Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దేశానికే ఆదర్శంగా పారిశ్రామిక విధానం

– పైసా అవినీతి లేకుండా అమలుచేస్తాం.. – అమెరికా బృందానికి భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ – పెట్టుబడులకు అమెరికా పారిశ్రామికవేత్తల ఆసక్తి – త్వరలోనే కార్యాలయం ప్రారంభిస్తామని హామీ

KCR

రాష్ట్రంలో అమలుచేయబోయే పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పైసా అవినీతి లేకుండా అమలుచేస్తామని స్పష్టం చేశారు. అమెరికా విదేశీ వాణిజ్య సేవలు, గ్లోబల్ మార్కెట్ సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శుక్రవారం సచివాలయంలో కలిసింది. ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ ఎం అరుణ్‌కుమార్ నేతృత్వంలోని బృందం సీఎంతో సమావేశమై పారిశ్రామిక విధానంపై చర్చించింది.

తమకు తెలంగాణలో విమానాయాన, రక్షణ పరమైన పరిశ్రమలను నెలకొల్పాలనే ఆసక్తి ఉందని బృందం వెల్లడించింది. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ఇండో- అమెరికన్ సమ్మిట్‌ను నిర్వహిస్తామని తెలిపింది. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో మూడులక్షల ఎకరాల భూమిని అందుబాటులోకి తేనున్నట్లు అమెరికా బృంద సభ్యులకు ముఖ్యమంత్రి చెప్పారు. పరిశ్రమల అనుమతుల్లో జాప్యం లేకుండా తన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఛేజింగ్‌సెల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న రెండు వారాల్లోపే అనుమతినివ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. త్వరలో హైదరాబాద్‌లో తమ సంస్థ కార్యాలయాన్ని నిర్మిస్తామని అమెరికా విదేశీ, వాణిజ్య సేవలు, గ్లోబల్ మార్కెట్ కౌన్సిల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ సీఎం కేసీఆర్‌కు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటన షెడ్యూల్‌లో హైదరాబాద్‌ను చేర్చాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అమెరికా బృందాన్ని కోరారు. సీఎంను కలిసిన అమెరికా విదేశీ, వాణిజ్య సేవలు, గ్లోబల్ మార్కెట్ బృందంలో మ్యాక్ క్యాస్లిన్, మైఖేల్ ముల్లిన్, వినయ్‌సింగ్, సత్యప్రభ, తదితరులు ఉన్నారు. సమావేశంలో సాంకేతిక, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, ్రప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, చీఫ్ సెక్రెటరీ రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్‌రావు సమావేశంలో పాల్గొన్నారు.

నేడు సీఎంతో సీకే బిర్లా భేటీ? సీఎం కేసీఆర్ ప్రకటించిన పారిశ్రామిక విధానం, తీసుకుంటున్న చర్యలు విదేశీ, స్వదేశీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. బడా పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఓరియంట్ సిమెంట్స్ అధినేత సీకే బిర్లా శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నట్లు సమాచారం. సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చించవచ్చని సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.