Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కొండంత ఆసరా

-అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తాం.. -ఏ ఒక్కరికీ అన్యాయం జరుగదు.. – దుష్ప్రచారాలు నమ్మవద్దు -మహబూబ్‌నగర్ జిల్లాలో ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ -ఇచ్చిన ప్రతి హామీ నిలుపుకుంటా -అబద్ధాలు, దొంగ మాటలు కేసీఆర్‌కు రావు -వాగ్దానాలు ఒక్కటొక్కటీ అమలు చేస్తున్నా -ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చి ఆడబిడ్డల కాళ్లు కడుగుతా -మూడేండ్ల తర్వాత 24 గంటల కరెంటు -ప్రజల దీవెనలుంటే రాత్రింబవళ్లు పనిచేస్తా -బంగారు తెలంగాణ మీ చేతుల్లో పెడతా -పాలమూరు ఎత్తిపోతలకు త్వరలో శంకుస్థాపన: సీఎం

KCR Launching Pension Scheme

ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం అమలుచేసి చూపుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చెప్పిందే చేయడం, చేసేదే చెప్పడం కేసీఆర్ నైజం.. ఇతర రాజకీయ నాయకుల్లాగా కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేయడం నాకు రాదు అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను ఒకటొకటిగా అమలుచేస్తూ వస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో శనివారం ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభించారు. వద్ధులు, వితంతువులకు నెలకు రూ వికలాంగులకు రూ.1500 అందించే ఈ పథకం కింద సుమారు 50 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ఫించన్లు అందచేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంకోసం చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తున్నదని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం అహరహం కషి జరుపుతున్నదని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలుచేస్తూ వస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు ఫించన్ల పథకం ప్రారంభించామని చెప్పారు. ప్రజల దీవెనలు ఉంటే రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి బంగారు తెలంగాణ రాష్ర్టాన్ని తయారుచేసి ప్రజలచేతుల్లో పెడుతానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో ఆత్మబలిదానాలు జరిగాయి. నేను చావు అంచువరకు వెళ్లి మీ అందరి దయవల్ల బతికి బయటపడ్డా రాష్ర్టాన్ని సాధించుకున్నాం. అందరం కలిసి బంగారు తెలంగాణను తయారు చేసుకుందాం అని సీఎం చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. వట్టిగ మాటలు చెబితే కాదు, కష్టపడి పనిచేయాలిఅని ముఖ్యమంత్రి ఉద్బోధించారు. దొంగలు.. గజ దొంగలు లక్షలకు లక్షలు తింటుంటే పేదవాళ్లకు నెలకు రూ.1000 ఇస్తే పోయేదేమీ ఉండదు. ఇంకా ఎవరైనా పెన్షన్లు

రాని వారుఉంటే, అర్హులైనవారు ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. అధికారులతో పరిశీలన చేయించి తప్పకుండా అర్హులైనవారందరికీ పెన్షన్లు ఇప్పిస్తా. అర్హులు కానివారికి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు ఇచ్చే ముచ్చటేలేదు. – కేసీఆర్, సీఎం

వెయ్యి ఫించన్ ఇలా పుట్టింది..

ఫించన్ల పథకం రూపుదిద్దుకున్న తీరును కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పార్టీ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నపుడు పెన్షన్ మొత్తం ఎంత ఉండాలనే విషయమై విస్తతంగా చర్చించామన్నారు. పార్టీ సీనియర్‌నేత, నేటి వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి ఖర్చులన్నీ లెక్కలు వేసి నెలకు రూ.600 చేద్దామని ప్రతిపాదించారని వివరించారు. అయితే తనకు తప్తి కలుగలేదని మనం పెన్షన్లు ఎందుకు ఇస్తున్నాం, వాటి ఉద్దేశ్యం ఏమిటి, ఆసరా లేని వారికి ఆర్థికపరమైన ఆసరా ఉండాలన్నదే కదా.. మరో లుగు వందలు కలిపి రూ.1000 చేయాలని చెప్పి మరీ మేనిఫెస్టోలో పెట్టించానని కేసీఆర్ వివరించారు. ఈ రోజు ఆ పథకానికి రూపమిచ్చి అమలు చేసి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి నెలా పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని తానే స్వయంగా ప్రారంభించాలనే ఉద్దేశ్యంతోనే మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చానని చెప్పారు.

అర్హులెవరికీ అన్యాయం జరుగనివ్వం.. పెన్షన్లు, రేషన్ కార్డులపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లకు కోత విధిస్తారని కొన్ని వర్గాలు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాలేవీ నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దొంగలు.. గజ దొంగలు లక్షలకు లక్షలు తింటుంటే పేద వాళ్లకు నెలకు రూ.1000 ఇస్తే పోయేదేమీ ఉండదని సీఎం అన్నారు. అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరుగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో అర్హులు కాని వారికి ఎట్టి పరిస్థితిలో పెన్షన్లు ఇచ్చే ముచ్చటే లేదని చెప్పారు. గతంలో చాలా మంది అనర్హులకు, 40 సంవత్సరాల వయసున్న వారికి కూడా పెన్షన్లు ఇచ్చారు.. కొత్త రాష్ట్రం ఏర్పడింది.. ఇకపై నుంచి అలాంటి పొరపాట్లు జరగవద్దని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా పెన్షన్లు రాని వారు ఉంటే.. అర్హులైన వారు ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోండి.. అధికారులతో పరిశీలన చేయించి తప్పకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇప్పిస్తా అని కేసీఆర్ చెప్పారు.

తెలుగుదేశం ప్రభు త్వం అధికారంలో ఉనప్పుడు పెన్షన్ల కోసం ఏడాదికి రూ.67 కోట్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.730 కోట్లు ఇచ్చిందని, ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్లను కేటాయించిందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనితో పాటు రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 6 కిలోలకు పెంచామని, కుటుంబానికి నెలకు 20 కిలోలు మాత్రమే అనే నిబంధనను కూడా సడలించి కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

మూడేండ్లలో ఇంటింటికీ నల్లా నీరు..24 గంటల కరెంటు.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని రూ. 35వేల కోట్లతో మూడేండ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడేండ్లలో ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీళ్లు అందిస్తా.. నల్లా నీళ్లతో ఆడ బిడ్డల కాళ్లు కడుగుతా.. ఒక్క ఆడబిడ్డ కూడా మంచినీళ్ల కోసం బిందెలతో బయటికి వెళ్లే పరిస్థితి ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. అలాగే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు కూడా తీరిపోతాయని చెప్పారు. అప్పటి వరకు ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు ఇబ్బందులు ఉంటాయని తాను ఎన్నికల ప్రచార సభల్లోనే చెప్పానని గుర్తు చేశారు. తాను ఏ విషయం ప్రజల ముందు దాచి పెట్టలేదని అన్నారు. నాకు అబద్దాలు చెప్పడం రాదు. నా జన్మలో అది లేదు..మాయ మాటలు చెప్పి మోసం చేయను..ఉన్నది ఉన్నట్టు చెబుతా.. కరెంటు బజార్లో దొరికే వస్తువు కాదు. ఇప్పటికిపుడు కావాలంటే ఇవ్వడం సాధ్యం కాదు.

పరిస్థితి మెరుగు పరిచేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నా అని చెప్పారు. ఇటీవలే చత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆయన తెలిపారు. మూడేండ్ల తర్వాత 24 గంటల పాటు కరెంటు ఇస్తామని చెప్పారు. రెప్పపాటు కూడా కోతలు లేకుండా చూస్తామని అన్నారు. రాజకీయ నాయకులకు ఏదైనా చెప్పాలంటే ధైర్యం ఉండాలి. చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. నేను చెబుతున్నా.. 24 గంటల కరెంటుపతి ఇంటికి నల్లానీరు ఇవ్వకపోతే 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలను ఓట్లు వేయమని కూడా అడుగదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.కొండంత ఆసరా -అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇస్తాం.. -ఏ ఒక్కరికీ అన్యాయం జరుగదు.. – దుష్ప్రచారాలు నమ్మవద్దు -మహబూబ్‌నగర్ జిల్లాలో ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ -ఇచ్చిన ప్రతి హామీ నిలుపుకుంటా -అబద్ధాలు, దొంగ మాటలు కేసీఆర్‌కు రావు -వాగ్దానాలు ఒక్కటొక్కటీ అమలు చేస్తున్నా -ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చి ఆడబిడ్డల కాళ్లు కడుగుతా -మూడేండ్ల తర్వాత 24 గంటల కరెంటు -ప్రజల దీవెనలుంటే రాత్రింబవళ్లు పనిచేస్తా -బంగారు తెలంగాణ మీ చేతుల్లో పెడతా -పాలమూరు ఎత్తిపోతలకు త్వరలో శంకుస్థాపన: సీఎం హైదరాబాద్, నవంబర్ 8 (టీ మీడియా): ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానం అమలుచేసి చూపుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. చెప్పిందే చేయడం, చేసేదే చెప్పడం కేసీఆర్ నైజం.. ఇతర రాజకీయ నాయకుల్లాగా కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేయడం నాకు రాదు అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలను ఒకటొకటిగా అమలుచేస్తూ వస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో శనివారం ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇదే సమయంలో వివిధ జిల్లాల్లో ఆయా జిల్లాల మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభించారు. వద్ధులు, వితంతువులకు నెలకు రూ వికలాంగులకు రూ.1500 అందించే ఈ పథకం కింద సుమారు 50 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ఫించన్లు అందచేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారంకోసం చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తున్నదని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం అహరహం కషి జరుపుతున్నదని అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలుచేస్తూ వస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు ఫించన్ల పథకం ప్రారంభించామని చెప్పారు. ప్రజల దీవెనలు ఉంటే రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి బంగారు తెలంగాణ రాష్ర్టాన్ని తయారుచేసి ప్రజలచేతుల్లో పెడుతానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో ఆత్మబలిదానాలు జరిగాయి. నేను చావు అంచువరకు వెళ్లి మీ అందరి దయవల్ల బతికి బయటపడ్డా రాష్ర్టాన్ని సాధించుకున్నాం. అందరం కలిసి బంగారు తెలంగాణను తయారు చేసుకుందాం అని సీఎం చంద్రశేఖర్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. వట్టిగ మాటలు చెబితే కాదు, కష్టపడి పనిచేయాలిఅని ముఖ్యమంత్రి ఉద్బోధించారు. దొంగలు.. గజ దొంగలు లక్షలకు లక్షలు తింటుంటే పేదవాళ్లకు నెలకు రూ.1000 ఇస్తే పోయేదేమీ ఉండదు. ఇంకా ఎవరైనా పెన్షన్లు

రాని వారుఉంటే, అర్హులైనవారు ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. అధికారులతో పరిశీలన చేయించి తప్పకుండా అర్హులైనవారందరికీ పెన్షన్లు ఇప్పిస్తా. అర్హులు కానివారికి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు ఇచ్చే ముచ్చటేలేదు. – కేసీఆర్, సీఎం

వెయ్యి ఫించన్ ఇలా పుట్టింది..

ఫించన్ల పథకం రూపుదిద్దుకున్న తీరును కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పార్టీ మ్యానిఫెస్టో తయారు చేస్తున్నపుడు పెన్షన్ మొత్తం ఎంత ఉండాలనే విషయమై విస్తతంగా చర్చించామన్నారు. పార్టీ సీనియర్‌నేత, నేటి వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి ఖర్చులన్నీ లెక్కలు వేసి నెలకు రూ.600 చేద్దామని ప్రతిపాదించారని వివరించారు. అయితే తనకు తప్తి కలుగలేదని మనం పెన్షన్లు ఎందుకు ఇస్తున్నాం, వాటి ఉద్దేశ్యం ఏమిటి, ఆసరా లేని వారికి ఆర్థికపరమైన ఆసరా ఉండాలన్నదే కదా.. మరో లుగు వందలు కలిపి రూ.1000 చేయాలని చెప్పి మరీ మేనిఫెస్టోలో పెట్టించానని కేసీఆర్ వివరించారు. ఈ రోజు ఆ పథకానికి రూపమిచ్చి అమలు చేసి చూపిస్తున్నామని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి నెలా పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని తానే స్వయంగా ప్రారంభించాలనే ఉద్దేశ్యంతోనే మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చానని చెప్పారు.

అర్హులెవరికీ అన్యాయం జరుగనివ్వం.. పెన్షన్లు, రేషన్ కార్డులపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లకు కోత విధిస్తారని కొన్ని వర్గాలు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారాలేవీ నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దొంగలు.. గజ దొంగలు లక్షలకు లక్షలు తింటుంటే పేద వాళ్లకు నెలకు రూ.1000 ఇస్తే పోయేదేమీ ఉండదని సీఎం అన్నారు. అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరుగనివ్వనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో అర్హులు కాని వారికి ఎట్టి పరిస్థితిలో పెన్షన్లు ఇచ్చే ముచ్చటే లేదని చెప్పారు. గతంలో చాలా మంది అనర్హులకు, 40 సంవత్సరాల వయసున్న వారికి కూడా పెన్షన్లు ఇచ్చారు.. కొత్త రాష్ట్రం ఏర్పడింది.. ఇకపై నుంచి అలాంటి పొరపాట్లు జరగవద్దని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా పెన్షన్లు రాని వారు ఉంటే.. అర్హులైన వారు ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోండి.. అధికారులతో పరిశీలన చేయించి తప్పకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇప్పిస్తా అని కేసీఆర్ చెప్పారు.

తెలుగుదేశం ప్రభు త్వం అధికారంలో ఉనప్పుడు పెన్షన్ల కోసం ఏడాదికి రూ.67 కోట్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.730 కోట్లు ఇచ్చిందని, ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్లను కేటాయించిందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనితో పాటు రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి 4 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 6 కిలోలకు పెంచామని, కుటుంబానికి నెలకు 20 కిలోలు మాత్రమే అనే నిబంధనను కూడా సడలించి కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

మూడేండ్లలో ఇంటింటికీ నల్లా నీరు..24 గంటల కరెంటు.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని రూ. 35వేల కోట్లతో మూడేండ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతి ఇంటికీ మంచినీటి నల్లా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడేండ్లలో ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీళ్లు అందిస్తా.. నల్లా నీళ్లతో ఆడ బిడ్డల కాళ్లు కడుగుతా.. ఒక్క ఆడబిడ్డ కూడా మంచినీళ్ల కోసం బిందెలతో బయటికి వెళ్లే పరిస్థితి ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. అలాగే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు కూడా తీరిపోతాయని చెప్పారు. అప్పటి వరకు ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు ఇబ్బందులు ఉంటాయని తాను ఎన్నికల ప్రచార సభల్లోనే చెప్పానని గుర్తు చేశారు. తాను ఏ విషయం ప్రజల ముందు దాచి పెట్టలేదని అన్నారు. నాకు అబద్దాలు చెప్పడం రాదు. నా జన్మలో అది లేదు..మాయ మాటలు చెప్పి మోసం చేయను..ఉన్నది ఉన్నట్టు చెబుతా.. కరెంటు బజార్లో దొరికే వస్తువు కాదు. ఇప్పటికిపుడు కావాలంటే ఇవ్వడం సాధ్యం కాదు.

పరిస్థితి మెరుగు పరిచేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నా అని చెప్పారు. ఇటీవలే చత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆయన తెలిపారు. మూడేండ్ల తర్వాత 24 గంటల పాటు కరెంటు ఇస్తామని చెప్పారు. రెప్పపాటు కూడా కోతలు లేకుండా చూస్తామని అన్నారు. రాజకీయ నాయకులకు ఏదైనా చెప్పాలంటే ధైర్యం ఉండాలి. చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి. నేను చెబుతున్నా.. 24 గంటల కరెంటుపతి ఇంటికి నల్లానీరు ఇవ్వకపోతే 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలను ఓట్లు వేయమని కూడా అడుగదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.