Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

1,10,000 కోట్లు ఇదీ మన వార్షిక బడ్జెట్ ?

బంగారు తెలంగాణకు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేలా, పేదలకు సంక్షేమ పథకాలను అందించేలా 2015-16 ఆర్థిక సంవత్సరానికి లక్షా పదివేల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి ఇదే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కావడం విశేషం. కొత్త వార్షిక బడ్జెట్‌లో ప్రణాళిక పద్దుకింద రూ.52వేల కోట్లు, ప్రణాళికేతర పద్దుకింద రూ.58వేల కోట్లు పొందుపరిచినట్లు సమాచారం.

Etela Rajendar 01

– రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర – ప్రాధాన్య పథకాలకు పెద్ద పీట.. -బంగారు తెలంగాణకు బాట – నేటి ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఈటల.. -మండలిలో డిప్యూటీ సీఎం కడియం

మంగళవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఐదు నిమిషాల్లో ముగిసిన మంత్రివర్గ సమావేశం కేవలం వార్షిక బడ్జెట్‌కే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో పది నెలల కాలానికి లక్షా 637 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్రం పన్నుల వాటా కింద వచ్చే నిధులు, రాష్ట్ర ఆదాయమార్గాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను దాదాపు లక్షా పది వేల కోట్లతో రూపొందించినట్లు తెలుస్తున్నది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలతోపాటు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసేలా బడ్జెట్ కేటాయింపులుండబోతున్నాయని సమాచారం. బుధవారం ఉదయం పది గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర వార్షిక ఆదాయాలు, ఖర్చుల పద్దులను బడ్జెట్‌లో పొందుపర్చనున్నారు. గతంలో పది నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను రూపొందించారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తూ కేటాయింపులుండబోతున్నాయని తెలుస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణం, వృద్ధులు, వికలాంగులు, వితంతులకు పింఛన్లు, దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు పథకం, విద్యుత్, కేజీ టు పీజీ, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలుస్తున్నది. హరితహారంకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. వీటితోపాటు సంక్షేమ పథకాలకు కొత్త బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయం రూ.58వేల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. ఇందులో మిషన్ కాకతీయకు రూ.6,500కోట్లు, వాటర్‌గ్రిడ్‌కు రూ.5వేల కోట్లు, విద్యుత్‌రంగంలో ఉచిత విద్యుత్తు, జెన్‌కో ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటాలకోసం రూ.7,500కోట్లు, డబల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి రూ.4,400కోట్లు, కొత్త సచివాలయం నిర్మాణానికి రూ.200కోట్లు, గ్రామీణ ప్రాంతాలతోపాటు జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.3,500 కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2014-15) ప్రభుత్వం రూ.1,00,637 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రణాళిక వ్యయంకింద రూ.48,648.47 కోట్లు, ప్రణాళికేతర వ్యయంకింద రూ.51,989.4 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్ లక్ష కోట్లకు పైగా ఉంటే అప్పులు రూ.18వేల కోట్లుకు మించి ఉన్నాయి. అయితే కొత్త బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయంలో కేవలం కొన్ని మార్పులకే పరిమితం చేస్తూ ప్రణాళికేతర వ్యయం కింద ఎక్కువ నిధులు కేటాయించనున్నారని తెలుస్తున్నది.

అసెంబ్లీలో ఈటల.. మండలిలో కడియం తొలి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రవేశపెడతారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ వెంటనే వీరిద్దరు ఆయా సభల్లో 2015-16 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. ఉదయం 9.30కి శాసనసభ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా, బుధవారం బడ్జెట్ సందర్భంగా 10 గంటలకు సమావేశాలు మొదలు కానున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.