారు.. ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటున్నది. మంచి వైద్యవిధానాలు అందుబాటులో ఉన్నాయి. మందులు, ఆక్సిజన్ కొరత లేదు. అందరూ త్వరగా కోలుకొని ఇంటికి వెళ్తారు.
గాంధీలో కరోనా బాధితులతో సీఎం కేసీఆర్ క్లిష్ట సమయంలో అండగా నిలబడండి ఏ సమస్యఉన్నా నా దృష్టికి తీసుకురండియువ వైద్యులకు సీఎం కేసీఆర్ పిలుపు
ఆత్మీయ ఆలకింపు.. వైరస్‌తో ఉక్కిరిబిక్కిరవుతున్న రోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక ఒక సాంత్వన కలిగించింది. వైరస్‌తో నిత్యం పోరాడుతూ చికిత్సనందిస్తున్న వైద్యులకు సీఎం కేసీఆర్ రాక ఉత్తేజాన్ని అందించింది.
పీపీఈ కిట్ ధరించలేదు. కేవలం మాస్కుతో కరోనా రోగులు ఉన్న గాంధీ దవాఖానలోని ప్రతి బెడ్ దగ్గరకు వెళ్లారు. ఐసీయూలో ఉన్న బాధితుల దగ్గరకూ వెళ్లి ఓదార్చారు. జాగ్రత్తలు సూచించారు. చక్కగా భోజనం చేయాలంటూ ఇంటిపెద్దలా చెప్పారు. మీకేమీ కాదని.. నేనున్నానని వారికి భరోసా కల్పించారు. హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో కరోనా బాధితులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ తదితర అన్నిసౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి కే చం ద్రశేఖర్‌రావు తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది మంచి వైద్యం అందిస్తున్నారని.. ఇంకా ఎలాంటి సహా యం కావాలన్నా తక్షణం అందించడానికి సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. త్వరలోనే కరోనా రోగులందరూ కోలుకుని ఇండ్లకు వెళతారని ధైర్యం చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ చికిత్సా విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా బాధితులకు భరోసానిచ్చేందుకు సీఎం కేసీఆర్ బుధవారం సికింద్రాబాద్ గాంధీ దవాఖానను సందర్శించారు. ప్రగతిభవన్ నుంచి నేరుగా గాంధీ దవాఖానకు చేరుకున్న ముఖ్యమంత్రి.. కొవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న వార్డుల్లో దాదాపు గంటపాటు కలియతిరిగారు. వారికి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు.
ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించిన నేపథ్యంలో గాంధీలో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నిమిషానికి రెండువేల లీటర్ల ఆక్సిజన్‌ను తయారుచేసే ప్లాంట్‌ను గాంధీలో నెలకొల్పారు. ప్లాంట్ మొత్తాన్ని పరిశీలించిన సీఎం.. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును దాని పనివిధానం, ఆక్సిజన్ ప్యూరిటీ గురించి అడిగి తెలుసుకున్నారు.

కొవిడ్ పేషెంట్ల మధ్య గంటసేపు గాంధీ దవాఖానలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న పేషెంట్ల మధ్య సీఎం కేసీఆర్ గంటసేపు ఉన్నారు. దవాఖానలో కొవిడ్ బాధితులకు వైద్యమందిస్తున్న ఐసీయూ, ఎమర్జెన్సీ, జనరల్ వార్డులతోపాటు, ఔట్‌పేషెంట్ వార్డుల్లో కలియతిరిగారు. నేరుగా పేషెంట్ల బెడ్స్ వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. పేరు, వివరాలతోపాటు, వారి యోగక్షేమాలను అడిగారు. ప్రత్యేకంగా జనరల్ వార్డుల్లోకి వెళ్లి పేషెంట్లతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. మీకు చికిత్స సరిగ్గా అందుతున్నదా? భోజనం ఎలా ఉన్నది? అని అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను అకడికకడే పరిషరించేలా వైద్యాధికారులకు ఆదేశాలిచ్చారు.
డాక్టర్లు, నర్సులకు అభినందన ‘క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండి బ్రహ్మాండంగా సేవచేస్తున్నారు. ఈ సేవలను కొనసాగించండి. మీకు ఏ సమస్యఉన్నా, అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి. సంపూర్ణంగా సహకారం అందిస్తా’ అని సీఎం కేసీఆర్ యువడాక్టర్లు, నర్సులకు భరోసానిచ్చారు. గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులు, జూనియర్ డాక్టర్లతో ఆయన స్వయంగా మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా పరిషరిస్తామని చెప్పారు. ఇలాంటి క్లిష్టసమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం యువ డాక్టర్లుగా మీమీద ఉన్నదని పేర్కొన్నారు.
జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిషారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని వైద్యాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ, సీఎంవో కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌రెడ్డి, సీఎంవో ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి , గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, పోలీస్ కమిషనర్ అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖానల్లో కరోనా వార్డుల్లో కలియ తిరుగుతూ రోగులను పరామర్శించారు. వైద్యులు, నర్సులు మంచి వైద్యం అందిస్తారని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటూ వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపారు. పలు వార్డుల్లో పదుల సంఖ్యలో రోగులను సీఎం కేసీఆర్ పరామర్శించి, వారి బాగోగులు తెలుసుకున్నారు. దవాఖానలో సేవలు బాగున్నాయని, డాక్టర్లు మంచి వైద్యం అందిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు బాధితులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.
గాంధీలో సేవలు బాగున్నాయి ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ దవాఖానల్లో కరోనా వార్డుల్లో కలియ తిరుగుతూ రోగులను పరామర్శించారు. వైద్యులు, నర్సులు మంచి వైద్యం అందిస్తారని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటూ వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపారు. పలు వార్డుల్లో పదుల సంఖ్యలో రోగులను సీఎం కేసీఆర్ పరామర్శించి, వారి బాగోగులు తెలుసుకున్నారు. దవాఖానలో సేవలు బాగున్నాయని, డాక్టర్లు మంచి వైద్యం అందిస్తున్నారని ఈ సందర్భంగా పలువురు బాధితులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.
సీఎం: ఏం బాబు.. ఎట్లుంది? రోగి: నా పేరు పద్మారావు సార్… నేను సింగరేణిలో పనిచేస్త సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్ సీఎం: ఎన్ని రోజులైంది వచ్చి? (రోగి కుమారుడితో..) రోగి కుమారుడు: పద్నాలుగు రోజులైంది సార్.. వెంటిలేటర్ మీద నుంచి వచ్చిండు. సీఎం: మంచిగ తింటున్నడా? రోగి కుమారుడు: మేమే తినిపిస్తున్నం సార్.. తింటున్నడు సీఎం: మీ నాయనకు భయపడొద్దని చెప్పు. ఏం కాదు. తొందరగన నయమైతది. ధైర్యంగా ఉండాలని చెప్పు.
నమ్మలేకపోతున్నా అందరూ కలిసి వస్తుంటే ఏందో అనుకున్న. ఒక్కసారిగా సీఎం కేసీఆర్ నా వద్దకొచ్చి పలుకరించడంతో నోట్లకెల్లి మాటరాలే. ముఖ్యమంత్రిగారు స్వయంగా వచ్చి మాట్లాడటం చాలా సంతోషంగా ఉన్నది. పాణమెట్లున్నది, డాక్టర్లు టైంకు మందులిస్తున్నరా? అని అడగిన్రు. ఇస్తున్నరని చెప్పిన. భయపడొద్దు.. ధైర్యంగ ఉంటే మంచిగైపోతదని చెప్పిన్రు. నన్ను పలుకరిస్తరని కలలో కూడా అనుకోలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్న. -కేశవరెడ్డి, తాండూరు
వెంటిలేటర్‌పైనుంచి ఆక్సిజన్ బెడ్ మీదకు సీఎం: ఏ ఊరు అమ్మా మీది? రోగి: మాది హైదరాబాద్ సార్. సీఎం: ఏమి చేస్తుంటారు? రోగి: ఐఅమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సార్. సీఎం: ఎన్నిరోజులైంది ఇక్కడికి వచ్చి? రోగి: ఫైవ్ డేస్ సార్. సీఎం: ఇప్పుడెట్లుందమ్మా మీ ఆరోగ్యం? రోగి: నేను దవాఖానలో చేరినప్పుడు వెంటిలెటర్‌పై ఉన్నాను సార్. ఐదురోజుల్లోనే దాదాపుగా క్యూర్ అయ్యా. ఇప్పుడు ఆక్సిజన్ పెట్టారు. రెండు మూడ్రోజుల్లో ఇంకా క్యూరైతే నార్మల్ వార్డుకు షిఫ్ట్‌చేస్తామని చెప్పారు. సీఎం: ఓకే అమ్మా. ధైర్యంగా ఉండండి. మీరు త్వరలో పూర్తిగా కోలుకుంటారు. మాలతి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హైదరాబాద్
బాగా చూస్తున్నారు సార్ సీఎం: మీదే ఊరు అమ్మా? రోగి : మహబూబ్‌నగర్ సార్ సీఎం: ఎన్నిరోజులైందమ్మా దవాఖానకు వచ్చి? రోగి: వారం అయింది సార్ సీఎం: ఇప్పుడెలా ఉంది మీ ఆరోగ్యం? రోగి : చాలా నయంగా ఉందిసార్ సీఎం: మందులు, భోజనం టైమ్‌కు ఇస్తున్నారా? రోగి: ఇస్తున్నారు సార్. డాక్టర్లు, నర్సులు అందరూ బాగా చూసుకుంటున్నారు -విజయలక్ష్మి, మహబూబ్‌నగర్