విద్యుత్‌శాఖ మంత్రిగా డాక్టర్ సి.లక్ష్మారెడ్డి గురువారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య లక్ష్మారెడ్డి చాంబర్‌లో ప్రవేశించి పూజలు నిర్వహించారు. ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కే వెంకటనారాయణ,

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు టీ శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మారెడ్డికి అభినందనలు తెలిపారు. విద్యుత్‌సంస్థలకు సంబంధించిన వివరాలను సీఎండీ ప్రభాకర్‌రావు మంత్రికి వివరించారు. రాష్ట్రమంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికబోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్, ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథామరెడ్డి తదితరులు మంత్రిని అభినందించారు.
-విద్యుత్‌మంత్రిని కలిసిన సింగరేణి సీఎండీ సింగరేణి సంస్థ సీఎండీ సుతీర్థ భట్టాచార్య గురువారం సాయంత్రం విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డిని కలిశారు. సింగరేణి సంస్థకు సంబంధించిన విషయాలపై వీరు చర్చించారు. త్వరలో కోల్‌ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న సుతీర్థ భట్టాచార్యను మంత్రి అభినందించారు.