
రాష్ట్రం లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్ పార్టీకి అఖండమైన, అపూర్వమైన విజయాన్ని అందించడమనేది దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన తీర్పుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.

దేశచరిత్రలోనే ఎన్నదగిన మహోద్యమాన్ని సాగించి సాధించుకొన్న తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.

ఆసరా పెన్షన్‌దారులకు రెండింతలు ఆనందం కలిగించే వార్త. నెలకు ఇప్పటివరకు అందుతున్న వెయ్యి రూపాయల బదులు రూ.రెండువేల పదహార్లు, దివ్యాంగులకు రూ.1500 బదులు రూ.మూడువేల పదహార్లు పింఛన్‌కింద లభించనున్నాయి.

శాసనసభ్యుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌కుమార్ పేరును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఖరారుచేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తమను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని ఖమ్మం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, పీ రాములు స్పష్టం చేశారు.

రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కల్తీ విత్తన వ్యాపారుల ఆటలు కట్టించాలని, రాష్ట్రంలో కల్తీ అన్నమాటే వినిపించకూడదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఎంతమాత్రం రాజీపడొద్దని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

పవిత్ర గోదావరి నదీతీరాన ఉన్న కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాన్ని అద్భుతమైన పుణ్యక్షేత్రంగా, పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ శని,ఆదివారాల్లో రెండు రోజులపాటు జిల్లాల పర్యటన ఖరారైంది. మొదటి రోజు పెద్దపల్లి జిల్లాలో, రెండోరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ జూలై చివరినుంచే గోదావరి జలాలను ఎత్తిపోయాలని, అందుకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Please contribute generously to the BRS Party.