Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేసీఆర్ ప్రధాని ఎందుకు కాకూడదు?

ఆంధ్రప్రభ దినపత్రిక తెలంగాణ ఎడిషన్ పేజ్ వన్ స్టోరీ
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు..
వచ్చే ప్రభుత్వంలో మేమే కీలకం
మన్మోహన్‌, వెూడీ ప్రధాని అవుతారని ఊహించారా
44 సీట్లుండే రాహులే కలగనడం లేదా.. 16 సీట్లుండే కేసీఆర్‌ కోరుకోకూడదా
కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ పార్టీలు కాదు.. జాతికి ద్రోహం చేసిన పార్టీలు
ఏప్రిల్‌ 11 తర్వాత ఇతర రాష్ట్రాలకు కేసీఆర్‌
మాకన్నా జాతీయభావనలు ఎవరికి ఉన్నాయి
బీజేపీ, కాంగ్రెస్‌ మాకే మద్దతిచ్చే పరిస్థితి రాదనుకుంటున్నారా
రాష్ట్రంలో కాంగ్రెస్‌తోనే మాకు పోటీ
ఆంధ్రా రాజకీయాలన్నీ కేసీఆర్‌ చుట్టే తిరుగుతున్నారు
ఏపీ సీఎం చంద్రబాబుకు రిటైర్మెంట్‌ ఖాయం
గ్రేటర్‌లోనే కాదు జిల్లాల్లోనూ ప్రచారం చేస్తా
ఆంధ్రప్రభతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక ఇంటర్వ్యూ

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని ఎందుకు కాకూడదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామా రావు ప్రశ్నించారు. 2003లో మన్మోహన్‌సింగ్‌ ప్రధాని అవుతా డని.. పదేళ్ళు పాలిస్తాడని ఎవరైనా ఊహించారా? 2012లో మోడీ భవిష్యత్‌ ప్రధాని అవుతాడని అనుకున్నారా? రాజకీ యాల్లో ఏదైనా జరగొచ్చు.. అలాంటపుడు కేసీఆర్‌ ఎందుకు ప్రధాని ఎందుకు కారు? 44 సీట్లున్న రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని కలగన్నపుడు 16 సీట్లున్న కేసీఆర్‌ ప్రధాని కావాలని ఎందుకు కోరుకోకూడదు? కేంద్రంలో నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ప్రభుత్వం రావాలని మేం బలంగా కోరుకుంటున్నాం.. వస్తుందని విశ్వసిస్తున్నాం. ఆ సందర్భంలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సాధించే పదహారే కీలకంగా మారబోతున్నాయి అని కేటీఆర్‌ తన అంచనాలు ఆవిష్కరించారు. మంగళవారం ఆధ్రప్రభకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు, ప్రచారం తీరుతెన్నులు, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ప్రణాళిక, ఏపీ రాజకీయాలపై స్పందించారు.

ప్ర: ఈ ఎన్నికల్లో మీవ్యూహమేంటి? టీఆర్‌ఎస్‌కు విజయావ కాశాలు ఎలా ఉన్నాయి?
జ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల, అభ్యర్థుల పట్ల పూర్తి సానుకూలత ఉంది. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో 47 శాతం ఓట్లువచ్చాయి. ట్రక్కు గర్తు వల్ల 2 లక్షల ఓట్లు పోయాయి. ఎన్నికల తర్వాత చేరికలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. కేసీఆర్‌ పథకాలను దేశమంతా అనుసరిస్తోంది. ప్రధానంగా సీఎం మానసపుత్రికగా ఉన్న రైతుబంధులాంటి పథకాలు దేశం అంతటా ఆచరించాల్సి వస్తోంది. పోయినసారి కూడా 15ఎంపీ సీట్లు ఉన్నాయిగా.. ఇపుడు గెలిస్తే ఒరిగేదేంటి? అని ప్రశ్నిస్తున్నారు. అపుడు మోడీకి ఏకపక్ష విజయం దక్కింది. కానీ ఇపుడు ఆపరిస్థితి లేదు. మోడీ వేడి తగ్గింది. ఆ కూటమికి 160-170కి మించి వచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో కాంగ్రెస్‌కు 100-110కి మించే పరిస్థితి లేదు. 2003లో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అవుతారని ఎవరైనా ఊహించారా? 2012లో భవిష్యత్‌ ప్రధాని మోడీ అవుతారాని ఎవరైనా కలగన్నారా? రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. తృణమూల్‌, బిజూ జనతాదళ్‌, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీలు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు దూరంగా ఉన్న పార్టీలు. ఖచ్చితంగా రేప్పొద్దున్న మేమంతా మాట్లాడుకుంటం. 150-160 స్థానాలతో మేమంతా ఒకదగ్గర ఉంటే ఖచ్చితంగా మేం చెప్పినట్లే ప్రభుత్వం ఏర్పడుతుంది.

ప్ర: మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ ప్రధాని అన్న ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు? పార్టీపరంగా దీనిపై ప్రణాళికా ఉందా?
జ: నేను మళ్ళీ చెబుతున్నా. 44 సీట్లున్న రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని అనుకున్నపుడు 16 సీట్లున్న కేసీఆర్‌ ప్రధాని ఎందుకు కాకూడదు? ప్రధాని కావాలన్నది మా మంత్రులు.. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ఆకాంక్ష. రేపు రాజకీయాలు ఏమలుపైనా తీసుకోవచ్చు. 71 ఏండ్లుగా ఆ రెండు పార్టీలే పాలిస్తున్నాయిగా? దేశం ఏం మారింది? అవి జాతీయ పార్టీలు కావు.. జాతికి ద్రోహం చేసిన పార్టీలు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అసలు చెప్పాల్సి వస్తే దేశంలో జాతీయ పార్టీలు లేవు.. అవి పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలు. మేం చిన్నసైజు ప్రాంతీయ పార్టీలం. దక్షిణాదిలోని ఆరు రాష్ట్రాల్లో ఐదు చోట్ల బీజేపీ ఉనికేలేదు. ఇక కాంగ్రెస్‌ పార్టీ దేశంలో ఎక్కడా 20 సీట్లు వచ్చే రాష్ట్రం లేదు. గత ముప్పయ్‌ ఏళ్ళుగా దేశంలో సంకీర్ణ శకమే నడుస్తోంది. దేశానికి మోడీ, రాహల్‌లను ఎంచుకునే ఖర్మ పట్టలేదు. నాన్‌-కాంగ్రెస్‌, నాన్‌-బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం.

ప్ర : దేశంలో బిజెపి లేదా కాంగ్రెస్‌లకు కొంచెం మెజారిటీ తగ్గితే మీరు మద్దతిస్తారా?
జ : అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారే మాకు మద్దతు ఇచ్చే పరిస్థితి రాదని ఎందుకు అనుకుంటున్నారు? మాకన్నా జాతీయ భావాలు, ఉదార హృదయం ఎవరికి ఎక్కువ ఉంది. పుల్వామా సంఘటనప్పుడు మేం వారం రోజులు రాజకీయ కార్యకలాపాలు మానేశాం. కానీ ప్రధాని మోడీ బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొంటే, రాహుల్‌ రాజకీయ విమర్శల్లో మునిగిపోయారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినపుడు, కేరళకు వరదలు వచ్చినపుడు మాకంటే బాగా ఎవరు స్పందించారు? కాశ్మీర్‌ అయినా, జార్ఖండ్‌ అయినా కేసీఆర్‌ స్పందించినంత ఉదారంగా ఎవరూ స్పందించలేదు.

ప్ర: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై మీ అంచనాలేంటి?
జ :ఏపీ సీఎం చంద్రబాబు రిటైర్‌మెంట్‌కు టైమ్‌ దగ్గరపడింది. అన్ని సర్వేలు ఆయన ఓటమిని సూచిస్తున్నాయి. కేసీఆర్‌ వచ్చి పరిపాలిస్తాడని పిచ్చి ప్రచారం చేస్తున్నారు. మేం వెళ్ళి పాలిస్తామా ఏపీని? మేం అక్కడ పోటీ చేస్తున్నామా? అక్కడి రాజకీయాలతో మాకేం పని? చంద్రబాబు, జగన్‌, పవన్‌ అందరి ప్రచారమూ కేసీఆర్‌ చుట్టే తిరుగుతోంది. చంద్రబాబు చేసిందేమీ లేక సెంటిమెంట్‌ రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నా రు. పోలవరం 2018లో పూరి ్తచేసి తీరుతామని అసెంబ్లిdలో చెప్పారు. అయిందో లేదో మాకు తెలీదు. విజయవాడ మెట్రోపూర్తి చేస్తాం.. కనకదుర్గ ఫ్లైఓవర్‌ పూరి ్తచేస్తాం అంటూ చాలా చెప్పారు. ఏం జరిగిందో ప్రజలకు తెలుసు.

ప్ర: పవన్‌ కల్యాణ్‌ తెలంగాణలో ఆంధ్రావాళ్ళని కొడుతున్నా రని ప్రచారంలో చెబుతున్నారు?
జ: పవన్‌కల్యాణ్‌కు ఆ స్థాయిలో ఏం ఇబ్బంది ఉందో తెలీదు. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి బ్రహ్మాండంగా హెరిటేజ్‌ను విస్తరించుకుంటూ, కొత్త యూనిట్లు స్థాపిస్తూ వెళుతున్నారు. ఈమధ్య కూడా ఉప్పల్‌లో కొత్త విస్తరణ యూనిట్‌ ప్రారంభించారు. వారికేం ఇబ్బంది లేదు. పవన్‌కల్యాణ్‌ కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలో బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆంధ్రా, తెలంగాణ బేధాభిప్రాయాలు ఎక్కడా కనిపించడం లదు. ప్రజలు కూడా ఉన్నాయని భావించడంలేదు. లేకుంటే మేం హైదరాబాద్‌లో అన్ని సీట్లు గెలిచేవాళ్లం కాదు. కేసీఆర్‌పై వ్యతిరేకత ఉంటే జీహెచ్‌ఎంసిీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధిస్తామా? అసెంబ్లిd ఎన్నికల్లో గ్రేటర్‌లో 18 సీట్లు గెలుస్తామా? కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా కేసీఆర్‌పట్ల సానుకూలత బాగా ఉంది. మామీద ఇంత విద్వేషం ఉంటే చంద్రబాబు హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా పొత్తు ప్రతిపాదన ఎందుకు తెచ్చారు? కేసీఆర్‌ ఇలాంటోడు.. అలాంటోడు అని ఇపుడు నోటికొచ్చి నట్లు తిడుతున్నారు. ఆంధ్ర ప్రజలు చైతన్యవంతులు. విజ్ఞతతో నిర్ణయం తీసుకుంటారు.

ప్ర: మచిలీపట్నంపోర్టు ఎత్తుకుపోతారన్న ఆరోపణలు కూడా మీమీద చేస్తున్నారు?
జ: హహహ. విచిత్ర ఆరోపణలు చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టు ఎత్తుకు పోతారని, పోలవరమని, ఇంకోటని. కనకదుర్గ ఫ్లైఓవర్‌కు ఎవరు అడ్డంపడ్డారు? విజయవాడ మెట్రో డేట్‌ పెట్టి పూర్తి చేస్తామని చెప్పారు.. ఏమయింది.. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు.

ప్ర : ఎన్నికల్లో మీరు సవాల్‌చేసి లక్ష్యాలు సాధిస్తారు. ఈఎన్నికల్లో మీరు విసిరే సవాల్‌ ఉందా? ఎవరి డిపాజిట్లు పోగొడుతున్నారు? జ: మేం పదహారు స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. డిపాజిట్లు పోగొడుతాం.. అదీ, ఇదీ మాట్లాడడం సబబు కాదు. రాజకీయపార్టీగా మేం పోటీచేస్తాం. మాకు సికింద్రాబాద్‌లో బీజేపీతో పోటీ ఉంది. మిగతా పదిహేను స్థానాల్లో కాంగ్రెస్‌తోనే పోటీ. పోటీ బలంగానే ఉంది. పోటీ లేదని చెప్పడం సరికాదు. అన్ని స్థానాలు గెలుస్తామన్న విశ్వాసం ఉంది.

ప్ర: సిట్టింగ్‌లు కొందరికి టికెట్లివ్వలేదు. ఖమ్మం,పెద్దపల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల చేతిలో ఓడినవాళ్లకే టికెట్లు ఇచ్చారు. ఇది దేనికి సంకేతం?
జ: మేమే ఓడించాం కదా వాళ్ళని. ఈసారి గెలుస్తరేమో చూద్దాం. మాది ఫక్తు రాజకీయ పార్టీ. అన్ని రాజకీయ పార్టీలు సిట్టింగ్‌లు కొందరిని మార్చడం మామూలే.

ప్ర: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు సన్నిహితుడి గా పేరుంది. ఆయనకు కూడా టికెట్‌ రాలేదంటే?
జ: అవును సన్నిహితుడే. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక కోణాల్లో ఆలోచించి టికెట్లు ఖరారు చేశారు. కొందరిని మార్చారు. విజయమే లక్ష్యంగా భవిష్యత్‌ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయమే ఫైనల్‌.

ప్ర: పెద్దపల్లి సీటు విషయమై మాజీ ఎంపీ వివేక్‌ ఆరోపణలు చేస్తున్నారు?
జ: నిన్నటిదాకా మంచిగున్న పార్టీ టికెట్‌ ఇయ్యకపోయేసరికి చెడ్డగయితదా? వివేక్‌ అని కాదు ఎవరైనా విమర్శలు చేసేముందు ఆలోచించాలి.

ప్ర: అధికారంలోకి రాగానే మళ్లి విపక్ష ఎమ్మెల్యేల ఫిరా యింపులను ప్రోత్సహించారన్న విమర్శలపై ఏమంటారు?
జ: కొందరు ఎమ్మెల్యేలు అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతామని ప్రకటించారు. కాంగ్రెస్‌ నాయకత్వంపై విశ్వాసంలేక భవిష్యత్తు కోసం టీఆర్‌ఎస్‌లోకి వస్తామంటున్నారు. అవసరమైతే రాజీనామా చేస్తామంటున్నారు.. ఇందులో నైతికత ఎక్కడిది? ఎన్నికల సమయంలో వలసలు సహజం. కొండా విశ్వేశ్వరరెడ్డి మాపార్టీ నుండి వెళ్ళాడు కదా.. రోహిత్‌ రెడ్డి మాపార్టీ నుండి వెళ్ళి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే అయ్యాడు కదా? ఇపుడున్న వారంతా పుట్టుకతో కాంగ్రెస్‌ నేతలా? ఎక్కడా వేరే పార్టీల నుండి వచ్చిన వారులేరా? ఒక్క ఎమ్మెల్యేలే కాదు.. అన్ని స్థాయిల నేతలూ చేరుతున్నారు. ఇది ఆలోచించుకోవాలి.

ప్ర: కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయబోతున్నారా?
జ: ఏప్రిల్‌ 11తర్వాత కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్తారు. ఆ దిశగా సమాలోచనలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. కొందరు ఆహ్వానిస్తున్నారు. మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడికి వెళ్తారు.. ఏమేం చేస్తారు అన్నది త్వరలోనే చెబుతారు.

ప్ర: మీ ప్రచారం ఎలా ఉండబోతోంది?
జ: ఈనెల 30నుండి ప్రచారం ఉండబోతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మాత్రమే కాక జిల్లాల్లోనూ ప్రచారానికి వెళ్తా. మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రచారానికి షెడ్యూల్స్‌ ఖరారయ్యాయి. అధినేత షెడ్యూల్‌ను బట్టి కార్యక్రమాలను రూపొందించుకున్నాం. వీలైనన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తా.

Source : http://prabhanews.com

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.