Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కేసీఆర్ నగారా

ప్రజల ఆజ్ఞ మేరకే ఒంటరిగా పోటీలోకి… కేసీఆర్ అధికారంలోకి రాడనేది పగటికలే – 75+14 సీట్లు టీఆర్‌ఎస్‌కేనని సర్వే చెబుతున్నది.. – జేబులు నింపుకొన్నందుకే పొన్నాలపై సీబీఐ విచారణ.. టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యలు -69 మందితో టీఆర్‌ఎస్ తొలి జాబితా… టీఆర్‌ఎస్‌లో చేరిన బాజిరెడ్డి, చంద్రావతి -ఆంధ్రోళ్ల పార్టీకి ఓట్లెందుకేయాలి? -విజయవాడలో మనకు ఓట్లు వేస్తారా? -వాళ్లకు ఉన్న జిడ్డు.. మనకు ఉండొద్దా? -టీఆర్‌ఎస్ నుంచి సీఎం అయితే తప్పా? -తెలంగాణపై వెంకయ్య, బాబు కుట్రలు -కిరాయి మనుషుల పాలన మనకొద్దు: కేసీఆర్

KCR 05-04-14

చంద్రబాబు అంటేనే గోముఖవ్యాఘ్రం. తెలంగాణ పాలిట శని ఆయన. పచ్చి సమైక్యవాది. తెలంగాణ బిల్లును చివరి నిమిషం వరకు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. ద్రోహి. మొన్న శ్రీకాకుళంలో.. నాకు ఎంపీలు లేకపోవడం వల్లే విభజనను ఆపలేకపోయా అన్నాడు. అంటే ఎంపీలుంటే ఆపేవాడేగా? టీడీపీ, దానితో అంటకాగుతున్న పార్టీలు భూస్థాపితం కావాల్సిందే. తరతరాలుగా దెబ్బతింటూనే ఉన్నాం. కేసులు, జైళ్లు, లాఠీచార్జీలు, ప్రాణాల మీదికి తెచ్చుకునే దీక్షలు ఎన్నో చేసినం. ఇంకా మనకు కిరాయి మనుషుల పాలన వద్దు. ఈ విషయంలో రాజీ వద్దేవద్దు.

తెలంగాణ నాయకులకు ఆంధ్రోళ్లు ఓట్లువేసే పరిస్థితి లేనప్పడు ఆంధ్ర పార్టీలకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓట్లేయాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలకు ఓట్లు వేస్తారా! విజయవాడలో మనకు ఆంధ్రోళ్లు ఒక్క ఓటైనా వేస్తారా? వాళ్లకు అంత జిడ్డు ఉంటే మనకు వద్దా? అని తెలంగాణ ప్రజలను సూటిగా ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసే 69 మంది అభ్యర్థులతో తొలి జాబితాను, టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, టీఆర్‌ఎస్‌ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్, పొలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ తదితరులతో కలిసి కేసీఆర్ శుక్రవారం ఇక్కడ విడుదల చేస్తూ విలేకరులతో మాట్లాడారు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్, ఖమ్మం జిల్లాకు చెందిన విద్యావేత్త జీ కృష్ణ, పీఆర్పీ నేత ప్రవీణ్ తెలంగాణ భవన్‌లో, వైరా ఎమ్మెల్యే బానోతు చంద్రావతి (సీపీఐ), ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ కుమ్మరి ఆనంద్, మాజీ ఎంపీపీ లలిత, మీసాల సత్తయ్య, నిర్మల్ టీడీపీ మాజీ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి తదితరులు సాయంత్రం విడిగా కేసీఆర్ నివాసంలో ఆయన సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి కూడా ఆయన ప్రసంగించారు. టీఆర్‌ఎస్ నుంచి సీఎం ఉండటం ఏమైనా తప్పా? టీఆర్‌ఎస్ నుంచి సీఎం కావాలనే నేను అంటున్నా అని కేసీఆర్ చెప్పారు.

టీడీపీ, దానితో అంటకాగుతున్న పార్టీలు భూస్థాపితం కావాల్సిందేనని తేల్చిచెప్పారు. పరాయి పాలనలో తెలంగాణ ధ్వంసమైందన్న కేసీఆర్.. ఇక మనకు కిరాయి పాలన, కిరాయి మనుషులు అవసరం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం ఉన్న సొంత పార్టీ పాలన కావాలో? పరాయి పాలన కావాలో ప్రజలే నిర్ణయించాలని కోరారు. చంద్రబాబు ప్రపంచం మునిగిపోయినట్లు బీజేపీ కాళ్లు పట్టుకుని మోడీవాదాన్ని అందుకోవాలని చూస్తున్నాడన్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు చేతులు కలిపి తెలంగాణలో సుస్థిర పాలన రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్, టీడీపీలు ఏవేవో హామీలు ఇచ్చి ప్రజలను గందరగోళపరుస్తాయని, ప్రజలు చర్చించుకుని, ఎవరైతే ప్రజల కోసం, తెలంగాణ కోసం పదవులను వదులుకుని ఉద్యమించారో వారి పక్షాన నిలవాలని కోరారు. తనకు పదవి ముఖ్యం కాదని చెప్పిన కేసీఆర్ నవ్వేటోని ముందట జారిపడొద్దన్నదే తన అభిమతమన్నారు. తెలంగాణ ప్రజలు ధర్మం, న్యాయంవైపు ఉంటారని, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడతామని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ.. ఈ రెండు పార్టీలు మనం చూసినవే. కొత్తవేమీకాదు. అసలు ఉద్యమంలో అడ్రస్ లేని వీళ్లు మిమ్మల్ని గోల్‌మాల్ చేస్తరు. ఆగం కావద్దు.. ఆలోచించాలి అని ప్రజలకు చెప్పారు. ఒక్క తప్పుతో జరిగిన విలీనంనుంచి తెలంగాణ బైటకు వచ్చేందుకు 60ఏళ్లు పట్టిందన్నారు. ఉద్యమాలు, కాల్పులు, రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు, లాఠీ దెబ్బలకు తోడు చావు నోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణలో ఇంకా వలస పాలన, పరాయి పాలన సాగనివ్వద్దంటూ పిలుపునిచ్చారు.

ప్రజల ఆజ్ఞ మేరకే టీఆర్‌ఎస్ ఒంటరిపోటీకి దిగిందని కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్యవాద ముఖ్యమంత్రి వెనుకచేరి మమ్మల్ని వెక్కిరించిన నేతలు ఇప్పుడు తెలంగాణపై కపట ప్రేమను చూపుతున్నారని టీ కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఒక్క రూపాయి తెలంగాణకు ఇవ్వను. ఏం చేసుకుంటారో చేస్కోండి అని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటే.. ఒక్క తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, మంత్ర్రి అయినా లేసిండా? వారు లేసుంటే ఇలా జరిగేదా? అన్నారు. సీఎంను చూస్తే వాళ్ల లాగులు తడిశాయని ఎద్దేవా చేశారు. తెలంగాణను దేశంలోనే ది బెస్ట్ అని పేరు తెచ్చుకుంటామని ధీమాగా చెప్పారు. తెలంగాణలో నేతలు, వారి చెంచాలు దిగమింగిన హౌజింగ్ నిధులను కక్కిస్తామన్నారు.

నన్ను అడిగే హక్కు పొన్నాలకు లేదు

టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. సమైక్యవాద సీఎంల వెనుక ఉండి నక్కినక్కి నవ్వుకున్నారు. ఆనాడు పోతిరెడ్డిపాడుపై మాట్లాడుతుంటే పొన్నాల సమాధానం చెప్పలేకపోయిండు. జూబ్లీహాల్లో ఏం మాట్లాడినవో నా దగ్గర సీడీలున్నాయి. నన్ను అడిగే హక్కు నీకు లేదు. టీఆర్‌ఎస్ సీఎం అయితే తప్పేం లేదు. ఎవరి సంగతేందో ప్రజలే తేలుస్తరు. కేసీఆర్ అధికారంలోకి రాడని పగటి కలలు కంటున్నారు. కాంగ్రెస్‌కు 23-35 స్థానాలే దక్కుతాయి.

ఇది నేను చెప్పింది కాదు. సర్వేలో వెల్లడైంది. మీరు చేసిన అభివృద్ధి మాకు రాదు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో మీ జేబులు, పొట్టలు అభివృద్ధి చేసుకున్నరు. మా పార్టీలో ఉన్న కడియం శ్రీహరి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. చిన్న మచ్చ కూడా లేదు. మరి నీ సంగతేంది? వేల కోట్లు జలయజ్ఞంలో మింగారు. కక్కిస్తాం. నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవినీతిపై సీబీఐ కేసు నడుస్తోంది. అదే మా కడియంపై సీబీఐ కేసులేమీ లేవు. గీతారెడ్డి, సబితారెడ్డి, పొన్నాలపై సీబీఐ కేసులున్నాయి. మరికొందరు మంత్రులైతే జైళ్లకే పోయి వచ్చిర్రు. మా ఎజెండా ఎందో మేం చెబుతం. మీ ఎజెండా ఎందో చెప్పుకోండి. కానీ ఈ పిచ్చిపిచ్చి కూతలు బంద్‌చేయండి అని అన్నారు.

ఉద్యమకారులకే టికెట్లు

ప్రస్తుతం విడుదల చేస్తున్నది నాయిని నర్సింహారెడ్డి నేతృత్వంలోని ఎన్నికల కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి రూపొందించిన మొదటి జాబితా అని కేసీఆర్ చెప్పారు. ఉద్యమంలో పనిచేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. మా లిస్టులో 85% బలహీనవర్గాలవారు, ఉద్యమకారులే ఉన్నారు. పొత్తులపై మీడియా అయోమయం చేస్తోంది. నేను ఏనాడో చెప్పాను. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తున్నాం. 2004, 2009 ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం. ప్రజల ఆజ్ఞ మేరకు ప్రథమంగా ఒంటరిగా బరిలోకి దిగుతున్నాం.

న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థి ఉద్యమకారులు ఇలా అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించింది. ఇంకా కొన్ని ఇతర వర్గాల వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరో 50 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. శుక్రవారం మంచి ముహూర్తం, పైగా ముస్లింల జుమ్మా కూడా కలిసి వస్తున్నాయని చెప్పారు. పార్టీ టికెట్ల కోసం ఎన్నో అప్లికేషన్లు వచ్చాయి. 2-3రోజుల్లోనే మరో విడత పేర్లను ప్రకటిస్తాం అన్నారు.

తెలంగాణ పాలిట శని చంద్రబాబు

మమ్మల్ని మీరు, మిమ్మల్ని మేం నిందించడం ఇక వద్దు. మీరేం చేస్తారో చెప్పుకోండి. మేం ఏం చేస్తమో చెప్పుకుంటం. మన సంగతి ప్రజలే తేలుస్తరు. పిచ్చికూతలు మానుకోండి అని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు అంటేనే గోముఖవ్యాఘ్రం. తెలంగాణ పాలిట శని ఆయన. పచ్చి సమైక్యవాది. తెలంగాణ బిల్లును చివరి నిమిషం వరకు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. ద్రోహి. మొన్న శ్రీకాకుళంలో నాకు ఎంపీలు లేకపోవడం వల్లే విభజనను ఆపలేకపోయా అన్నాడు. అంటే ఎంపీలుంటే ఆపేవాడేగా. టీడీపీ, దానితో అంటకాగుతున్న పార్టీలు భూస్థాపితం కావాల్సిందే. తరతరాలుగా దెబ్బతింటూనే ఉన్నాం. కేసులు, జైళ్లు, లాఠీచార్జీలు, ప్రాణాల మీదికి తెచ్చుకునే దీక్షలు ఎన్నో చేసినం. ఇంకా మనకు కిరాయి మనుషుల పాలన వద్దు. ఈ విషయంలో రాజీ వద్దేవద్దు. మేం విడుదల చేసిన మ్యానిఫెస్టోలో కంటే ఇంకా మంచి విషయాలను ఎవరు చెప్పినా మ్యానిఫెస్టోకు అనుబంధంగా చేరుస్తాం అని చెప్పారు.

75 సీట్లు మాకే

ఎన్నికల్లో 75 అసెంబ్లీ, 14 పార్లమెంట్ స్థానాలు టీఆర్‌ఎస్ దక్కించుకుంటుందని కేసీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. తాను ఏ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనేది ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో ప్రతి 10 మందిలో 8మంది టీఆర్‌ఎస్ వెంటే ఉన్నారని చెప్పారు. ముస్లింలకు టికెట్లు తక్కువ ఇచ్చారని అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఘాటుగా స్పందించారు. మహబూబ్‌నగర్‌లో ఇబ్రహీంకు రెండుసార్లు టికెట్ ఇస్తే ముస్లింలే ఓట్లు వేయలేదని అన్నారు. బోధన్‌లో 1100 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయాడని, తాను గతంలో జరిగిందే చెబుతున్నానని అన్నారు. అయితే రెండో జాబితాలో ముస్లింలకు అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కాకుండానే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇంకా పంచాయతీ అయిపోలేదు

ఇల్లు అలుకగానే పండగ కాదని చెబుతూ తెలంగాణ సాధించగానే సరిపోదన్నారు. ఇంకా సీమాంధ్ర నేతలతో పంచాయతీ అయిపోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకవైపు తెలంగాణ బిల్లు ఆమోదం కాగానే మరోవైపు సీమాంధ్ర నేతలు కుట్రపూరితంగా భద్రాచలంలోని 7మండలాలను సీమాంధ్రలో కలుపుకోవాలని ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. వారి కుట్రలను అడ్డుకుని, ముక్కుపిండి తెలంగాణకు న్యాయం చేసేది ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. నిజాంసాగర్.. ప్రపంచంలోనే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ఉండేదన్నారు.

సుమారు 3 లక్షల ఎకరాలకు నీరందించే నిజాంగసాగర్ ఎండిపోయి నిజామాబాద్ జిల్లా కరువు బారిన పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బోధన్‌లో చెరుకు పంటలు పోయి బీడు వారిందని అన్నారు. ఆరు నూరైనా సింగూరు, నిజాంసాగర్ కళకళలాడాలన్నారు. గత వైభవం మళ్లీ రావాలంటే టీఆర్‌ఎస్‌ను అధికారంలో కూర్చోబెట్టాలని ప్రజలను కోరారు. జగన్ పార్టీలో ఉంటూ ఆయన సమైక్యవాదానికి నిసరనగా బైటకు వచ్చిన నేతలు కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్‌లని కేసీఆర్ ప్రశంసించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్: బాజిరెడ్డి గోవర్ధన్

భవిష్యత్‌లో తెలంగాణకు సీఎంగా కేసీఆర్‌ను చూస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు తెలంగాణ వాదిగానే ఉన్నానని.. తెలంగాణవాదిగానే చనిపోతానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే తప్ప తెలంగాణకు న్యాయం జరగదని చెప్పారు. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

69 మందితో టీఆర్‌ఎస్ తొలి జాబితా – గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ – హుజూరాబాద్ నుంచి ఈటెల – అభ్యర్థులతో అధినేత ప్రమాణం – టైమ్ చూసుకుని మరో జాబితా వెల్లడి హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను టీఆర్‌ఎస్ శుక్రవారం ప్రకటించింది. పలువురు సిట్టింగ్‌లతో సహా మొత్తం 69 మందికి తొలి జాబితాలో స్థానం కల్పించారు. అనంతరం అభ్యర్థులతో తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ప్రమాణం చేయించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం లభించిన నేను పార్టీ క్రమశిక్షణకు, నాయకత్వ ఆదేశాలకు బద్ధుడనై నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ అవినీతికి పాల్పడబోనని, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో, అంకితభావంతో అహర్నిశలు కృషి చేస్తానని, తెలంగాణ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ ఉన్న ఈ పత్రాన్ని కేసీఆర్ స్వయంగా చదువుతూ మిగిలినవారితో ప్రమాణం చేయించారు. అనంతరం పలువురు అభ్యర్థులు వెళ్లి కేసీఆర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కేసీఆర్ కూడా అంతే ఆప్యాయంగా స్పందించారు.

లిస్టు ప్రకటించడానికి ముందు కేసీఆర్ సమయం విషయంలో ఎంతో జాగ్రత్త పాటించారు. 10.54నిమిషాలకు మీడియా హాల్లోకి వచ్చిన కేసీఆర్ నిమిషంన్నర పాటు కూర్చున్నారు. ఆ తరువాత సమయం ఎంత అని పక్కనున్న వారిని అడిగారు. నాయిని ముందు ఉన్న ఆయన ఫోన్‌ను పట్టుకుని సమయం చూసుకున్నారు. వెంటనే కడియం స్పందిస్తూ మరొక్క నిమిషం ఉందని చెప్పారు. అది గడిచిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడటం ప్రారంభించారు. ఈ ముహూర్తం బ్రహ్మముహూర్తం అని పండితులు పెట్టారని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ అదృష్ట సంఖ్య అయిన ఆరు ప్రకారం 69 మంది అభ్యర్థులనే ప్రకటించారని సమాచారం. 6+9=15, 1+5=6 కనుకే 69మంది అభ్యర్థులను ప్రకటించారు.

ఇదీ అభ్యర్థుల జాబితా..: మెదక్ – గజ్వేల్: కే చంద్రశేఖర్‌రావు, సిద్దిపేట: హరీష్‌రావు, అందోల్: బాబూమోహన్, మెదక్: పద్మాదేవేందర్‌రెడ్డి, సంగారెడ్డి: చింతా ప్రభాకర్, పటాన్‌చెరు: జీ మహిపాల్‌రెడ్డి.

కరీంనగర్ – హుజూరాబాద్: ఈటెల రాజేందర్, ధర్మపురి: కొప్పుల ఈశ్వర్, వేములవాడ: సీహెచ్ రమేష్‌బాబు, కరీంనగర్: గంగుల కమలాకర్, కోరుట్ల: విద్యాసాగర్‌రావు, రామగుండం: సోమారపు సత్యనారాయణ, సిరిసిల్ల: కేటీ రామారావు, మానకొండూరు: రసమయి బాలకిషన్, హుస్నాబాద్: వీ సతీష్‌కుమార్, పెద్దపల్లి: దాసరి మనోహర్‌రెడ్డి, మంథని: పుట్టా మధు, జగిత్యాల: సంజయ్ కుమార్.

నిజామాబాద్ – బాన్సువాడ: పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి: ఏనుగు రవీందర్‌రెడ్డి, జుక్కల్: హన్మంత్‌షిండే, కామారెడ్డి: గంప గోవర్ధన్, బోధన్: షకీల్ అహ్మద్, ఆర్మూర్: ఏ జీవన్‌రెడ్డి, బాల్కొండ: ప్రశాంత్‌రెడ్డి.

ఆదిలాబాద్ – ఆదిలాబాద్: జోగు రామన్న, బోథ్: జీ నగేష్, ముథోల్: వేణుగోపాలచారి, చెన్నూరు: నల్లాల ఓదెలు, సిర్పూర్: కావేటి సమ్మయ్య, నిర్మల్: శ్రీహరిరావు, బెల్లంపల్లి: చెన్నయ్య, ఖానాపూర్: రేఖానాయక్, ఆసిఫాబాద్: కోవా లక్ష్మీ.

రంగారెడ్డి – పరిగి: హరీశ్వర్‌రెడ్డి, తాండూరు: మహేందర్‌రెడ్డి, చేవెళ్ల: కేఎస్ రత్నం, వికారాబాద్: బీ సంజీవరావు, మేడ్చల్: ఎం సుధీర్‌రెడ్డి.

మహబూబ్‌నగర్ – కొల్లాపూర్: జూపల్లి కష్ణారావు, మక్తల్: వై ఎల్లారెడ్డి, కల్వకుర్తి: జైపాల్‌యాదవ్, మహబూబ్‌నగర్: వీ శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి: నిరంజన్‌రెడ్డి, జడ్చర్ల: సీ లకా్ష్మరెడ్డి, అచ్చంపేట: జీ బాలరాజు, దేవరకద్ర: వెంకటేశ్వర్‌రెడ్డి, అలంపూర్: ఎం శ్రీనాథ్, నాగర్ కర్నూల్: మర్రి జనార్దన్‌రెడ్డి, గద్వాల్: బీ కష్ణమోహన్‌రెడ్డి.

వరంగల్- డోర్నకల్: సత్యవతి రాథోడ్, వరంగల్ పశ్చిమ: దాస్యం వినయ్‌భాస్కర్, స్టేషన్ ఘన్‌పూర్: టీ రాజయ్య, భూపాలపల్లి: మధుసూదనాచారి, నర్సంపేట: పెద్ది సుదర్శన్‌రెడ్డి, ములుగు: అజ్మీరా చందూలాల్, వరంగల్ తూర్పు: కొండా సురేఖ, పాలకుర్తి: ఎన్ సుధాకర్‌రావు, జనగాం: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వర్ధన్నపేట్: ఆరూర్ రమేష్.

హైదరాబాద్- సికింద్రాబాద్: పద్మారావు గౌడ్.

నల్లగొండ – సూర్యాపేట: జీ జగదీష్‌రెడ్డి, ఆలేరు: గొంగిడి సునీత, నకిరేకల్: వీరేశం, దేవరకొండ: లాలు నాయక్, మిర్యాలగూడ: అమరేందర్‌రెడ్డి, హుజూర్‌నగర్: కాసోజు శంకరమ్మ.

ఖమ్మం- కొత్తగూడెం: జలగం వెంకట్‌రావు, సత్తుపల్లి: పిడమర్తి రవి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.