Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దేశం చూపు తెలంగాణ వైపు

తెలంగాణ వస్తే ఏం వస్తది..? పరిపాలన చేతనైతదా? మీ ఇండ్లల్లో కరంటు బల్బులైనా వెలిగించుకోగలరా? పంటలు పండించుకోగలరా? చదువు చెప్పుకోగలరా? మతకల్లోలాలకు నిలయమవుతుందేమో! నాలుగేండ్ల కిందటి వరకు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారి వాదనలు ఇవీ! రాష్ట్రం ఏర్పడ్డ సమయానికి కూడా ఎందరి మదిలోనో పెసర గింజంత అనుమానం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నవ్వులపాలైతదా.. అనే భయం! కానీ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ నాలుగేండ్లలో తెలంగాణ సుస్థిరత వైపు ప్రయాణం చేసింది. రాష్ర్టాలకేకాదు.. కేంద్రానికి కూడా ఓ అధ్యయన వేదికగా నిలిచింది. వీళ్లవల్ల కాదన్న నోళ్లే.. వీళ్లయితేనే చేయగలరంటూ కేసీఆర్ సర్కారును పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించారు. నాలుగేండ్లలో బంగారు తెలంగాణ దిశగా గట్టిపునాదులు పడ్డాయి. నాలుగేండ్లలో ఏంచేశారని ఎవరైనా ప్రశ్నిస్తే గుక్కతిప్పుకోకుండా చెప్పే పథకాలున్నాయి. నాలుగేండ్ల పసికూన.. దేశ ఆర్థిక, వ్యవసాయ, సేవల రంగాల్లో నంబర్‌వన్ స్థానానికి ఎదిగింది. ఒకటా.. రెండా నాలుగేండ్లలో 426కుపైగా పథకాలు అమలైన రాష్ట్రం ఒక్క తెలంగాణానే. వాటిపై ఒక అవలోకనం..

ఓరుగంటి సతీశ్ సంక్షేమం- అభివృద్ధి జోడుగుర్రాలుగా తెలంగాణ పాలన సాగుతున్నది. వృద్ధులు, వితంతు, ఒంటరి, దివ్యాంగులు, బోధకాలు బాధితులు, వృద్ధ కళాకారులు, బీడీకార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన తొలి, ఏకైక రాష్ట్రం తెలంగాణే. నేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు.. ఇలా సమాజంలో ఇబ్బందులు పడుతున్న ప్రతీ ఒక్కరికి ఏదో ఒక రూపంలో సహాయం అందించేందుకు సామాజిక బాధ్యతతో ఆసరా పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారు. 41, 78,291 మందికి నెలకు సరాసరి రూ.442 కోట్లను, ఏడాదికి 5,366 కోట్లను కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులకు అదికూడా నెలకు రూ.200 పింఛన్ ఇచ్చేవారు. కానీ, తెలంగాణ ప్రభు త్వం పింఛన్లను వెయ్యి, పదిహేనువందులు చొప్పున అందిస్తున్నది. ఈ చారిత్రాత్మక పథకంపై వివిధ రాష్ర్టాలు అధ్యయనం కూడా చేశాయి.

పేదింట పెండ్లికి పెద్దన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి ఇంట్లో ఆడపిల్ల వివాహానికి ఆర్థిక సహాయం ఇచ్చేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో పథకాన్ని రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ప్రారంభించారు. తొలుత రూ.51వేలు ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం లక్షానూటపదహార్లు ఇస్తున్నది. ఏప్రిల్ 2018 నాటికి 3,23,963మందికి మంజూరు కూడా చేశారు. షాదీముబారక్ కింద 86,104 మంది పేద ముస్లిం ఆడబిడ్డలు లబ్ధి పొందారు. 4,581 మంది ఈబీసీలు కూడా పథకం ద్వారా సర్కారీ కానుక అందుకున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కల్యాణలక్ష్మి తరహాలో పథకాన్ని బీజేపీ తన మ్యానిఫెస్టోలో చేర్చడం గమనార్హం.

విద్యార్థులకు సన్నబియ్యం.. ఒకప్పుడు స్కూళ్లలో మధ్యా హ్న భోజనానికి, హాస్టళ్లలో దొడ్డుబియ్యంతో అన్నం పెట్టేవారు. కానీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యార్థులకు కడుపునిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్నది కేసీఆర్ సర్కారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు, కాలేజీ విద్యార్థులకు కూడా సన్నబియ్యమే సరఫరాచేస్తున్నది. 44.61 లక్షల మంది పిల్లలకు సన్నబియ్యంతో అన్నం తింటున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.728 కోట్లు ఖర్చుచేస్తున్నది. సమైక్యపాలనలో రేషన్ దుకాణాల్లో ఒక వ్యక్తికి నెలకు 4 కిలోల చొప్పున గరిష్ఠంగా ఒక కుటుంబానికి 20 కిలోలు ఇస్తే.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఎంత మంది సభ్యులుంటే అంత మందికీ ఇస్తున్నది కేసీఆర్ సర్కార్. అది కూడా కిలోబియ్యం రూపాయికే.

మైనార్టీల సంక్షేమ వార్షిక బడ్జెట్ రూ.2000 కోట్లు..! మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సాగుతున్నది. రాష్ట్రంలో మైనార్టీలు పొందుతున్నన్ని పథకాలు, వారికి కలుగుతున్న లబ్ధి, వారికి కేటాయిస్తున్న నిధులు దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలేదు. ఏకంగా 216 మైనార్టీ గురుకులాలను కేసీఆర్ సర్కారు ఏర్పాటుచేసింది. వీటిలో 57,980 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాబోయే ఐదేండ్లలో వీరి సంఖ్య 1.3 లక్షలకు పెరుగనుంది. రంజాన్, క్రిస్మస్ తదితర పండుగులకు ప్రతీ పేదకు దుస్తులతోపాటు పండుగకు సరిపడా సామగ్రినీ అందిస్తున్నది. ఇక 12% రిజర్వేషన్ల అమలుకు కూడా సంకల్పించింది. ప్రస్తుతం కేంద్రం వద్ద ఫైలు ఉన్నది. మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్‌లో ఈ ఏడాది రూ.2000 కోట్లు కేటాయించడం రికార్డు. సుమారు 60 ప్రత్యేక పథకాలు మైనార్టీలకే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

రైతుకు వెన్నదన్నుగా చెక్కుల పంపిణీ రైతుకు ప్రభుత్వమే పంట సాయం అందించడం అనేది దేశంలోనే చారిత్రాత్మకం. దీని ద్వారా తాను రైతు పక్షపాతినని తెలంగాణ సర్కారు మరోసారి నిరూపించుకున్నది. రైతుబంధు పేరిట ప్రతీ పంటకు ఎకరానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ.8 వేలను రైతులకు నేరుగా అందించేందుకు కేసీఆర్ సర్కారు అంకురార్పణ చేసింది. రాష్ట్రంలోని 57.33 లక్షల రైతులకు తొలివిడుతగా ఇప్పటికే రూ.5608.9 కోట్లను అందజేశారు. ఇక రాష్ట్రంలోని భూ రికార్డులను ప్రక్షాళన చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. కోటి 40లక్షల ఎకరాల వ్యవసాయ భూమి రికార్డులను సరిచేశారు. వీటికి పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇంత పెద్ద ఎత్తున భూరికార్డుల ప్రక్షాళన స్వతంత్ర భారత చరిత్రలో జరుగలేదు. రైతన్నకు రూ.5లక్షల బీమా కల్పించడం కూడా దేశంలోనే మొదటిసారి. దేశం యావత్తు తెలంగాణ వైపు చూసేలా చేసిన పథకమిది. ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఇదో అధ్యయనాంశంలా మారింది.

కాళేశ్వరం.. ఓ అద్భుత ప్రతిసృష్టి తెలంగాణకు సాగునీళ్లు ఎట్లా? అని ప్రశ్నించిన వాళ్లు ఇప్పుడు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూసేందుకు వస్తున్నారు. 2016 మే 2వ తేదీన శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో దీని నుంచి పంటపొలాలకు నీటిని అందించేందుకు శ్రమిస్తున్నారు. తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలోని కోటిన్నర ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే ప్రాజెక్టు ఇది. కేంద్రం జల సంఘం సహా జాతీయ, అంతర్జాతీయ ఇంజినీరింగ్ నిపుణులు కూడా దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో మొత్తం 225 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఒక్క కాళేశ్వరమే కాదు.. డిండి, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు, పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి.. ఇలా పదుల సంఖ్యలో ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాదికి ప్రభుత్వం రూ.25వేల కోట్లు ఖర్చు చేస్తున్నంది. ఇదో రికార్డు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు దేశపర్యాటకులను కూడా ఆకర్షిస్తున్నాయి.

రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ.. ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణ నిరుద్యోగులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు గగనకుసుమంలా ఉండేది. కానీ, తెలంగాణ వచ్చాక ఇప్పటికే 81,000 ఉద్యోగాలకు ప్రభుత్వం ఆర్థిక అనుమతులు ఇచ్చింది. వీటిలో 32,733 పోస్టులకు నోటిఫికేషన్లు కూడా వచ్చి వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే 17,000 మంది ఉద్యోగాల్లో చేరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలోనే అత్యంత పారదర్శకమైన ఉద్యోగాల భర్తీ విధానాన్ని అనుసరిస్తున్నదంటూ యూపీఎస్సీ అభినందించింది. గుజరాత్ సహా అనేక రాష్ర్టాల సర్వీస్ కమిషన్లు టీఎస్‌పీఎస్సీ తీరును మెచ్చుకోవడంతోపాటు తమ రాష్ర్టాల్లో ఇక్కడి విధానాలను అమలుచేయడానికి అధ్యయనంచేసి వెళ్లాయి. టీఎస్‌పీఎస్సీ ఏర్పడ్డ మూడేండ్లలోనే 17000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయడం, 32 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీచేయడం రికార్డే. ఇక జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వంటి విద్యుత్ సంస్థల్లో గడిచిన నాలుగేండ్లలో11వేల పోస్టులు భర్తీచేశారు. సింగరేణిలో ఏడువేల పోస్టులు భర్తీచేశారు. పోలీసుశాఖలో 12వేల పోస్టులను ఇప్పటికే భర్తీ చేయగా, మరో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.

చీకటి నుంచి వెలుగుల ప్రస్థానం.. కోతల్లేని విద్యుత్ సరఫరా తెలంగాణ ఏర్పడటం ఖాయం అన్న సమయంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఏర్పడితే చీకటి బతుకులేనంటూ వెక్కిరించాడు. తెలంగాణ ఏర్పడేనాటికి గ్రామాల్లో రోజుకు 12 గంటలు, పట్టణాల్లో నాలుగు గంటలకు తక్కువ కాకుండా కోతలు ఉండేవి. పరిశ్రమలకు పవర్ హాలిడే ఉండేది. ఏపీ ప్రభుత్వం కుట్ర చేసి విద్యుత్ లేకుండా చేసింది. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 6,574 మెగావాట్లు. 2,700 మెగావాట్ల లోటు. కానీ, కేవలం ఆరునెలల్లోనే తెలంగాణ కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేసే స్థితికి ఎదిగింది. విద్యుత్‌రంగంలో ప్రభుత్వం రూ.94000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 29వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో కొత్త కేంద్రాలు నెలకొల్పుతున్నది. 2018 ఏప్రిల్‌నాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 15,380 మెగావాట్లకు చేరుకున్నది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి 3,320 మెగావాట్లకు చేరింది. ఇది దేశంలోనే అత్యధికం. 2018 జనవరి నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందించడం కూడా రికార్డే.

మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయ రాష్ట్రంలోని 2.72 కోట్ల మందికి రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మిషన్ భగీరథ పట్టాలకెక్కింది. నీళ్లు ఇవ్వలేకపోతే ఓట్లు అడగబోమంటూ సీఎం కేసీఆర్ బహిరంగ ప్రకటన చేసి మరీ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఇది పూర్తవుతున్నది. బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్‌తోపాటు అనేక రాష్ర్టాలు మిషన్ భగీరథను ఆదర్శంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 5752 గ్రామీణ ఆవాసాలకు, 15 పట్టణాల్లో మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నారు. మిషన్ కాకతీయను ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అధ్యయనం చేస్తున్నారు. వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ వంటివారు మిషన్‌కాకతీయ ద్వారా పూడిక తీసిన చెరువుల వద్ద నిద్ర చేసి వెళ్లారు.

పారిశ్రామిక విధానం.. ప్రపంచానికే ఆదర్శం టీఎస్ ఐపాస్ పేరుతో ప్రభుత్వం అమలుచేసిన నూతన పారిశ్రామిక విధానం అద్భుతం. ఈవోడీబీ ర్యాంకుల్లో వరుసగా రెండేండ్లపాటు మొదటి స్థానం దక్కించుకోవడమేకాకుండా.. గడిచిన నాలుగేండ్లలో 1,28,868.21 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 7105 పరిశ్రమలు కొత్తగా స్థాపించారు. 5,72,738 మందికి ఉపాధి లభించింది. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు 57 రకాల అనుమతులు ఇవ్వడం అపూర్వం. పెట్టుబడుల ఆకర్షణలో దేశ సగటు 20.8 శాతంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం సగటు 79%గా ఉంది. నాలుగేండ్ల పాలనలో..

-రూ.60 వేల నుంచి రూ.1.5 లక్షలకు: గ్రామీణ పేదల ఆదాయ పరిమితి పెంపు -రూ.75 వేల నుంచి రూ.2 లక్షలకు: పట్టణ పేదల ఆదాయ పరిమితి పెంపు -39,01,006 మంది: పెన్షన్లు అందుకుంటున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ రోగులు, బీడీ కార్మికులు, పేద వృద్ధ కళాకారులు. దీనికోసం 2018-19 బడ్జెట్‌లో రూ.5,366.89 కోట్లు కేటాయించింది. -వికలాంగుల పెన్షన్లు రూ.1500కు పెంపు -రూ.1,000: బోధకాలు బాధితులకు అందిస్తున్న పెన్షన్ -3,19,963: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులు. -2.75 కోట్ల మంది: 85 లక్షల రేషన్‌కార్డుల ద్వారా బియ్యం అందుకుంటున్న లబ్ధిదారులు -44,61,370 మంది: హాస్టళ్లకు, మధ్యాహ్న భోజన పథకానికి సన్న బియ్యం సరఫరా ద్వారా లబ్ధిపొందుతున్న విద్యార్థులు -రూ.50 వేలు: వడదెబ్బ మృతులకు ఆపద్భందు ద్వారా అందిస్తున్న మొత్తం. ప్రకృతి వైపరీత్యాల మృతులకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది. -రూ.1,682 కోట్లు: యువత ఉపాధి కోసం ఎకనామిక్ సపోర్టు స్కీం కింద సగం వరకు సబ్సిడీ భరిస్తున్న పథకానికి కేటాయింపు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ విధానంతో తెలంగాణలో 25 మంది ఎస్సీ, 10 మంది ఎస్టీ రైతులు చైర్‌పర్సన్లు కాగలిగారు. షెడ్యూల్ ఏరియాలో మరో 13 వ్యవసాయ మార్కెట్లలో కూడా ఎస్టీలే మార్కెట్ చైర్‌పర్సన్‌లు అయ్యారు. -1,12,493: 134 ఎస్సీ గురుకులాలు, 268 ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు -21: ఎస్టీ డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు (ఇందులో బాలికలకు 14, బాలురకు 7)రూ.20 లక్షలు: ఓవర్సిస్ స్కాలర్‌షిప్ (గతంలో రూ.10 లక్షలు ఉండేది. ఈ ఏడాది మార్చి 1 నాటికి విదేశాల్లో చదువు కోసం 532 మంది ఎస్సీ విద్యార్థులు, 146 మంది ఎస్టీలు లబ్ధిపొందారు) -550: తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు పొందిన కళాకారులు (వీరిలో 319 మంది ఎస్సీలు, 38 ఎస్టీలు ఉన్నారు). -4,984 : దళితులకు 3 ఎకరాల భూమి పథకం కింద లబ్ధిదారులు. -రూ.125.46 కోట్లు: వివిధ పథకాల కింద ప్రభుత్వం ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన రాయితీ (ఎస్టీలు కూడా రూ.66.41 కోట్ల ప్రయోజనం పొందారు). -రూ.56,980.79 : ఎస్సీకు 2014 నుంచి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం (2011 నుంచి 14 వరకు జరిగిన బడ్జెట్ కేటాయింపులు రూ.12,733 కోట్లే) -రూ. 33,625 : ఎస్టీలకు బడ్జెట్‌లో కేటాయింపులు (తెలంగాణ ఏర్పాటుకు ముందు నాలుగేండ్లలో కేటాయించింది రూ.12,791 కోట్లు) -57,980 : మైనార్టీ రెసిడిన్షియళ్లలో చదువుతున్న విద్యార్థులు -రూ.524 కోట్లు: మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు కేటాయింపు -8, 934: రూ.1500 భృతి అందుకుంటున్న ఇమాం-మౌజమ్‌లు -992: ఓవర్సిస్ పథకం కింద ఇప్పటివరకు లబ్ధిపొందిన మైనార్టీ విద్యార్థులు -రూ.13,526 కోట్లు: బీసీల సంక్షేమం కోసం 2016-17 నుంచి 2018-19 బడ్జెట్లలో కేటాయింపు (2013-14లో ఖర్చుచేసింది రూ.1,659 కోట్లు మాత్రమే) -119: వెనుకబడ్డ తరగతి వర్గాలకు ఏర్పాటుచేసిన ఆశ్రమ పాఠశాలలు ( తెలంగాణ ఏర్పాటుకు ముందు బీసీలకు 19 రెసిడెన్షియల్స్ మాత్రమే ఉన్నాయి). -రూ.5,000 కోట్లు: గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి 2017-18, 2018-19లలో కేటాయింపు. -2,53,785 : 75 శాతం సబ్సిడీతో గొర్రెలు అందుకున్న కుటుంబాలు ( 53లక్షల గొర్రెలను పంపిణీ చేశారు). -2.4 లక్షలు: 100%సబ్సిడీతో చేప పిల్లల పెంపకం వల్ల లబ్ధిపొందిన కుటుంబాలు -8,500 : రుణమాఫీతో లబ్ధిపొందిన చేనేత కార్మికులు. -రూ.1,270 కోట్లు : చేనేత కార్మికుల సంక్షేమం కోసం కేటాయింపు -418: మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ ఓవర్సిస్ స్కాలర్‌షిప్ కింద గరిష్ఠంగా రూ.20 లక్షలు సాయంపొందిన విద్యార్థులు -2,27,782 : వేతనాల పెంపుతో లబ్ధిపొందిన ఉద్యోగులు -19,345 : 64శాతం జీతం పెంపుతో లబ్ధిపొందిన వీఆర్‌ఏలు -రూ. 300 కోట్లు : ఉద్యోగులకు, జర్నలిస్టులకు వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు కోసం ఈ ఏడాది కేటాయింపు -15 శాతం: తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సాధించిన వృద్ధి -55,000: ఆర్టీసీలో 44శాతం ఫిట్‌మెంట్‌తో లబ్ధిపొందిన ఉద్యోగులు -23 లక్షలు: ప్రభుత్వ ఉచిత విద్యుత్ అందుకుంటున్న పంపుసెట్లు -15,284 మెగావాట్లు: తెలంగాణ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం -3,342 మెగావాట్లు: నాలుగేళ్లలో పెరిగిన సోలార్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం -24,225 ఆవాసాలు : మంచినీటి సరఫరా లక్ష్యం -5701 కిలోమీటర్లు: రాష్ట్రంలోని జాతీయ రహదారుల పొడవు -3,174 కిలోమీటర్లు: నాలుగేండ్లలో రాష్ట్రంలో అదనంగా నిర్మించిన జాతీయ రహదారులు -789: రాష్ట్రంలో మొత్తం గురుకుల పాఠశాలలు -491: నాలుగేండ్లలో అదనంగా ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలు -7105: టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు పొం దిన పరిశ్రమలు -రూ.1,28,050 కోట్లు: తరలివచ్చిన పెట్టుబడులు -5,72,174 మంది: ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్నవారు -రూ.3,704 కోట్లు: గనులపై ప్రభుత్వానికి 2017-18లో లభించిన ఆదాయం -రూ.1,400 కోట్లు: నాలుగేండ్లలో ఇసుక ద్వారా రాష్ర్టానికి లభించిన ఆదాయం -13.85%: ఐటీ ఎగుమతుల్లో సాధించిన వృద్ధిరేటు -6.01%: ఉపాధి అవకాశాల కల్పనలో సాధించిన వృద్ధిరేటు -15,605: 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాలు -81,961: గత నాలుగేండ్లలో టీఎస్‌పీఎస్సీ ద్వారా కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ -12,000: పోలీస్‌శాఖలో నాలుగేండ్లలో భర్తీచేసిన పోస్టులు -18,428 : పోలీస్‌శాఖలో తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు -13,357 : విద్యుత్‌శాఖలో మంజూరైన పోస్టులు -11,101 : విద్యుత్‌శాఖలో భర్తీచేసిన పోస్టులు -7,000: సింగరేణిలో భర్తీచేసిన ఉద్యోగాలు -రూ.200 కోట్లు : బ్రాహ్మణ పరిషత్‌కు కేటాయించిన నిధులు -13,934 : పంపిణీచేసిన ట్రాక్టర్లు -31,274 : పంపిణీచేసిన ట్రాక్టర్లకు బిగించే సేద్య పరికరాలు -26,179: పంపిణీచేసిన స్ప్రేయర్లు -రూ.5,730 కోట్లు: రైతుబంధు కింద 58.33 లక్షల మంది రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం -రూ.8,000 కోట్లు: రైతుబంధ కింద ఏడాదికి రైతులకు అందించే పెట్టుబడి సాయం -రూ.50వేల కోట్లు: నాలుగేండ్లలో నీటిపారుదలరంగంపై పెట్టిన ఖర్చు -8,60,563 ఎకరాలు : భారీ ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన -2,04,405 ఎకరాలు : భారీ ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణ -51,736 ఎకరాలు: మధ్య తరహా ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన -60వేల ఎకరాలు: కొత్త చెరువుల ఏర్పాటు ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన -1,23,146 ఎకరాలు : లిఫ్టు స్కీంల ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన -10,94,882 ఎకరాలు: మొత్తం కొత్త ఆయకట్టుకు సాగునీటి కల్పన -సుమారు 11.61 లక్షల ఎకరాలు: మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కింద ఆయకట్టు స్థిరీకరణ -9.43 లక్షల ఎకరాలు: 2017-18లో కొత్త ఆయకట్టు లక్ష్యం -రూ.5,000 కోట్లు: ఏడాదికి అందిస్తున్న పింఛన్ల మొత్తం -39,39,713మంది: పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు -13,34,83:వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల సంఖ్య -14,22,455 : వితంతు పింఛన్లు పొందుతున్నవారి సంఖ్య -36,1366: చేనేత పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య -61,547: పింఛన్లు పొందుతున్న గీతకార్మికుల సంఖ్య -47,035: పింఛన్లు పొందుతున్న ఎయిడ్స్ బాధితులు -13,084: పింఛన్లు పొందుతున్న బోధకాలు వ్యాధిగ్రస్తులు -4,07,782: పింఛన్లు పొందుతున్న బీడీ కార్మికులు -1,27,775: పింఛన్లు పొందుతున్న ఒంటరి మహిళలు -4,88,731: పింఛన్లు పొందుతున్న వికలాంగులు -31: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటైన జిల్లాలు -69: కొత్తగా ఏర్పాటైన డివిజన్లు -12,751: కొత్తగా ఏర్పాటైన పంచాయతీలు -రూ.1,36,504 కోట్లు : 2013-14 ఉమ్మడి ఏపీ వాస్తవ బడ్జెట్ -రూ.1,74,453.84 కోట్లు: తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.