Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేసీఆర్ నాయకత్వం చారిత్రక అవసరం

క్షతగాత్ర తెలంగాణ గాయాలను మాన్పి,మనల్ని మనం శక్తి కూడగట్టు కోవాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. అందుకు స్థిరమైన రాజకీయ వ్యవస్థ, బలమైన నాయకుడు, భవిష్యత్తును భద్రంగా నిర్మించుకోగల విజన్‌తో కూడిన మ్యానిఫెస్టో, దానిని చిత్తశుద్ధితో అమలు చేయగల మంత్రివర్గం, సిబ్బంది ఇలా పునర్నిర్మాణానికి పునరంకితమయ్యే సకల శక్తుల సమన్వయమే బంగారు తెలంగాణకు బాటలు వేయగలదు.

రాజకీయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుని ప్రజ్ఞ, అనుభవం, సాహసం ఆధారంగానే ఆ నిర్ణయాల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీకి ఒక నాయకుడుంటాడు. అందులోనూ జాతీయ పార్టీల నాయకత్వానికి, ప్రాంతీయ పార్టీల నాయకత్వానికి వ్యత్యాసం చాలా ఉంటుంది. జాతీయ పార్టీ ల నాయకత్వం చాలా సమీకరణాలు పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వివి ధ ప్రాంతాల, నేతల ప్రాథమ్యాల సంతులితలను కాపాడుతూ నాయకత్వం అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలలో అం తర్గత ప్రజాస్వామ్యం పైకి కనిపిస్తున్నప్పటికీ, అంతి మ నిర్ణయం అధినేత అభీష్టం, అంచనాలు, సమీకరణాలకు అనుగుణంగానే ఉంటుంది.

ప్రాంతీయ పార్టీల పుట్టుక, అస్తిత్వం కూడా కొన్ని ప్రత్యేక అవసరాలు, ఆకాంక్షలు, ప్రయోజనాలపై ఆధారపడి ఉం టుంది. అవి నెరవేరాలంటే ఆ నాయకుని శక్తి సామర్థ్యాలు, అనుభవం, కాలానుగుణమైన నిర్ణయాలు తీసుకోగల చైతన్యం అన్నింటికీ మించి కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతోనో లేదా సమరం సాగిస్తూనో తమ ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడే సాహసి అయి ఉండడం ఎంతో అవసరం.ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయ యవనికపై మరో ప్రాంతీయ పార్టీగా టీఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతున్న చారిత్రక సందర్భాన్ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఉద్యమ యోధుడిగా విశ్వరూపాన్ని ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణను దేశంలోనే ఆదర్శవంతమైన, అభివద్ధిలో అగ్రగామిగా నిలిచే, అత్యున్నత జీవన ప్రమాణాలతో అలరారే రాష్ట్రంగా తీర్చిదిద్దే సంకల్పంతో కొత్త పాత్రను పోషించబోతున్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ పుట్టుకకు ఉన్నతమైన చరిత్ర ఉంది. దాని మనుగడకు పోరాటాలు, త్యాగాలు జమిలిగా సాగిన నేపథ్యం ఉన్నది. దశాబ్దాల వివక్ష, అణచివేతల నుంచి మాతభూమిని విముక్తం చేసిన లక్ష్యం ఉంది.ఆ క్ష్యాన్ని సాధించడానికి సాగించిన సమరంలో యావత్ తెలంగాణ సమాజం టీఆర్‌ఎస్ ని గుండెల్లో దాచుకొని అండగా నిలిచి ప్రకటించిన బలమైన మద్దతు ఉంది. చివరికి రాష్ర్టాన్ని సాధించుకున్న తరుణంలో అనేక సంక్లిష్టతల్లోంచి ప్రజలు పాలు, నీళ్ళను వేరు చేసే హంసల్లా ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కావాల్సిన మెజార్టీని అందించి అధికార పీఠం పై కూర్చోబెట్టబోతున్నారు.

ఇక ఇప్పుడు మిగిలింది తెలంగాణ ప్రజల ఆశలన్నీ ఆచరణ రూపంలోకి రావ డమే. తెలంగాణలో జీవన విధ్వంసమే జరిగి ఉండకపోతే, సాంస్కతిక విచ్ఛిన్నతకు గురికాకపోతే, వివక్ష విశంఖలంగా కొనసాగి ఉండకపోతే తెలంగాణ ఉద్యమంలో మేధావులతో పాటు సబ్బండ వర్ణాల ప్రజలు కలిసి వచ్చే వారు కాదు. ఈ పరిణామాల ఫలితంగా ఛిద్రమైన ఒక్కో రంగాన్ని బలోపేతం చేసుకుంటూ పునర్నించుకోవాల్సిన కర్తవ్యం కేసీఆర్‌పై ఉంది.త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రం లో ఇంటి పార్టీగా భావించిన టీఆర్‌ఎస్ అధికారంలో ఉండాలని, ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన కేసీఆర్ గారే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ సమాజమంతా కోరుకుంటున్నది. అందు కే విశ్లేషకుల విశ్లేషణలను తోసిరాజని టీఆర్‌ఎస్‌కు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టబోతున్న సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి.

తెలంగాణ ప్రజలు ఈ ఎన్నికలను ఐదేళ్ళకోసారి ప్రహసనంగా జరిగే ఎన్నికల్లా తీసుకోకపోవడానికి కారణం, ఇంత కాలం అనుభవించిన వేదనాభరిత జీవితాలకు, సమస్యలకు పరిష్కారం టీఆర్‌ఎస్ ద్వారా లభిస్తుందన్న విశ్వాసం.ఏండ్లకేండ్లుగా కాంగ్రె స్, టీడీపీ పాలనలో తెలంగాణలో ప్రజలకు ఒరిగిందేమిటో చూశారు. ఒక ప్రాంతానికి అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకొని వారి మానాన వారిని వదిలేసిన కారణంగా రైతుల ఆత్మహత్యలు, గల్ఫ్ బాధితుల మరణాలు, నెత్తుటి ఏరులు పారించిన రాజ్యహింస.. వీన్నింటి కారణంగా గాలిలో దీపా ల్లా ప్రజల జీవితాలు మారిపోయాయి.

కేసీఆర్ నాయకత్వం ద్వారా ఈ పరిస్థితులన్ని మార్పు చెంది జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న ఆశతో అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక యుద్ధం ముగిసింది. యుద్ధానంతరం మనం విజేతలుగా నిలిచిఉండవచ్చు. కానీ, ఈ విజయం తో సంతప్తి పడితే సరిపోదు! క్షతగాత్ర తెలంగాణ గాయాలను మాన్పి,మనల్ని మనం శక్తి కూడగట్టు కోవాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది. అందుకు స్థిరమైన రాజకీయ వ్యవస్థ, బలమైన నాయకుడు, భవిష్యత్తును భద్రంగా నిర్మించుకోగల విజన్‌తో కూడిన మ్యానిఫెస్టో, దానిని చిత్తశుద్ధితో అమలు చేయగల మంత్రివర్గం, సిబ్బంది ఇలా పునర్నిర్మాణానికి పునరంకితమయ్యే సకల శక్తుల సమన్వయమే బంగారు తెలంగాణకు బాటలు వేయగలదు.

ఇది సాధ్యం కావాలంటే ఒక ఆశయాన్ని కలగన్నవాడు, ఆ కలను సాకారం చేయడానికి యుద్ధాన్ని నడిపిన వాడు,గాయాలెన్నో మోసినవాడు, కాలాన్ని శాసించినవాడు, తన ప్రాణం జీవిత గానం తెలంగానం గా చేసుకొని ఈ మట్టితో మమేకమై, ఈ మనుషుల ఆత్మలను ఆవాహనం చేసుకొని ఆఖరి శ్వాస కూడా ప్రజల అభివద్ధికి ఆశ్వాసనగా నిలుపగల కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలి. పుట్టిన బిడ్డ కన్నతల్లి చేతుల్లో సురక్షితంగా ఎదిగినట్లు, తెచ్చి న రాష్ట్రం సాధకుడైన ఈ తండ్రి చేతుల్లోనే సుభిక్షంగా ఉండగలదు. రాష్ర్టాన్ని సాధించిన తప్తి తనకు జన్మజన్మలకు మిగిలిపోయేదని ఆయన అనేక సార్లు బహిర్గతపరిచారు. కానీ, అంతర్గతంగా ఎన్నెన్ని ఉన్నత ఆశయాలున్నాయో ఆంతరంగిక చర్చల్లో భాగస్వాములైన నాలాంటి కొందరికి బాగా తెలుసు. తెలంగాణను తన చేతుల్లో పురుడు పోసుకున్న బిడ్డగా భావిస్తున్నారు. దాని ఆలనాపాలనా చూడడం తన బాధ్యతగా భావిస్తున్నారు. అందుకు అవరోధంగా నిలిచే పొలిటికల్ కరప్షన్‌ను ఖండఖండాలుగా ఖండిస్తానంటున్నారు.

అందుకు తన కన్న కొడుకు, బిడ్డ కూడా మినహాయింపు కాదంటున్నారు. దేశంలోనే నెంబర్ వన్ స్టేట్‌గా తెలంగాణను నిలపాలన్న ఆశయమే తన జీవిత అంతిమ లక్ష్యమంటున్నారు. పదేండ్ల వరకు సీమాంధ్రులతో పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి మనల్నిఅప్రమత్తం చేస్తున్నారు. దళితుల అభివద్ధికి పెద్దపీట వేయబోతున్నారు.అభివద్ధికి ఆలంబన విద్యయేనని, అనేక సమస్యల పరిష్కారానికి విద్య పూనికగా నిలుస్తుందని, అందుకే కె.జి. నుంచి పి.జి. వరకు నాణ్యమైన విద్యను అందించడం తన డ్రీవ్‌ు ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. రాష్ర్టాన్ని సాధించడంలోనే కాదు, దాని పునర్నిర్మాణంలోనూ కేసీఆర్ మాటల మనిషి మాత్రమే కాదు, చేతల మనిషి అని నిరూపించుకోవాలని కతనిశ్చయంతో ఉన్నారు.

దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ప్రకటన అణగారిన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షించి చేసినదే. తెలంగాణ సమగ్ర అభివద్ధిలోనే దళితుల అభివద్ధి కూడా అంతర్భాగంగా ఉంది. ఆ సమగ్రాభివద్ధిని సాధించాలంటే రాష్ట్రంలోనే కాకుండా జాతీ య స్థాయిలో సమర్థ నాయకునిగా గుర్తింపు పొంది, రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల ప్రతిభావంతుడైన నాయకుడు కేసీఆర్ సీఎం కావాల్సిన చారిత్రక అవసరం తెలంగాణకు ఉంది. సమకాలీన రాజకీయపరిణామాలకు అనుగుణంగా, విధానాలను రూపొందించుకుంటూ రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించగల రాజకీయ ద్రష్ట కేసీఆర్.

ముఖ్యంగా పార్టీ అధినేతయే ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం ద్వారా అంతర్గత క్రమశిక్షణ పరిఢవిల్లుతుంది. మంత్రులు రాజకీయ అవినీతిలో భాగస్వాములు కావడానికి జంకుతారు. పాలన సం పూర్ణ నియంత్రణలో ఉంటుంది. ఉద్యమం జరిగిన 14 ఏళ్ల కాలంలో తాను పాదం మోపిన ప్రతి చోట ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు కారణాలను ఆయ న అధ్యయనం చేశారు. వాటి పరిష్కార సాధ్యాసాధ్యాలను అనేకులతో చర్చించి తన మ్యానిఫెస్టోను రూపొందించుకున్నారు. ఆ మ్యానిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయడానికి కాలానుగుణంగా తీసుకోవాల్సిన ఎంతటి కఠిన నిర్ణయాలకైనా సంపూ ర్ణ మద్దతును కూడగట్టుకొని, సఫలీకతం చేయగల సత్తా ఆయనకు మాత్రమే ఉన్నది. దళితనేతలతో ప్రకటనలిప్పిస్తున్నారన్నది సహేతుకం కాదు. తెలంగాణ అభివద్ధితో ముడిపడి ఉన్న సమర్థ నాయకుని ప్రాతినిథ్యాన్ని అందరు ఆహ్వానిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తూ అధికారాన్ని అందించబోతున్న ప్రజలు,ఆయన ముఖ్యమంత్రిగా లేని తెలంగాణను ఊహించడానికి సిద్ధంగా లేరు.

అంకితభావం గల నాయకులు అభివద్ధికి ఎలా దోహదపడుతారో చరిత్ర మనకు చెబుతూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం అణుబాంబులతో ఛిద్రమైన జపాన్ అక్కడి పాలకుల సమర్థ నాయకత్వంతో గడ్డి కూడా మొలవని దేశాన్ని ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా నిలదొక్కుకునేలా చేశారు.

మన రాష్ట్రంలోని ఒక జిల్లా జనాభాను కలిగిన స్విట్జర్లాం డ్, సింగపూర్ దేశాల పాలకుల నిత్య పరిశ్రమ వల్ల అవి నేడు అగ్రగామి దేశాలుగా నిలిచాయి. ప్రపంచంలోని అనేక చిన్నచిన్న దేశాలు పాలకుల సమర్థత వల్ల స్వయం పోషకాలుగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డాయి. అపారమైన ఖనిజ సంపద, సేద్యపు భూమి, నదీ జలాలు, మానవ వనరులు గల తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా తన అస్తిత్వాన్ని తిరిగి సంపాదించుకున్నది. కానీ, తన భాషాసంస్కతులను పునరుజ్జీవింప జేసుకొని, ప్రతి యువకునికీ ఉద్యోగావకాలు దక్కి, రైతు ఇంట సిరుల పంటలు పండి, కార్మికుని కంటిలో కొత్త వెలుగులు నిండి, ఐ.టి. అనుసంధానిత భాగ్యనగర శోభలతో అన్ని రంగాల్లో అభివద్ధిని సాధించి, శత్రువు కూడా అచ్చెరువొందే విధంగా తెలంగాణ భవితవ్యాన్ని రూపొందించగల ఈ కాలం మేటి నాయకుడు కేసీఆర్. చరి త్ర పురుషునిగా మిగిలిపోయే అవకాశం వారు చేసిన త్యాగాల వల్ల కొందరికే దక్కుతుంది. ఒక పవిత్ర సంకల్పం కోసం పదవులను ఎడమకాలితో తన్నేసిన ఆయన పదవిని చేపట్టడం అంటే దాని మీద ఉన్న వ్యామోహం వల్ల కాదు. తెలంగాణ భవితవ్యాన్ని దష్టిలో ఉంచుకున్నప్పుడు, తాను ఆశించిన లక్ష్యాలను చేరుకునే వరకు తను మోయాల్సిన చారిత్రక బాధ్యత.

ఉద్యమాన్ని ఆరంభించినప్పుడు అడుగడుగునా విమర్శనాస్ర్తాలతో ముప్పేట దాడిచేసినా మొక్కవోని ధైర్యంతో ముందుకే సాగి తాననుకున్న దానిని సాధించగలిగిన ధీశాలి కేసీఆర్. ఇప్పుడు సర్వశక్తివంతమైన రాష్ట్రంగా తెలంగాణను నిర్మించడానికి కంకణబద్ధులవుతున్న ఆయనపై విమర్శలు చేసే వారెందరో ఉండవచ్చు. కానీ, విమర్శలకు వెనుకంజ వేసే నైజం ఆయనది కాదు. ఆయన నమ్మిన ఆశయం కోసం ఎంత మొండిగానైనా ముందుకు వెళ్తారు. ఈ క్రమంలో ఆయన నిర్ణయాలు కొందరికి అంతు పట్టక ఆయన వ్యక్తిత్వ హననానికి పూనుకుంటారు. ఆయన ప్రతి ఆలోచన ఎంతో పరిణతితో కూడుకున్నది. ఆచరణయోగ్యమైనది. పడిలేచిన కెరటమై, ఓడి గెలిచిన చరితయై, సకల కుట్రలను ఛేదించుకొని వర్తమానమై, ప్రవర్థమానమై విజేతగా నిలిచిన వీర తెలంగాణ కీర్తి శిఖర సమానమై నిలుస్తుం ది. అందుకు కారకుడైన కేసీఆర్ చరిత్ర పురుషుడిగా తెలంగాణ ప్రజల హదయాలలో చిరస్థాయిగా మిగిలిపోతారు. నారదాసు లక్ష్మణ్‌రావు (రచయిత: మాజీ శాసనమండలి సభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.