Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

గులాబీ దళాల జోరు

 

-జోరుగా సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ సన్నాహక సమావేశాలు
-పోటాపోటీగా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారాలు
-ముఖ్య నాయకులు, కార్యకర్తల మీటింగులతో బిజీబిజీ..
-అభినందన సభలు ఏర్పాటుచేసి మద్దతు పలుకుతున్న జనాలు

సీఎం కేసీఆర్ చేపట్టే ప్రజా ఆశీర్వాద సభల ఏర్పాట్లు.. శ్రేణులతో సన్నాహక సమావేశాలు, ర్యాలీలు, సభలు, ప్రచారయాత్రలు, ప్రతిపక్షాలపై విమర్శలతో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నది. గులాబీ అభ్యర్థులకు మద్దతు పలుకుతున్న గ్రామాలు.. ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు ఇస్తున్న గ్రామస్థులు, కులసంఘాలు.. వెరసి కారు వెంట కదులుతున్న పల్లెలన్నీ తెలంగాణ రాష్ట్ర సమితికి జై కొడుతున్నాయి. గులాబీ దండుకు అండగా ఉంటామని తెలుపుతున్నాయి. భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేస్తామని సంకల్పిస్తున్నాయి. సోమవారం మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీ లకా్ష్మరెడ్డి, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఓ వైపు ప్రచారం సాగిస్తూనే.. మరోవైపు నియోజకవర్గాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటుచేసుకుని ఎన్నికలపై సమాలోచనలు చేస్తున్నారు. ఇంకోవైపు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాల్లో జరగబోయే ఆశీర్వాద సభలకు సన్నాహక సమావేశాలు ఏర్పాటుచేసుకుని శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఎన్నికల రణరంగంలోకి దూకిన గులాబీదండు ప్రచారాన్ని వేడెక్కిస్తూ విశేష మద్దతు కూడగట్టుకుంటున్నది. సోమవారం వనపర్తి జి ల్లా పాన్‌గల్ మండలం వెంగళాయిపల్లి, రేమద్దుల గ్రామా ల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు విస్తృత ప్రచారం నిర్వహించారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అనంత రం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్‌గేట్ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీ ఎం కేసీఆర్ పాలనలో అన్నిరంగాలు అభివృద్ధి చెందాయ ని, సుభిక్ష పాలన అందిస్తున్నారని కొనియాడారు. ప్రాణమున్నంత వరకు ప్రజాసేవకే అంకితమవుతానని మంత్రి సీ లకా్ష్మరెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఎక్వాయిపల్లి, పెద్దాదిరాల, బాదేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. అనంతరం మా ట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. మహాకూటమి మాయను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ రాష్ర్టాన్ని ఉరికొయ్యకు ఎక్కించాలని చూస్తుంటే కోదండరాం తలారీగా మారారని ఆరోపించా రు. గజ్వేల్‌లో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు చూపించి ఓటు అడిగే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే ఉన్నదన్నారు.

టీఆర్‌ఎస్‌పై ప్రజలకు విశ్వాసం..
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్‌లో జరిగిన నియోజకవ ర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. నాడు చీకటి దొంగలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకు లు నేడు పగటి దొంగలుగా మారారని ఎద్దేవా చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయపల్లి గ్రామంలో వనపర్తి అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. మహబూబాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ పట్టణంలోని పలు కాలనీల్లో బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

గంగులకు అభినందన సభ..
కరీంనగర్‌లోని స్వర్ణకారసంఘం ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాజరైన గంగుల కరీంనగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి వేణుగోపాల్‌పూర్, గండిలచ్చపేట, ముస్తాబాద్ మండలం నా మాపూర్‌లో జరిగిన జెండా పండుగలో రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, సెస్ చైర్మన్ దోర్నాల లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలో ఈ నెల 4న నిర్వహించనున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లొంకకేసారం నుంచి సెంటినరీ కాలనీ వరకు మంథని అభ్యర్థి పుట్ట మధు ప్రచారయాత్ర చేపట్టారు. ఈ యాత్రను ప్రభుత్వ సలహాదారు వివేక్ ప్రారంభించారు. ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ రఘునాథపాలెంలో, వైరా అభ్యర్థి మదన్‌లాల్ వైరాలోని పలువార్డుల్లో, మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ముదిగొండ మండలం వెంకటాపురం, ముదిగొండ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మద్దతులు..
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ స్వర్ణకారులు సీఎం కేసీఆర్ కు మద్దతు తెలిపారు. మద్దతు పత్రాన్ని మంత్రి హరీశ్‌రా వుకు అందజేశారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామానికి చెందిన ఎస్సీ కులస్థులు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మద్దతు ప్రకటించారు. మండల కేంద్రంలోని సీసీడీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తమ నిర్ణయ పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌కు మార్కెట్‌లో పనిచేస్తున్న ట్రాలీ, హమాలీ, కాపలాదారుల సం ఘం సభ్యులు మద్దతు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామస్థులు కూసుకుంట్ల ప్రభాకర్‌కు అండగా ఉంటామన్నారు. నాగర్‌కర్నూ ల్ జిల్లా తిమ్మాజీపేట మండలం హనుమాన్ తండా పరిధిలోని చెన్నంగులతండావాసులు టీఆర్‌ఎస్ అభ్యర్థి మ ర్రి జనార్దన్‌రెడ్డికి ఓటు వేస్తామని చేతిలో చేయివేసి హామీ ఇచ్చారు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్‌కు మా ర్బుల్, పాలిష్‌స్టోన్ మర్చంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స భ్యులు మద్దతు ప్రకటించారు. గంగుల గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన అంబేద్కర్‌సంఘ సభ్యులు చెన్నమనేని రమేశ్‌కు మద్దతు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ అభ్యర్థి కేపీ వివేకానంద్‌కు సూరారం పరిధి టీఎస్‌ఐఐసీ కాలనీ, జీడిమెట్లలోని గూడ్స్, వెహికిల్స్ ఓనర్స్ సంక్షేమ సంఘం మద్దతు ప్రకటించింది. జీడిమెట్ల గ్రామంలోని పాస్టర్స్ అసోసియేషన్ కేపీ వివేకానంద్‌కు అండగా ఉంటామని వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆయన్ను ఆశీర్వదించారు. కుత్బుల్లాపూర్ గ్రామ పాత గ్రామపంచాయతీ పెద్దలు కేపీకి మద్దతు తెలిపారు. కారు గుర్తుకే ఓటు వేస్తామని చెప్పారు.

విరాళాలు..
సిద్దిపేట జిల్లా గజ్వేల్ అభ్యర్థి సీఎం కేసీఆర్ నామినేషన్ ఖర్చుల నిమిత్తం గజ్వేల్ స్వర్ణకారులు రూ.5,116 మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు.ఖమ్మం జిల్లా మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ఎన్నికల ఖర్చుల కోసం ముదిగొండ మండలం ముత్తారం మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకుడు తుపాకుల యెలగొండస్వామి రూ. 25వేలు అందజేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అభ్యర్థి కోనేరు కోనప్పకు నామినేషన్ ఖర్చుల నిమిత్తం దహేగాం మండలం కమ్మర్‌పల్లి గ్రామస్థులు రూ. 21 వేలు విరాళంగా సేకరించి అందజేశారు.

ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేయాలి: ఎంపీ జితేందర్‌రెడ్డి
ఈనెల 5న వనపర్తిలో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభను జయప్రదం చేసేందుకు ఉమ్మ డి పాలమూరు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి సూచించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తగ్గకుండా జనసమీకరణ చేపట్టాలని తెలిపారు. మక్తల్ నియోజకవర్గ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నివాసంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించేందుకు నియోజవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాలుగేండ్ల మూడునెలల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజల హృదయాలను గెలుచుకున్నారని, దమ్మున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఖ్యాతిగడించారని తెలిపారు. పలువురు ఆశావాహులకు పోటీచేసే అవకాశం దక్కలేదని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇబ్బందులున్న నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించి అభ్యర్థుల గెలుపునకు కృషిచేస్తామని వెల్లడించారు.

మోత్కుపల్లివి దొంగ ఏడ్పులు..నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని సీట్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలో రైతు సమన్వయ సమితి సభ్యులు, పాల ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సభలో గుత్తా మాట్లాడారు. 25 ఏండ్లు ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గోదావరి జలాల సాధన పేరుతో దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మోత్కుపల్లిపై ధ్వజమెత్తారు. ఇవే నా చివరి ఎన్నికలు అంటూ మాయమాటలు చెబుతున్నారని ఘాటుగా విమర్శించారు.

కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు
-శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ముఖ్యమంత్రి, మంత్రులు అనే గౌరవం లేకుండా కాంగ్రెస్ నేతలు వీధిరౌడీల్లా ప్రవర్తిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలో ఈ నెల 4న సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం కా ర్యకర్తలతో విస్త్రతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఆకురౌడీలను పార్టీలో చేర్చుకున్నార ని, వారు అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేండ్ల టీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుసునన్నారు.

రేవంత్, షబ్బీర్ తోడు దొంగలు
-కామారెడ్డి తాజామాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీ తోడుదొంగలని తాజామాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ భిక్కనూరు, కామారెడ్డిలో జరిగిన సభల్లో రేవంత్ పిచ్చికుక్కలా మాట్లాడారని దుయ్యబట్టారు. కామారెడ్డి ప్రజలకు షబ్బీర్ అలీ చరిత్ర అంతా తెలుసునన్నారు. జీపు డ్రైవర్‌గా పనిచేసిన రేవంత్‌కు వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తానని హెచ్చరించారు. షబ్బీర్ అలీని ఇప్పటికే మూడు సార్లు గంపకింద ఉంచానని, నాలుగోసారి శాశ్వతంగా గంపకింద కమ్ముతానని హెచ్చరించారు.

మంథని చేరుకున్న దివ్యాంగుడి ప్రచారం
సీఎం కేసీఆర్ వీరాభిమాని హైదరాబాద్‌కు చెందిన డీ మహేశ్ అనే దివ్యాంగుడు చేపట్టిన జనచైతన్య యాత్ర సోమవారం పెద్దపల్లి జిల్లా మంథనికి చేరుకున్నది. ఆయనకు స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ చిత్రపటాలను అలంకరించి మైక్ ద్వారా అభివృద్ధి, సంక్షేమ పాటలతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దివ్యాంగుడైన మహేశ్ వాహనాన్ని నడుపుతూ టీఆర్‌ఎస్ తరపున ప్రచారం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. గత నెల 27న ప్రారంభమైన ఈ యాత్ర రాష్ట్రంలోని 31జిల్లాల్లో జరుగుతుందన్నారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.