Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మెదక్ లోక్‌సభ బరిలో గులాబీ అధినేత

36 అసెంబ్లీ, 8 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన -మొత్తం 109 అసెంబ్లీ, 16 లోక్‌సభ అభ్యర్థులు ఫైనల్ -మిగిలినవి 10 అసెంబ్లీ, ఒక్క పార్లమెంట్ స్థానమే – టీఆర్‌ఎస్‌లో చేరిన నోముల, మైనంపల్లి – నాగార్జునసాగర్ నుంచి నోముల..

NOMULA--NARSIMHAIAH

తెలంగాణ రాష్ట్ర సమితి మంగళవారం తన మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి లిస్టులో 69 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ రెండో లిస్టులో 8 పార్లమెంట్, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మూడో జాబితాతో కలుపుకొంటే టీఆర్‌ఎస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య 109కి చేరింది. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

తాజా జాబితాలో పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. మిగిలిన 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అయిన బుధవారం ఉదయం ప్రకటించనున్నారు. ఇప్పటికే గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న కేసీఆర్.. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీకి దిగుతున్నారు. గజ్వేల్ స్థానం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోదే. ఇక కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఖరారైంది. ఆమె బుధవారం ఉదయం 11.10 గంటలకు నిజామాబాద్‌లోని రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. సీపీఎంకు గతంలో శాసనసభాపక్ష నాయకుడిగా వ్యవహరించిన నోముల నర్సింహయ్య, కేసీఆర్ సమక్షంలో మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హన్మంతరావు కూడా టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో నోముల నర్సింహయ్యకు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి, అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి లోక్‌సభ స్థానాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తున్నది.

అసెంబ్లీ అభ్యర్థులు హైదరాబాద్-రంగారెడ్డి : ఉప్పల్ – బీ సుభాష్‌రెడ్డి, చార్మినార్- ఇనాయత్ ఆలీ, మలక్‌పేట్- సతీష్‌కుమార్‌యాదవ్, చాంద్రాయణగుట్ట- సీతారాంరెడ్డి, ఖైరతాబాద్- మన్నె గోవర్ధన్‌రెడ్డి, అంబర్‌పేట్-ఎడ్ల సుధాకర్‌రెడ్డి, కార్వాన్- ఠాకూర్ జీవన్‌సింగ్, కుత్బుల్లాపూర్- కొలను హన్మంతరెడ్డి, సనత్‌నగర్- దండె విఠల్, కూకట్‌పల్లి- గొట్టిముక్కల పద్మారావు, యాకుత్‌పురా- షబ్బీర్ అహ్మద్, ఎల్‌బీనగర్- ఎన్ రామ్మోహన్‌గౌడ్, గోషామహల్- ప్రేమకుమార్ ధూత్, ముషీరాబాద్- ముఠాగోపాల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్- గజ్జెల నగేష్, నాంపల్లి- కే హన్మంతరావు, బహదూర్‌పురా- జీయావుద్దీన్, మహేశ్వరం- కొత్త మనోహర్‌రెడ్డి.

మహబూబ్‌నగర్ జిల్లా : కొడంగల్- గుర్నాథ్‌రెడ్డి, నారాయణపేట్- కే శివకుమార్‌రెడ్డి. ఖమ్మం జిల్లా: ఖమ్మం-జీ కృష్ణ, పినపాక- శంకర్‌నాయక్, మధిర- బొమ్మెర రామ్మూర్తి, వైరా- చంద్రావతి, అశ్వారావుపేట- జే ఆదినారాయణ, భద్రాచలం- ఝాన్సీరాణి ఆనందరావు. మెదక్ జిల్లా: నారాయణఖేడ్- ఎం భూపాల్‌రెడ్డి, జహీరాబాద్- కే మాణిక్‌రావు, నర్సాపూర్- సీహెచ్ మదన్‌రెడ్డి. నల్లగొండ జిల్లా: భువనగిరి- పైళ్ల శేఖర్‌రెడ్డి, నాగార్జునసాగర్- నోముల నర్సింహయ్య. వరంగల్ జిల్లా: పరకాల- ఎం సహోదర్‌రెడ్డి, మహబూబాబాద్- శంకర్‌నాయక్. కరీంనగర్ జిల్లా: చొప్పదండి- బొడిగే శోభ.

ఆదిలాబాద్ జిల్లా: దివాకర్‌రావు. నిజామాబాద్ అర్బన్: గణేష్ గుప్తా.

లోక్‌సభ అభ్యర్థులు హైదరాబాద్- రషీద్ షరీఫ్, మెదక్- కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, జహీరాబాద్-బీబీ పాటిల్, పెద్దపల్లి- బాల్క సుమన్, నిజామాబాద్-కల్వకుంట్ల కవిత, ఆదిలాబాద్- జీ నగేష్, మహబూబాబాద్‌-ప్రొఫెసర్ సీతారాంనాయక్, ఖమ్మం- ఎండీ బుదన్ బేగ్ షేక్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.