Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

గెలుపే లక్ష్యం

ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేలా, అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లే వ్యూహాలకు పదును పెడ్తున్నారు. త్వరలో జరుగనున్న హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌, నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించేలా ముందుకు సాగుతున్నారు


పేదోళ్లకు హక్కు

వ్యవసాయేతర ఆస్తులపై ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యలను పరిష్కరించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆస్తి హక్కులు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అవసరమైతే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.


దసరాకు ధరణి

రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆయువుపట్టుగా మారనున్న ధరణి పోర్టల్‌.. దసరా పర్వదినాన ప్రారంభం కానున్నది. విజయదశమిని ప్రజలు శుభదినంగా భావిస్తున్నందువల్ల ఆ రోజున ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ఆలోగానే ధరణికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని సీఎం కేసీఆర్‌ శనివారం అధికారులను ఆదేశించారు.


గమనంలో అదే విశ్వాసం

ప్రజలతో, ప్రజల కోసం ఎన్నుకోబడిన పాలకులు తమ పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనే సోయి లేకుండా ప్రభుత్వాలు నడిపారు. ఇలాంటి పాలనా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పు లు తీసుకురావాల్సిన అవసరం ఉందని గ్రహించిన కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.


మ్యుటేషన్‌ ఉచితం

గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయభూముల వద్ద, బావులకాడి ఇండ్లు, ఫామ్‌హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉచితంగా మ్యుటేషన్‌ (ఎన్‌రోల్‌) చేయనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.


పోరుబాటలోనే జవాన్‌.. కిసాన్‌

దేశ సరిహద్దుల్లో జవాన్లు పోరాడుతున్నారని, మరో వైపు రైతులు సమస్యల పరిషారం కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై చర్చ ప్రారంభం సందర్భంగా.. వ్యవసాయబిల్లులపై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు.


ఐజీఎస్టీ బకాయి 2,641 కోట్లు

రాష్ర్టానికి రావాల్సిన ఐజీఎస్టీ బకాయి రూ.2,641 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు జీఎస్టీ కౌన్సిల్‌ను డిమాండ్‌ చేశారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ర్టాలకు ఇవి ఎంతో అవసరమని చెప్పారు. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌పై వివిధ రాష్ర్టాల ఆర్థికమంత్రుల బృందం మంగళవారం సమావేశమైంది.


రైతన్నకు రక్షణ కవచం

‘భూమి అంటే రైతుకు ప్రాణం కంటే ఎక్కువ. తరతరాలుగా వచ్చిన చట్టాలన్నీ అలాంటి భూమి నుంచి కేవలం శిస్తు వసూలుకోసమే నిర్దేశించాయి. కానీ రైతు కేంద్రంగా ఒక్క చట్టం కూడా రాలేదు. అందుకే ఇప్పుడు వచ్చిన నూతన రెవెన్యూ చట్టం చారిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైనది కూడా’ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి


రైతన్న నోట్లో కేంద్రం మట్టి

ఒక్క తెలంగాణలోనే 12 లక్షల ఎకరాల్లో 24 లక్షల టన్నుల మక్కలు పండుతాయి. ఇక దేశవ్యాప్తంగా ఉత్పత్తిని ఊహించుకోండి. మన దగ్గర పండిన మక్కలకే దిక్కులేదంటే.. ఉల్టా దిగుమతి చేసుకుంటే మన రైతు పరిస్థితి ఏమిటి? అతడు పండించే మక్కల్ని ఏం చేయాలి? అసలే కరోనా కాలం. ఖజానాకు ఆదాయం లేదు.


రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన టీఆర్ఎస్‌

అగ్రిక‌ల్చ‌ర్ బిల్లులను వ్య‌తిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించింది. స‌భా కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో.. ఇవాళ రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు మాట్లాడారు. వ్య‌వ‌సాయ బిల్లుపై ఓటింగ్‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని వ్య‌తిరేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.