
దుబ్బాకలో తప్పులమీద తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేతలు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ దక్కదన్న భయంతోనే బీజేపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. డబ్బులతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినప్పటికీ.. పోలీసులే డబ్బులు తెచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రానున్న రెండురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షించి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని చెప్పారు.

టీఆర్ఎస్ ఎన్ఆర్ఐలతో మంత్రి హరీశ్‌రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దుబ్బాక ఉపఎన్నికపై ఎన్ఆర్ఐలకు వివించారు. దుబ్బాకలో ఎన్నికల ప్రచార సరళిని వారికి వివరించారు. ఈఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల పాత్రపై దిశానిర్దేశం చేశారు.

మక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రాకుండాపోవడానికి కేంద్ర నిర్ణయాలే కారణమని రాష్ట్ర మంత్రిమండలి ఆందోళన వ్యక్తంచేసింది. దేశంలో వ్యవసాయరంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారాయని పేర్కొన్నది. మక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చింది.

కరోనా దెబ్బకు ప్రైవేటు దవాఖానలు తలుపులు మూసుకున్నా.. సర్కారు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రజల ప్రాణాలు కాపాడిన తెలంగాణ ప్రభుత్వం.. మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద ఖరీదైన వైద్యాన్ని అందిస్తూ పేదలకు బాసటగా నిలిచిన ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయానికి తెరతీసింది

వానకాలం వరి కోతకు సిద్ధమవడం.. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగని నేపథ్యంలో వడ్ల కొనుగోలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటుచేసి.. యాసంగి మాదిరిగానే వానకాలం వడ్లను కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. గ్రామాలవారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి దుబ్బాక ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకు సూచించారు. బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను సోలిపేట సుజాత కలిసి ఆశీస్సులు తీసుకొన్నారు.

అణగారిన వర్గాలు అభివృద్ధిలోకి రావాలంటే వారికి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలన్నది తన నమ్మకమని పురపాలన, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. కుల వ్యవస్థ నిర్మూలనకు ఆయా కులాలవారీగా స్థితిగతులను మార్చడమే మార్గమని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ మిలింద్‌కాంబ్లే ఇటీవల చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రజా ఉద్యమాలతోపాటు తెలంగాణ ఏర్పాటులో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సేవలు ఎనలేనివని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. ఆయన సేవలను టీఆర్‌ఎస్ మరువదని, దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Please contribute generously to the BRS Party.