-నేడు గవర్నర్ వద్దకు పార్టీ ఎమ్మెల్యేల బందం -రాజకీయ అవినీతిలేని పాలన అందిద్దాం -అధికారం వచ్చిందని కొమ్ములు పెంచుకోవద్దు -హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండాలి -సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి అంశాలకు పెద్దపీట -టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో అధినేత కేసీఆర్

టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేతగా పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం ఖాయమైంది. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల విస్తతస్థాయి సంయుక్త సమావేశంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆయన పేరును ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ఈశ్వర్, కోవ లక్ష్మి బలపరిచారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలంతా హర్షాతిరేకాలతో ఏకగ్రీవంగా మద్దతు పలిపారు. ఎన్నిక అనంతరం కేసీఆర్ ప్రజాప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. రాజకీయ అవినీతిని ఎట్టి పరిస్థితిలోనూ సహించవద్దని పిలుపునిచ్చారు.
కడుపు నోరు కట్టుకుని ప్రజలకోసం పనిచేద్దాం.. హంగులూ ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ఉందాం.. అని సూచించారు. సంక్షేమం,ఉపాధి, వ్యవసాయ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అంకితమవుతుందని చెప్పారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో నిపుణుల సూచనలు తీసుకుందామన్నారు. కాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కేసీఆరేసీఎం
-నేడు గవర్నర్ వద్దకు పార్టీ ఎమ్మెల్యేల బృందం -రాజకీయ అవినీతిలేని పాలన అందిద్దాం -అధికారం వచ్చిందని కొమ్ములు పెంచుకోవద్దు -హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండాలి -సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి అంశాలకు పెద్దపీట -టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో అధినేత కేసీఆర్
టీఆర్‌ఎస్ శాసనసభాపక్షనేతగా పార్టీ అధినేత కే చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం ఖాయమైంది. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల విస్తతస్థాయి సంయుక్త సమావేశంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆయన పేరును ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ఈశ్వర్, కోవ లక్ష్మి బలపరిచారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలంతా హర్షాతిరేకాలతో ఏకగ్రీవంగా మద్దతు పలిపారు. ఎన్నిక అనంతరం కేసీఆర్ ప్రజాప్రతినిధులనుద్దేశించి ప్రసంగించారు. రాజకీయ అవినీతిని ఎట్టి పరిస్థితిలోనూ సహించవద్దని పిలుపునిచ్చారు.
కడుపు నోరు కట్టుకుని ప్రజలకోసం పనిచేద్దాం.. హంగులూ ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ఉందాం.. అని సూచించారు. సంక్షేమం,ఉపాధి, వ్యవసాయ రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అంకితమవుతుందని చెప్పారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో నిపుణుల సూచనలు తీసుకుందామన్నారు. కాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బందం ఆదివారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్‌ను కలిసి పార్టీ సభాపక్ష నేత ఎంపిక , అలాగే ఎన్నికల్లో తమకు లభించిన మెజారిటీ అంశాలను ఆయనకు రాతపూర్వకంగా తెలియజేస్తుంది. తరువాత గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్‌ను ఆహ్వానిస్తారు.