-ప్రశంసించిన కేంద్ర కార్యదర్శి దుర్గాశంకర్‌మిశ్రా -అక్షయపాత్ర, సిబ్బందికి ధన్యవాదాలు: కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆరేండ్లుగా అమలవుతున్న అన్నపూర్ణ భోజన పథకం అద్భుతంగా ఉన్నదని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌మిశ్రా ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో భోజనంపై రూ.25 భరిస్తూ రోజుకు రెండులక్షల మందికి ఆహారం అందిస్తున్నదని అభినందించారు. అక్షయపాత్ర భాగస్వామ్యంతో దీన్ని అమలుచేస్తున్నారని, కొవిడ్-19 సమయంలోనూ భోజనం పెట్టి ఆదుకున్నారని శుక్రవారం ట్విట్టర్‌లో మెచ్చుకున్నారు.
ఇప్పటివరకు 5.5 కోట్ల మందికి భోజనాలు జీహెచ్‌ఎంసీలో అన్నపూర్ణ పథకం ద్వారా ఇప్పటివరకు 5.5 కోట్ల మందికి భోజనాలు పెట్టినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా సమయంలో సుమారు 65 లక్షల మందికిపైగా భోజనం అందించినట్టు శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్దసంఖ్యలో భోజనాలు పెట్టలేదన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అక్షయపాత్ర, సిబ్బందికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
అది ప్రపంచం మదిలో మెదిలే ప్రశ్నే ‘ప్రపంచం మదిలో మెదిలే ప్రశ్ననే నువ్వు అడిగావు’ అంటూ ఓ చిన్నారికి మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘కరోనా ఎప్పుడు పోతుంది, నేను స్కూల్‌కు, షాపింగ్‌మాల్‌కు, సినిమాకు ఎప్పుడు వెళ్లాలి చెప్పండి’ అంటూ ఐదేండ్ల ద్వారా కోరగా.. దాన్ని చిన్నారి మేనమామ ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి మంత్రి ప్రశంస నర్సంపేట నియోజకవర్గపరిధిలో ఇప్పటికే వెయ్యిమందితో రక్తదానం చేయించడం, రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్న మరో 5,610 మంది జాబితాను తయారు చేయడంపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.