Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

పచ్చటి పోటీ

పట్టణాల్లో ఓ పద్ధతి ప్రకారం పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల జీవనప్రమాణాలను పెంచేందుకు పురపాలికలను వందశాతం గ్రీనరీగా మార్చేలా ప్రణాళిక రూపొందించింది. మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు ఆదివారం ‘గ్రీన్‌స్పేస్‌ ఇండెక్స్‌’ పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు.


ఐదునెలలు.. 4,550 కోట్లు

కరోనా సంక్షోభంలోనూ బడాకంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి.రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాలతో పారిశ్రామికవేత్తలు భారీపెట్టుబడులకు ముందుకొస్తున్నారు. 5 నెలల్లోనే రూ.4,550 కోట్ల పెట్టుబడులను ప్రకటించగా.. మరికొన్ని కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.


జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం ఇవ్వాల్సిందే

జీఎస్టీ విధానం ప్రగతిశీల రాష్ర్టాలకు నిరుత్సాహకరంగా.. ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేని రాష్ర్టాలకు లాభదాయకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. జీఎస్టీలో చేరడం ద్వారా తెలంగాణ వంటి రాష్ర్టాలు 60-70% వరకు ఆదాయాన్ని కోల్పోయాయన్నారు.


కాలుష్యంలేని ఫార్మాసిటీ

ఫార్మాసిటీ కాలుష్యరహితంగా ఉండాలని, అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లుచేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఫార్మాసిటీపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశం మేరకు ముందుకువెళ్లాలని అధికారులకు సూచించారు.


రాష్ర్టానికి రావాల్సినవి 2538 కోట్లు

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,537.81 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కోరారు. ఉడాన్‌ పథకంలో వరంగల్‌ను కూడా చేర్చి, ఆ నగరానికి విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.


వరంగల్‌కు 25 కోట్లు

వరంగల్‌ నగరంలో భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. నగరంలో వరద ముంపునకు కారణమైన నాలాల ఆక్రమణలను వచ్చే దసరా నాటికి తొలిగిస్తామని చెప్పారు.


వరదతో పదిలం

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎక్కడికక్కడ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.


పారిశ్రామిక పరుగు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరూ ఊహించనిరీతిలో అతికొద్ది కాలంలోనే పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఎవరూ పెట్టుబడులు పెట్టరని, హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడిదారులు ఇతర ప్రాంతాలకు తరలిపోతారంటూ అపోహలు వ్యాప్తిచేసినవారందరి నోళ్లు మూతపడేలా పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ర్టానికి తరలివస్తున్నాయని చెప్పారు.


కయ్యాలమారి ఏపీ..

‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ర్టాలు అయినందున స్నేహంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం.


ఉద్యమనేతకు అశ్రునివాళి అర్పించిన సీఎం కేసీఆర్

విద్యార్థి దశలోనే అభ్యుదయాన్ని కాంక్షించిన విప్లవకారుడు ఇక లేడు. సమాజ మార్పుకోసం అక్షరాలను ఆయుధాలు చేసిన పాత్రికేయుడు.. సెలవన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి.. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టి.. అవిశ్రాంతంగా నినదించిన నిఖార్సయిన ఉద్యమకారుడు.. విశ్రమించాడు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.