-కొత్త జిల్లాల్లో అభివృద్ధి కనిపించాలి -ఎల్‌ఆర్‌ఎస్‌కు సెప్టెంబర్ వరకు అవకాశం -మున్సిపాలిటీల సమీక్షలో మంత్రి కేటీఆర్

కొత్త జిల్లాలుగా మారిన నారాయణపేట, గద్వాల్‌లలో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని మున్సిపాలిటీలపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా మున్సిపాలిటీల్లో రోడ్లు, పచ్చదనం, శ్మశానవాటికలు వంటి ప్రాథమిక అంశాలపై శ్రద్ధ వహించాలని మున్సిపాలిటీల కమిషనర్లు, చైర్మనను ఆదేశించారు.
వానకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణ కోసం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మరుగుదొడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు వంటివి వేగంగా చేపట్టాలని చెప్పారు. 43 కొత్త మున్సిపాలిటీల్లో లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు సెప్టెంబర్ వరకు గడువు ఉన్నదని చెప్పారు. ఇందుకు ప్రత్యేక మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకొనేలా ప్రచారం కల్పించాలని సూచించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, వీఎం అబ్రహాం, ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పురపాలకశాఖ ఉన్నతాధికారులు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.