Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

కలల సౌధం..కండ్ల ముందుకు

-పాలమూరులో సొంతింటి సంబురం -సామూహిక గృహ ప్రవేశాలు చేయించిన మంత్రులు కేటీఆర్,లక్ష్మారెడ్డి -రాష్ట్రంలో 2.72 లక్షల ఇండ్ల నిర్మాణం: మంత్రి కేటీఆర్

నిరుపేదల సొంతింటి కల నెరవేరింది. రాష్ట్రంలో తొలిసారిగా ఒకేసారి ఏకంగా 310 మంది నిరుపేదలు మంత్రులు కేటీఆర్, లకా్ష్మరెడ్డితో కలిసి కొత్త ఇండ్లల్లో గృహ ప్రవేశం చేశారు. మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్‌పల్లిలో 310 డబుల్ బెడ్ రూం ఇండ్లల్లో సోమవారం నిరుపేదలు కాలుమోపారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రోస్ వారితో సామూహికంగా గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఇక్కడే నిర్మించనున్న 600 నూతన డబుల్ బెడ్‌రూం ఇండ్లకు మంత్రులు భూమి పూజ చేశారు.

సీఎం కేసీఆర్ ఫొటోలతో ఇండ్లల్లోకి.. ఇప్పటి వరకు అద్దె ఇండ్లలో బతుకులు వెల్లదీసిన నిరుపేదలు సోమవారం సొంతింట కాలుపెట్టారు. మంత్రి కేటీఆర్ వారితో కలిసి గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా కొత్త ఇండ్లలోకి అడుగుపెట్టిన వారంతా సీఎం కేసీఆర్ ఫొటోతో వెళ్లారు. గృహ ప్రవేశం చేయించిన మంత్రి కేటీఆర్ ఇంటింటా కలియ తిరిగారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ఉద్వేగ భరితంగా మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంత వరకు ప్రతి నిరుపేదకూ సొంతింటి కలను తీర్చుతామన్నారు. జీవితంలో రెండే ప్రధాన అంశాలని, ఇల్లు, పెళ్లిపై సామెతలు కూడా ఉన్నాయని, ఇల్లు కట్టి చూడు… పెండ్లి చేసి చూడు అంటూ ఉత్తిగనే రాలేదని, కానీ సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద దిక్కుగా డబుల్ బెడ్‌రూం ఇంటిని నిర్మించి ఇవ్వడమే కాకుండా పేదింట వివాహానికి రూ. 75వేల ఆర్థిక సాయం కూడా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2.72 లక్షల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తామన్నారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన పాలమూరుకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ రూ.750 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారన్నారు. కేంద్రంలో తెలంగాణకు తగిన ప్రాధాన్యత ఇవ్వనప్పటికీ ఈ ప్రాంత సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ పలు అంశాలపై స్థానిక ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు.

అవ్వా.. డబ్బులడిగారా? ఏం..అవ్వా ఎవరన్నా డబ్బులడిగారా, ఎవ్వరన్న ఇబ్బంది పెట్టారా? ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే ద్వారా మా దృష్టికి రావాలె. మీ బాగోగులు చూడడానికే మేమున్నాం. ఇతర నేతల్లా మాట ఇచ్చి తప్పేవాళ్లం కాదు అంటూ రాములవ్వ అనే లబ్ధిదారును మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. ఈ సంఘటనతో రాములవ్వ ఏం చెప్పాలో తోచక కంట నీరుపెట్టింది. ఇప్పటివరకు ఎవ్వరు తమను పట్టించుకోలేదని, మీలాంటి వారికి బతుకంతా రుణపడి ఉంటానని అవ్వతోపాటు అనేక మంది చెప్పుకొచ్చారు.

దేవునిలా కనికరించారు ఇల్లు కట్టి ఇస్తామంటే నమ్మలేకపోయాం. మా బతుకంతా రెక్కల కష్టం చేసినా ఇంత మంచి ఇల్లు కట్టుకునే వారం కాము. మా కోసం డబుల్ బెడ్ రూం కట్టించి ఇచ్చినందుకు మీరంతా చల్లంగుండాలి. దేవుడు సీఎం కేసీఆర్‌ను సల్లంగ చూడాలి. – బాలనాగమ్మ, ఇంటి నెం.బి1/06, లబ్ధిదారు

అల్లా చల్లగా చూడాలే మా మామల నాటి నుంచి పాలమూరు పట్టణంలో ఉంటూ కూలీ పని చేసి బతుకు వెల్లదీస్తున్నాం. కిరాయి ఇంట్లో ఉండేవాళ్లం.. ఇల్లు కట్టుకుంటామన్న ఆశ మాకు ఉండేది కాదు. మా ఆనందం అంతా ఇంతా కాదు. మిమ్మల్ని అంతా అల్లా చల్లగా చూడాలే. – జుబేదాబేగం, ఇంటి నెం.బి9/50 లబ్ధిదారు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.