టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ రాష్ర్టానికి కాబోయే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో గురువారం ఐపీఎస్ అధికారులు భేటీ అయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి, ఐజీ శివధర్‌రెడ్డితోపాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ బంజారాహిల్స్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏయే అధికారులను ఎక్కడెక్కడ నియమించాలన్న దానిపై చర్చ జరిగినట్టుగా సమాచారం. జూన్ 2న కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టనుండటం, జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర ఏర్పాటు సంబరాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు.