Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మన ప్రాజెక్టులపై మీ వైఖరేంటి?

ఏపీ ఎన్నికుట్రలు చేసినా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులను కట్టే తీరుతాం. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులపై ఆంధ్రా సర్కారు కుట్రల్ని అధిగమిస్తాం. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని కేంద్రానికి లేఖలు రాసిన ఆంధ్రా సర్కారు తీరుపై తెలంగాణ టీడీపీ నేతల వైఖరేంటో స్పష్టం చేయాలి అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిలదీశారు. ఆదివారం వరంగల్‌లో రెండు ప్రైవేటు దవాఖానలను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు టీఆర్‌ఎస్ జిల్లా, అర్బన్ అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందరరావు, నన్నపనేని నరేందర్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దని ఆంధ్రా సర్కారు, ఆ ప్రాంత నేతలు కేంద్రానికి లేఖలు రాయడాన్ని తప్పు పట్టారు.

Harish Rao press meet in Warangal01

-తెలంగాణ ఆత్మవైపు ఉంటారా? -ఆంధ్రాకు తొత్తులుగానే ఉంటారా? తేల్చుకోండి -టీటీడీపీ నేతలను నిలదీసిన మంత్రి హరీశ్‌రావు -పాలమూరు, డిండి ప్రాజెక్టులు కట్టి తీరుతామని వ్యాఖ్య ఈ లేఖలపై ఇక్కడి టీడీపీ నాయకులు తమ విధానం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను కట్టొద్దని ఆంధ్రా రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన తీరుపై మండిపడ్డారు. మీ నేతలు తెలంగాణ బిడ్డలుగా ఉండరా? ఇంకా ఆంధ్రా ప్రాంత తొత్తులుగానే ఉంటారా? ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. మీరు ఆ ఉత్తరాలను సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా? స్పష్టం చేయాలని నిలదీశారు. మీరు తెలంగాణ బిడ్డలే అయితే ఆంధ్రా సర్కార్ కేంద్రానికి చేసిన ఫిర్యాదుల్ని ఉపసంహరించుకునేలా చూడాలని, చంద్రబాబును ఒప్పించడం చేతకాదనుకుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని హితవుపలికారు. తెలంగాణ ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని మాట్లాడుతున్న ఈ ప్రాంత టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకరరావు ఈ ప్రాజెక్టులు తెలంగాణకు అవసరమో? కాదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలుగా ఉంటారో? ద్రోహులుగా ఉంటారో తేల్చుకునే సమయం వచ్చిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు, డిండి ప్రాజెక్టులను కట్టి తీరుతుందని స్పష్టంచేశారు. ప్రజల కష్టాలను శాశ్వతంగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణ రైతాంగానికి నీళ్లు రాకుండా అడ్డుకునే లేఖను ఏపీ ఉపసంహరించుకోకుంటే టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆ పార్టీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

-మిషన్ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయకు దేశదేశాల నుంచి మంచి గుర్తింపు వస్తున్నదని, అంతర్జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాలు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై ప్రశంసలు కురిపిస్తుంటే పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు ఎర్రబెల్లి దయాకరరావుకు, టీడీపీ నేతలకు అందులో కమీషన్లు జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అనేక రాష్ర్టాలు మన మిషన్ కాకతీయ స్ఫూర్తితో తమ రాష్ర్టాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఆలోచిస్తుంటే వీళ్లకు మాత్రం కమీషన్లు కనిపించడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే కోటి 72 లక్షల టిప్పుల మట్టిని రైతులు పొలాల్లో వేసుకున్నారని వివరించారు.

నిజానికి మిషన్ కాకతీయ ఈపీసీ విధానంతో అత్యంత పారదర్శంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరింత పకడ్బందీగా చేపడతామన్నారు. మిషన్ కాకతీయను రాష్ట్ర హైకోర్టు, గవర్నర్, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణతోపాటు యావత్ దేశం హర్షించిందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఇంతమంచి పనులపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. విమర్శిస్తే ప్రజల్లో చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. జర్నలిస్టులు, పోలీసులు కూడా చెరువులను దత్తత తీసుకుని పనులు చేపట్టినట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.