-సీఎంగా ఏడాది పాలనకు 79 శాతం మార్కులు -ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు బంపర్ మెజారిటీ -ఎక్స్‌ప్రెస్ టీవీ సర్వేలో వెల్లడి
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన భేష్ అని 79 శాతం మంది ప్రజలు పేర్కొన్నారు. ఆయన పనితీరు పట్ల 71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే తిరిగి టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఎక్స్‌ప్రెస్ టీవీ చానెల్ నిర్వహించిన సర్వే తెలిపింది. ఎక్స్‌ప్రెస్ టీవీ కోసం జేఎస్డీ టాటా ఇన్‌ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో కొలువుదీరిన తొలి తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజలేమనుకుంటున్నారన్న అంశంపై ఈ సర్వే నిర్వహించారు. మే 20నుంచి వారంపాటు నిర్వహించిన సర్వేలో రాజధాని నగరమైన హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పది జిల్లాల్లోని వివిధ వర్గాలకు చెందిన 37,100 మంది పౌరులు పాల్గొన్నారు. 18 ఏండ్ల వయస్సు పై బడిన యువతను పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ సర్వేలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన గృహిణులు, కార్మికులు, విద్యావంతులు పాల్గొన్నారు. 61 శాతం పురుషులు, 39 శాతం మహిళలు సర్వేలో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందా? తదితర అంశాలపై సర్వే జరిగింది. అంశాల వారీగా ప్రజలు ఏ విధంగా స్పందించారనే విషయంపై ఎక్స్‌ప్రెస్ టీవీ వెల్లడించిన సర్వే వివరాలివి:
1.ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది….. ?
సంతృప్తికరం 79శాతం సంతృప్తిగా లేదు 21శాతం
2.ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్‌రావు పనితీరును మీరు ఎలా చూస్తారు?
సంతృప్తికరం 71శాతం అసంతృప్తిగా 29శాతం
3.టీఆర్‌ఎస్ మంత్రుల పనితీరెలా ఉంది?
మంచిగా ఉంది 14శాతం సగటుగా ఉంది 46శాతం సంతృప్తిగా లేదు 40శాతం
4.అత్యధిక మార్కులు పొందిన మంత్రులు
హరీశ్‌రావు 44శాతం కేటీఆర్ 37శాతం ఈటల 10శాతం
5.టీఆర్‌ఎస్ సర్కార్ సాధించిన గొప్ప పనులు
1. విద్యుత్ 44శాతం 2. మిషన్ కాకతీయ 26శాతం 3. పెన్షన్లు 24శాతం 4. ఇతర పనులు 6శాతం
6.కేసీఆర్ సర్కార్ తక్షణమే దృష్టి సారించాల్సిన పనులు
1. నిరుద్యోగం 40శాతం 2. రైతుల ఆత్మహత్యలు 20శాతం 3. ఇతర అంశాలు 30 శాతం (వ్యవసాయం, గృహనిర్మాణం, తాగునీరు)
7.వచ్చే నాలుగేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన హామీలను నిలబెట్టుకుంటారా?
1. నిలబెట్టుకుంటారు 66శాతం 2. నిలబెట్టుకోలేరు 30శాతం 3. చెప్పలేం 4శాతం
8.రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది…?
1. మంచిగా ఉంది 8శాతం 2. సగటుగా ఉంది 25శాతం 3. మంచిగా లేదు 67శాతం
9.కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రబలమైన శక్తిగా ఎదుగుతుందా….?
1. అవును 39శాతం 2. లేదు 51శాతం
10.ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపార్టీకి ఓటు వేస్తారు….?
1. టీఆర్‌ఎస్ 61శాతం 2.టీడీపీ-బీజేపీ 13శాతం 3.కాంగ్రెస్ 22శాతం
11.టీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా…?
1. అవును 56శాతం 2. లేదు 36శాతం 3. చెప్పలేం 8శాతం