-నిండుకుండల్లా మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లు -ప్రాణహిత నుంచి 9వేల క్యూసెక్కుల ప్రవాహం -కన్నెపల్లిలో ఆరు మోటర్లతో నిరంతర ఎత్తిపోతలు -అన్నారం పంప్‌హౌస్‌లో మూడో మోటర్ మొదలు -సుందిల్లలోకి 75 గంటలపాటు నిరంతర ఎత్తిపోత

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి అన్నారం బరాజ్‌కు ఆరు మోటర్ల ద్వారా నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటివరకు పంప్‌హౌస్‌లోని 1, 2, 3, 4, 6వ నంబర్ మోటర్లు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుండగా, బుధవారం సాయంత్రం 6.10 గంటలకు ఐదో నంబర్ మోటర్‌ను కూడా ప్రారంభించడంతో 1.2 టీఎంసీల నీళ్లు గ్రావిటీ కెనాల్‌ద్వారా అన్నారం బరాజ్‌కు తరలుతున్నాయి. ఏడో నంబర్ మోటర్ వెట్న్‌క్రు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఈఈ రమణారెడ్డి చెప్పారు. ప్రాణహిత నుంచి గోదావరికి 9,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండటంతో మేడిగడ్డ బరాజ్‌లో ప్రస్తుతం 6.6 టీఎంసీల నీటినిల్వ ఉన్నది. అన్నారం బరాజ్‌లో నీటినిల్వ 7.1 టీఎంసీలుగా ఉన్నది. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 1, 3, 5వ నంబరు మోటర్ల ఆటోమేషన్ పూర్తయింది. మరో మూడు మోటర్లను ఆటోమోడ్‌లోకి తెస్తున్నారు. ప్రస్తుతం ఆరు మోటర్లద్వారా నీటిని ఎత్తిపోస్తుండటంతో డెలివరీ సిస్టర్న్ ద్వారా ఒక్కో మోటర్ నుంచి 2300 క్యూసెక్కులు గ్రావిటీ కాల్వలోకి విడుదలవుతున్నది. ఈ నీటిని అన్నారం పంప్‌హౌస్ ద్వారా సుందిల్ల బరాజ్‌కు ఎత్తిపోస్తున్నారు. మూడు మోటర్లద్వారా 1.1 టీఎంసీల నీటిని సుందిల్లకు తరలించినట్లు రమణారెడ్డి చెప్పారు. దీనితో సుందిల్ల బరాజ్‌లో బుధవారం సాయంత్రానికి నీటినిల్వ 1.03 టీఎంసీలకు పెరిగింది. మంగళవారం రాత్రి వరకూ రెండు మోటార్లు మాత్ర మే నడువగా, బుధవారం మధ్యాహ్నం మూడో మోటర్‌ను ఆన్‌చేసి, రాత్రివరకు నడిపించారు. ఇక్కడ ఇప్పటి వరకు 75 గంటలపాటు నిరంతరంగా నీటిని ఎత్తిపోశారు.

నేడు, రేపు నాలుగో మోటర్‌కు వెట్న్ అన్నారం పంపుహౌస్‌లోని నాలుగో మోటర్‌కు గురు, శుక్రవారాల్లో వెట్న్ ప్రక్రియను మొదలుపెడుతామని నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. తర్వాత సుందిల్ల బరాజ్‌లో నీటినిల్వ ఐదు టీఎంసీల చేరగానే గోలివాడ పంపుహౌస్‌లోని మోటర్లకూ వెట్న్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. గోలివాడ పంప్‌హౌస్‌లో వెట్న్‌క్రు ఆరు మోటర్లు సిద్ధంగా ఉన్నాయని ఈఈ విష్ణుప్రసాద్ తెలిపారు. ఎగువన గోదావరిలో సింగూరుకు 15 క్యూసెక్కుల వరద వస్తుండగా, శ్రీరాంసాగర్‌కు 230 క్యూసెక్కుల వరద వస్తున్నది. కడెంకు 333, ఎల్లంపల్లికి 141 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. భద్రాచలం పట్టణం వద్ద బుధవారం ఉదయం ఆరు గంటలకు 9.6 అడుగులున్న గోదావరి సాయంత్రం ఆరు గంటలకు 9.9 అడుగులకు చేరుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన టీఆర్‌ఎస్ నాయకులు నర్సంపేట రూరల్: కాళేశ్వరం ప్రాజెక్టును వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాజపల్లి గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు బుధవారం సందర్శించారు. రాజపల్లి రైతు సమన్వయ సమితి కన్వీనర్, మాజీ ఎంపీటీసీ నామాల సత్యనారాయణ, ఏజీపీ, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గూళ్ల అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో 40మంది గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు మేడిగడ్డ, అన్నారం బరాజ్‌తోపాటు పంప్‌హౌస్‌లను సందర్శించారు.

ఆల్మట్టికి మరింత తగ్గిన ఇన్‌ఫ్లో హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆల్మట్టి జలాశయానికి వరద మరింతగా తగ్గింది. బుధవారం 7,662 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తున్నది. కాల్వలద్వారా 128 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నారాయణపూర్‌కు 256 క్యూసెక్కుల వరదవస్తుండగా.. అవుట్‌ఫ్లో కింద కాల్వలకు 6186 క్యూసెక్కులను విడుదలచేస్తున్నారు. ఉజ్జయినికి కూడా వరద చాలాతగ్గింది. ఎగువనుంచి 1,977 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది.
తుంగభద్ర ప్రాజెక్టుకు పెరిగిన ఇన్‌ఫ్లో అయిజ: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరదనీరు అంతకంతకూ పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలతో బుధవారం డ్యాంలోకి 13,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,778 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుతం 18.340 టీఎంసీలు (పూర్తిసామర్థ్యం 100.855 టీఎంసీలు) ఉన్నట్లు సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
అపర భగీరథుడు కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
రామడుగు: తెలంగాణ ప్రజల దాహం తీర్చేందుకు గంగకు అడ్డంగా నిలిచి, నీటిని మలిపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ పరిధిలోని గ్రావిటీ కాల్వ, వరదకాల్వ కలిసే జంక్షన్ పాయింటును, టన్నెల్‌ను ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాదాపు రూ.50 వేల కోట్ల నిధులు ఖర్చుచేసి రెండున్నరేండ్లలోనే పూర్తిచేయడం ప్రపంచ రికార్డుగా భావిస్తున్నామన్న మంత్రి.. ఇది సీఎం కేసీఆర్‌కు తప్పితే మరెవరికీ సాధ్యం కాదన్నారు. చొప్పదండి, జగిత్యాల ఎమ్మెలేలతోపాటు కాళేశ్వరం ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, వరదకాల్వ ఎస్‌ఈ శ్రీకాంత్, ఈఈ సుధాకిరణ్, కాళేశ్వరం ప్రాజెక్టు ఏఈఈలు సురేశ్‌కుమార్, వెంకటేశ్, అరవింద్, ఏజన్సీ ప్రతినిధి కృష్ణారెడ్డి కూడా మంత్రి వెంట ఉన్నారు.