Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

గోల్‌మాల్‌ గుజరాత్‌ కాదు.. గోల్డెన్‌ తెలంగాణ మాడల్‌ దేశానికి కావాలి

కేటీఆర్‌ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీని ప్రజ లు బండకేసి కొట్టడం ఖాయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. 2001 లో తెలంగాణలో గులాబీజెండా ఎగిరి విప్లవం పుట్టి స్వరాష్ట్రం సాధించుకొన్నామని, బీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో మహరాష్ట్రలో ఇప్పుడు అగ్గి అంటుకొన్నదని చెప్పారు. ఆ అగ్గి దేశమంతా వ్యాపించి కాంగ్రెస్‌, బీజేపీని దహించి వేస్తుందని తెలిపారు.

-మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం మొదలైంది
-చారిత్రక అనివార్యత వల్లే జాతీయ రాజకీయాల్లోకి..
-కేసీఆర్‌ కాలిగోటికి సరితూగే నాయకుడున్నాడా?
-మోసం చేసి గద్దెనెక్కిన మోదీ సంగతి చూడాలి
-ఇతర రాష్ర్టాల ప్రజలు పొగుడుతుంటే.. ఇక్కడి మరుగుజ్జులు తిడుతున్నరు
-ఇది యుద్ధం.. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
-మారింది పార్టీ పేరు మాత్రమే .. డీఎన్‌ఏ కాదు
-సిరిసిల్ల ప్లీనరీలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
-119 నియోజకవర్గాల్లో ఒకే రోజు సభలు
-4,00,000 మంది క్రియాశీల సభ్యుల హాజరు
-ప్రతి గ్రామం, డివిజన్‌లో గులాబీ జెండా ఆవిష్కరణ
-తీర్మానాల ఆమోదం.. రాష్ట్రమంతా సంబురం

భారత రాష్ట్ర సమితి సరికొత్త చరిత్రను లిఖించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 119 నియోజకవర్గాల్లో పార్టీ సభలను నిర్వహించి.. గులాబీ బలగం బలాన్ని చాటింది. ఈ నియోజకవర్గ ప్లీనరీల్లో 4 లక్షల మంది ప్రతినిధులు పాల్గొనడం ఓ రికార్డు. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ఊరూరా గులాబీ జెండా ఎగిరింది. ప్రతి ఊరిలో పతాకావిష్కరణ చేసిన అనంతరం నాయకులు నియోజకవర్గ సభలకు తరలివెళ్లారు. శ్రేణుల్లో ఉత్సాహం, ఉత్తేజం పొంగిపొర్లింది. ‘దేశ రాజకీయ చరిత్రలో ఈ సభలు అరుదైన మైలురాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నాలుగు లక్షల మంది క్రియాశీల కార్యకర్తలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీల వైఫల్యాల విషయంలో నిర్మాణాత్మక సందేశం అందింది’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆదమరిచి ఉండకండి.. జాతీయ స్థాయిలో యుద్ధానికి బయలు దేరుతున్నాం. మన ప్రత్యర్థులను వాళ్ల నియోజకవర్గంలోనే మట్టికరిపించి మన నాయకుడికి కరీంనగర్‌ పార్లమెం టు సీటు కానుకగా ఇవ్వాలి. క్రమశిక్షణగా గులాబీ సైనికులంతా కదం తొక్కి దేశ రాజకీయాల్లో పార్టీ సత్తాను చాటాలి.
– మంత్రి కేటీఆర్‌

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీని ప్రజ లు బండకేసి కొట్టడం ఖాయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. 2001 లో తెలంగాణలో గులాబీజెండా ఎగిరి విప్లవం పుట్టి స్వరాష్ట్రం సాధించుకొన్నామని, బీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో మహరాష్ట్రలో ఇప్పుడు అగ్గి అంటుకొన్నదని చెప్పారు. ఆ అగ్గి దేశమంతా వ్యాపించి కాంగ్రెస్‌, బీజేపీని దహించి వేస్తుందని తెలిపారు. గోల్‌మాల్‌ గోవిందంతో దేశాన్ని మోసం చేసి గద్దెనెక్కిన మోదీ సంగతి చూడాలని, ఆయన పార్టీ సంగతి చూడాలంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధిని దేశమంతా అమలు చేయాల్సిన అవసరమున్నదని చెప్పారు. మంగళవారం సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద బీఆర్‌ఎస్‌ సిరిసిల్ల ప్రతినిధుల సభలో కేటీఆర్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు. గోల్‌మాల్‌ గుజరాత్‌ కాదని, గోల్డెన్‌ తెలంగాణ మాడల్‌ను దేశానికి పరిచయం చేయడానికే బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిందన్నారు. మన రైతు బాగుపడ్డట్టే ఇతర రాష్ర్టాల్లోని రైతులు బాగుపడాలన్న లక్ష్యంతోనే బీఆర్‌ఎస్‌ వచ్చిందని పేర్కొన్నారు.

డీఎన్‌ఏ పాతదే
టీఆర్‌ఎస్‌ పేరు మాత్రమే మారిందని, డీఎన్‌ఏ, పార్టీ నాయకుడు మారలేదని కేటీఆర్‌ స్పష్టంచేశారు. చారిత్రక అనివార్యత కోసమే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారని చెప్పారు. ఔరంగాబాద్‌, నాందేడ్‌, లోహా లో కేసీఆర్‌ సభలకు లక్షల మంది తరలి వచ్చి బ్రహ్మరథం పట్టారని గుర్తుచేశారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ 9 ఏండ్లలో రైతుల కోసం విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టుల కోసం 4.5 లక్షల కోట్లు ఖర్చుచేస్తే, 45 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న కేంద్రం ఏంచేసిందని నిలదీశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామంటే 60 లక్ష లమంది గులాబీ సైనికుల వల్లేనన్నారు.

ఇది ఎన్నికల సంవత్సరం. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. 2018 ఎన్నికల్లో 89 వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. అంత మెజార్టీ వచ్చిందని ఆదమరవడం వల్ల పార్లమెంటు ఎన్నికల్లో పచ్చని పందిట్ల పాము సొచ్చినట్టు మతం పేరిట చిచ్చుపెట్టే సన్నాసులు వచ్చారు.
– మంత్రి కేటీఆర్‌

కేసీఆర్‌ కాలి గోటికి సరిపోయే నేత లేడు
కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశమే ఆమోదించే పరిస్థితి ఉన్నదని.. పక్క రాష్ర్టాల ప్రజలు జేజేలు కొడుతుంటే, ఇక్కడున్న కొంత మంది సన్నాసులు తిడుతూ పైశాచికానందం పొందుతున్నారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. ‘బ్రెయిన్‌ లేని బంటి ఒకదిక్కు, రోజుకో పార్టీ మారే చంటి ఇంకో దిక్కు.. వారేం మాట్లాడుతారో వారికే తెలియదు. పోటీ రాజకీయం సమ ఉజ్జీలతోనే ఉంటుంది.. మరుగుజ్జులతో కాదు. తెలంగాణలోని ప్రతిపక్షంలో ఏ ఒక్కడూ కేసీఆర్‌కు సరితూగేవాడు లేడు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మొదటిసారి 119 నియోజకవర్గాల్లో ఒకేరోజు పార్టీ ప్రతినిధులు సభలు నిర్వహించి రికార్డు సృష్టించామని చెప్పారు. 4 లక్షల మంది గులాబీ కుటుంబ సభ్యులు కలిసి గ్రామగ్రామాన జెండా పండుగ నిర్వహించుకోవడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. ‘ఆసరా పెన్షన్‌ పొందుతున్న అవ్వలు, బీడీ కార్మికులు, అక్కలు, చెల్లెండ్లు, గొల్ల కుర్మలు, మత్సకారులు సంతోషంగా ఉన్నారు. ఉచిత కరెంటు పొందుతున్న నాయీబ్రాహ్మణులు, రజక సోదరులు, రైతుబంధు అందుకొంటున్న రైతులతో పాటు ప్రతి మతం, ప్రతికులం ఈరోజు సంతోషంగా ఉన్నాయంటే అందుకు కారణం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే.

3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘతన రాష్ట్ర ప్రభుత్వానిదే. 30 వేల మంది గిరిజన బిడ్డలు ప్రజాప్రతినిధులయ్యారు. 6 శాతం ఉన్న ఎస్టీ రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచటంవల్ల విద్యా, ఉద్యోగ అవకాశాలు దక్కి ఉప్పొంగిపోతున్నారు. దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టినందుకు అన్ని వర్గాలు జై భీం అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి’ అని తెలిపారు. ‘ఇది ఎన్నికల సంవత్సరం. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. 2018 ఎన్నికల్లో అందరూ నాకోసం బాగా కష్టపడ్డారు. కమిట్‌మెంట్‌తో కష్టపడి 89 వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. అంత మెజార్టీ వచ్చిందని ఆదమరవడం వల్ల పార్లమెంటు ఎన్నికల్లో పచ్చని పందిట్ల పాము సొచ్చినట్టు మతం పేరిట చిచ్చుపెట్టే సన్నాసులు వచ్చారు. వినోద్‌కుమార్‌ లాంటి మంచి మనిషిని ఓడగొట్టుకొని ఓ విచిత్ర జీవిని ఎంపీగా తెచ్చుకున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతడో తెలియని వ్యక్తిని చూసినవారంతా ఇతనేనా మీ ఎంపీ అని అడిగితే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థంకాని పరిస్థితి ఉన్నది’ అని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, టీఎస్‌టీపీడీసీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

మీరు చేసిన పనులు గొప్పవైతే నిన్నమొన్నటి వరకు ఎలాంటి పరిచయం లేని కేసీఆర్‌ వెంట అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అంటూ మహారాష్ట్ర రైతులు, ప్రజలంతా ఎందుకు కలిసి వస్తారు? 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ రైతుల ఆదాయం డబుల్‌ చేస్తానన్న మాటలు నిజం చేస్తే, ఇయ్యాల మహారాష్ట్రలోని యవత్‌మాల్‌ జిల్లాలో రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకొంటున్నారు.

– మంత్రి కేటీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.