
– చైర్‌పర్సన్లతోపాటు సభ్యుల ప్రమాణం – పండుగ వాతావరణంలో బాధ్యతల స్వీకరణ – పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
రాష్ట్రంలో కొత్త జెడ్పీలకు పాలకవర్గాలు కొలువుదీరాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కొత్త జెడ్పీ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జెడ్పీలకు కొత్త పాలకమండళ్లు వచ్చే నెలలో కొలువుదీరనున్నా యి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ గడువు ముగియని కారణంగా సదరు నాలుగు జిల్లాల కొత్త చైర్మన్లు ఆగస్టు నెలలో బాధ్యతలు చేపట్టనున్నా రు. మిగతా 28 జిల్లాల్లో కొత్త వారి ప్రమాణ స్వీకారోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. కలెక్టర్లు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని కొత్త పాలకమండలి సభ్యులను అభినందించారు.

పలుచోట్ల పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి.. జనగామ జెడ్పీ చైర్మన్‌గా పాగాల సంపత్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్‌గా గిరబోయిన భాగ్యలక్ష్మితోపాటు 10మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా మారపల్లి సుధీర్‌కుమార్, వైస్‌చైర్మన్‌గా గజ్జెల్లి శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ నూతన జెడ్పీ పాలకవర్గాన్ని అభినందించారు. వరంగల్ రూర ల్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతి ప్రమా ణ స్వీకారం చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర జ్యోతి సీఎం కేసీఆర్ సందేశాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తరఫున సభలో చదివి వినిపించారు. యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జెడ్పీటీసీల పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. కార్యక్రమంలో ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యే లు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

నల్లగొండలో.. నల్లగొండ జెడ్పీ చైర్మన్‌గా బండా నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఈ పెద్దులుతో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యే లు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల నర్సింహ య్య, చిరుమర్తి లింగయ్య, రమావత్ రవీంద్రకుమార్, నల్లబోతు భాస్కర్‌రావు పాల్గొన్నారు. సూర్యాపేట జెడ్పీ చైర్‌పర్సన్‌గా దీపికాయుగంధర్‌రావు, వైస్ చైర్మన్‌గా గోపగాని వెంకటనారాయణ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ అమయ్‌కుమార్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు వేంరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొని నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించారు. నిర్మల్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి ప్రమాణం చేయగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖనాయక్ పాల్గొన్నారు.

పాలమూరులో.. మహబూబ్‌నగర్ చైర్‌పర్సన్‌గా స్వర్ణసుధాకర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా గొల్లపల్లి యాదయ్యతోపాటు, జెడ్పీటీసీ సభ్యులతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రమా ణం చేయించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొత్త సభ్యులకు స్వీట్లు తినిపించారు.వనపర్తి జెడ్పీ చైర్మన్‌గా లోకనాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా జీ వామన్ గౌడ్‌తోపాటు సభ్యులతో కలెక్టర్ శ్వేతామొహంతి ప్ర మాణం చేయించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి నూతన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.

కరీంనగర్‌లో.. కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా కనుమల్ల విజయ, ఉపాధ్యక్షులుగా గోపాల్‌రావుతోపాటు సభ్యులు, కోఆప్షన్ సభ్యులతో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, మాజీ జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ హాజరై నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధు, వైస్ చైర్‌పర్సన్‌గా మండిగ రేణుకతోపాటు సభ్యులతో కలెక్టర్ శ్రీ దేవసేన ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ఉమ్మడి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ హాజరయ్యారు.

ఇందూర్‌లో.. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్‌గా దాదన్నగారి విఠల్‌రావు, వైస్‌చైర్‌పర్సన్‌గా రజిత యాదవ్‌తోపాటు, జెడ్పీటీసీలతో కలెక్టర్ రామ్మోహన్‌రావు, కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా దఫేదార్ శోభతో కలెక్టర్ సత్యనారాయణ ప్రమాణం చేయించారు. ఆయా కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజుల సురేందర్, ఎమ్మెల్సీలు వీజీగౌడ్, ఆకుల లలిత, రాజేశ్వర్ పాల్గొన్నారు. మేడ్చల్ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డితోపాటు సభ్యులతో కలెక్టర్ ఎంవీ రెడ్డి ప్ర మాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జెడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డిలతో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు పాల్గొన్నారు.

