హైదరాబాద్‌లో తిష్ఠవేసి ఆధిపత్యం చెలాయించాలనే చర్యలకు అడ్డుకట్టపడాలి. హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు విధుల బహిష్కరణ ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో న్యాయ కార్యకలాపాలలో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడుతున్నది. ప్రజల్లో, న్యాయవాదుల్లో కేంద్ర ప్రభుత్వ కాలయాపన విధానంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సాధారణ ప్రజలు న్యాయం పొందడంలో ఎదురవుతున్న వివక్షతో పాటు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు తమకు లేని కోరికలు కోరడం లేదు. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులు అడుతున్నారు.

గౌరవనీయులు కేంద్ర న్యాయశాఖా మంత్రి వర్యులు సదానందగౌడ్ గారూ..తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవ్యస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ర్టాలకు ఏం చేయాలో సవివరంగా చెప్పింది. దీనిప్రకారం రెండు రాష్ర్టాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలి. ఈ చట్టంలో ప్రస్తావించబడిన సెక్షన్ 31(1) చెబుతున్నదాని ప్రకారం.. సెక్షన్ 30కి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టు (హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్), తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టు (హైదరాబాద్‌లో మరో ప్రత్యేక తెలంగాణ హైకోర్టు) ఏర్పా టు చేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవ్యస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 31(2) చెబుతున్నదేమం టే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉండాలన్నది.. రాష్ట్రపతి సూచన మేరకు (నోటిఫై) ఏర్పాటు కావా లి. అలాగే కేంద్ర క్యాబినెట్ నిర్ణయానుసారం, రాష్ట్రపతి నోటిఫై సూచన మేరకు హైకోర్టు విభజన జరగా లి.
దీనిప్రకారం హైకోర్టు విభజన అనేది పూర్తిగా కేం ద్ర ప్రభుత్వం చేతిలోని పని. కేంద్ర న్యాయ శాఖామంత్రిగా మీకు ఈ విషయాలన్నీ తెలుసు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా.. హైకోర్టు విభజనకు సం బంధించి ఇంతవరకు ఏదీ ముందుకు సాగలేదు. తమది చేతల ప్రభుత్వంగా ఘనంగా చెప్పుకుంటు న్న కేంద్రం సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అంటూనే సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవడం లేదు. ఈ క్రమంలో హైకోర్టు విభజన అనేది రాజకీయంగా మారిపోయి తెలంగాణ రాష్ట్ర న్యాయమైన హక్కు హరించివేయబడుతున్నది. ఇది ఒకరకంగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును తిరస్కరించడమే. ఆర్టికల్ 214 ప్రకారం.. ప్రతి రాష్ర్టానికి ఒక హైకోర్టు ఉండాలి. అలాంటప్పుడు తెలంగాణ రాష్ర్టానికి హైకోర్టు ఏర్పాటు చేయకపోవడమనేది పవిత్రమైన రాజ్యాంగానికి గౌరవం ఏం ఇస్తున్నట్లు?
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సభ్యులుగా మేం తెలంగాణకు న్యాయం కోసం అనేక విధాలుగా పోరాడుతున్నాం. పార్లమెంటులో పదకొండు సభ్యులుగా ఉన్న మేం.. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ న్యాయం కోసం మా నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నాం. తెలంగాణ హైకోర్టు విషయం లో కేంద్ర మాజీ న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసా ద్ గారికి మేం చేసుకున్న విన్నపానికి అనుగుణంగా, తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మీకు కూడా ఈ విషయంలో మా విన్నపాన్ని విన్నవించుకున్నాం. మీరు కూడా తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మీరు చెప్పినదానికి అనుగుణంగా.. తెలంగాణ ప్రభుత్వం రెండు హైకోర్టులు ఏర్పాటు చేయడానికి తగు వసతి, స్థలం సమకూర్చింది. హై కోర్టులు ఏర్పాటు చేయడానికి తగు వసతుల కల్పన చేసినట్లయితే వెంటనే హైకోర్టు విభజన చేస్తామని మీరు హామీ ఇచ్చారు.
దీనికి అనుగుణంగానే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు చొరవ తీసుకొని ఓ అడుగు ముందుకేసి తెలంగాణ హైకోర్టును మరో ప్రత్యేక బిల్డింగ్‌లో పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఇంతకన్నా సానుకూల నిర్ణయం ఏముంటుంది? కానీ.. ఇంతవరకు ఏ నిర్ణ యం జరుగలేదు. హైకోర్టు విభజన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. దీంతో.. తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులు తమ న్యాయమైన డిమాండ్ కోసం, హైకోర్టు ఏర్పా టు కోసం ఉద్యమానికి దిగక తప్పలేదు. దీనిలో భాగంగానే 2015 ఫిబ్రవరిలో 45 రోజులు పెద్ద ఎత్తున నిరసన ఉద్యమాలు చేశారు.
ఈ క్రమంలోనే.. మా పార్లమెంట్ సభ్యులు న్యాయం కోసం పార్లమెంటరీ పంథాలో అనేక పోరాటాలు చేస్తున్నారు. మేం పార్లమెంట్ నిండు సభలో హైకోర్టు విభజన గురించి.. 377 రూల్ ప్రకా రం జీరో అవర్‌లో ప్రశ్న లేవనెత్తాం. అయినా నిర్ణయాత్మకమైన చర్య ఏమీ తీసుకోలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో పార్లమెంట్ కార్యకలాపాలకు భంగం కలిగించే రీతిలో మేం ఆందోళన చేయాల్సి వచ్చింది. మా న్యాయమైన ఆందోళన కారణంగా పార్లమెంటును వాయిదా వేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయినా మా ఆందోళన కు సంబంధించి మీ నుంచి ఏ స్పందన రాలేదు. ఈ నేపథ్యంలోనే.. 2015 మే 5న హైకోర్టు విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిల్ కూడా కొట్టివేయబడితే, హైకోర్టు విభజనను సాధ్యమైనంత తొందరగా చేస్తామని మీరు లోక్‌సభకు హామీ ఇచ్చారు. సరిగ్గా ఆ నాటికే పిల్ కూడా కొట్టివేయబడింది. ఈ నేపథ్యంలోనే మేం మాకు తగిన న్యాయం దక్కాలని కోరాం. కానీ మా విన్నపాలు కొరకాకుండా పోయాయి. మా విజ్ఞప్తులు, నిరసనోద్యమాలన్నీ నిరుపయోగంగా, పనికిరానివిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోం చే.. మేం స్పీకర్ కుర్చీ ముందు మౌనముద్రతో కూర్చొని నిరసన తెలియజేశాం.
హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి మా విన్నపా లు, పోరాటాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని తగువిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించాల్సిన అవసరం ఉన్నది. హై కోర్టు చీఫ్ జస్టిస్ సూచనలు, సలహా మేరకు హైకోర్టు విభజనకు సహకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాల్సిన అవసరమున్నది. హైకోర్టు ఏర్పాటుకుగాను గచ్చి బౌలీ బిల్డింగులను ఉపయోగించుకోవచ్చునన్న దాన్ని తిరస్కరించారు. ఈ క్రమంలోనే 2015 జూన్ లో హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సేన్.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేయాలని సూచించారు. వింతేమిటంటే.. అప్పటికి ఏపీ అసెంబ్లీ, ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ ఆఫీ సు లాంటివన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అలాంటిది హై కోర్టు మాత్రం ఏపీలోనే ఏర్పాటు కావాలనే పేరుతో అక్కడ తగు వసతులు లేవనే పేరుతో విభజన జరగకుండా అయింది.
నిజానికి హైకోర్టు హైదరాబాద్‌లో ఉండాలా, అమరావతిలో ఉండాలా అన్నది సమస్య కాదు. హై కోర్టు విభజన జరగాలన్నది ప్రధానం. హై కోర్టు విభజనకు మరేదీ ప్రాతిపదిక, సమస్య కాదు. మరోవై పు.. హైకోర్టు తప్పనిసరిగా విభజన జరగాలని ఆం ధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం చెబుతున్నది. కాకుంటే.. సెక్షన్ 31(2)లో హైకోర్టు విభజనకు కాల వ్యవ ధి లేదు. ఎంతకాలంలో విభజన చేయాలన్నది పేర్కొనలేదు. ఈ విషయాన్ని ఆసరా చేసుకొని ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు విభజనను కాలయాపనతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితు ల నేపథ్యంలో నేను గత సంవత్సరం 2015 నవంబర్ 17న పార్లమెంట్ శీతాకాల సమావేశంలో లోక్‌సభలో ప్రైవేటు మెంబర్ బిల్ ప్రవేశపెట్టాను. దాని లో చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్ల కాలంలో విభజన ప్రక్రియ జరుగాలని సవరణ చేయాలని కోరనైన ది. ఈ నేపథ్యంలోంచే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనను కాలయాపన చేసే ప్రక్రియ కొనసాగుతున్నది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో అయినా.. కాలపరిమితితో హైకోర్టు విభజన జరుగాలనే విధంగా చట్టంలో తగు మార్పులు చేయాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శరవేగంగా నిర్మాణమవుతున్న నేపథ్యం లో.. అక్కడనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటుచేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో తిష్ఠవేసి ఆధిపత్యం చెలాయించాలనే చర్యలకు అడ్డుకట్టపడాలి. హైకోర్టు ఏర్పాటు కోసం న్యాయవాదులు విధుల బహిష్కరణ ఉద్యమాన్ని చేపట్టారు. దీంతో న్యాయ కార్యకలాపాలలో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడుతున్నది. ప్రజల్లో, న్యాయవాదుల్లో కేంద్ర ప్రభుత్వ కాలయాపన విధానంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సాధారణ ప్రజలు న్యాయం పొందడంలో ఎదురవుతున్న వివక్షతో పాటు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు తమకు లేని కోరికలు కోరడం లేదు.
రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులు అడుతున్నారు. తగు న్యాయం కోరుతున్నారు. హైకోర్టు విభజనపై ప్రతిష్టంభన కొనసాగడం మంచిది కాదు. హైకోర్టు విభజన అత్యవసరంగా, అనివార్యంగా జరగాలి. విభజన జాప్యం జరుగుతున్నా కొద్దీ కేంద్ర ప్రభుత్వం మరింత ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుంది. అందుకోసం మీకు చేసే విజ్ఞప్తి ఏమంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడి హైకోర్టు విభజనకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 31(2)లో కాలపరిమితి కూడిన సవరణ చేయాలి. -(వ్యాసకర్త: కరీంనగర్ ఎంపీ)( ఏపీ హైకోర్టు విభజన గురించి కేంద్ర న్యాయశాఖామంత్రి సదానంద గౌడకు రాసిన లేఖ సారాంశం..)