Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

అందరికీ సంక్షేమం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరినీ ఆదుకొన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. శాంతిభద్రతల్లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదన్నారు. టార్చిలైట్‌ పెట్టి వెతికినా వివక్షకు చోటులేకుండా చేశామని ఉద్ఘాటించారు.


మోదీ.. గిదేంది?

రాష్ర్టానికి దేశ ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రి స్వాగతం పలుకడం సంప్రదాయం. ఇందుకు భిన్నంగా తనకు స్వాగతం పలుకడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రానవసరంలేదని ప్రధాన మంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపించింది.


అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలె

“నేనేమో ఐటీ కంపెనీలు తెచ్చి కొలువులు ఇప్పిస్తం అంటున్న. వాళ్లేమో హిందూ, ముస్లిం పంచాయతీలు పెట్టి కర్ఫ్యూలు తెస్తం అంటున్నరు. ఎవరు కావాల్నో ఆలోచించండి. మన బతుకులు బాగుచేసే వాళ్లను, మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చే వాళ్లను గెలిపించండి” అని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.


బీజేపీ నేతలు గోబెల్స్‌కు కజిన్స్‌

పెట్టుబడుల ఉపసంహరణనే విధానంగా పెట్టుకున్న బీజేపీ.. అవకాశం వస్తే హైదరాబాద్‌లో చార్మినార్‌, గోల్కొండ కోటను కూడా అమ్మేస్తుందని, జీహెచ్‌ఎంసీనీ ప్రైవేట్‌ పరం చేస్తుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ అసమర్థ, అవివేక విధానాలతోనే దేశఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని ఆరోపించారు.


అసమర్ధత, అన్యాయాలు, అసత్యాలు – భారతీయ జనతా పార్టీకి 50 ప్రశ్నలు

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కేంద్ర మంత్రులంతా ప్రశంసించి.. ఎన్నికల వేళ ఛార్జీషీట్‌ అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జవడేకర్‌ అన‌డం హాస్యాస్పదంగా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. భారతీయ జనతా పార్టీని 50 సూటి ప్రశ్నలతో నిలదీశారు.


మన నగరం మన పార్టీ మన పాలన

రాజకీయాల జోలికి పోకుండా ప్రజల అభివృద్థే మనోరథంగా స్వీకరించిన రాజనీతిజ్ఞులకే చరిత్ర బ్రహ్మరథం పడుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌నగరాన్ని ప్రజలందరి జీవగడ్డగా నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని ప్రభుత్వం నిరంతరంగా పనిచేస్తుందని తెలిపింది.


విద్వేషం బీజేపీ వాదం

విశ్వనగరం టీఆర్‌ఎస్‌ నినాదమని, విద్వేషం బీజేపీ వాదమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పచ్చని హైదరాబాద్‌లో ఓట్ల కోసం బీజేపీ నేతలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఆరేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమీ లేద మండిపడ్డారు.


దేశానికి కొత్త పంథా కావాలి

దేశాన్ని పాలించడంలో బీజేపీ, కాంగ్రెస్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. మాటలు చెప్పమంటే పెద్దపెద్ద మాటలు చెప్తారని, చేతల్లోకి వస్తే అంతా శూన్యంగానే ఉన్నదని మండిపడ్డారు. సోమవారం తెలంగాణభవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.


పవర్‌లో తెలంగాణ నంబర్‌వన్‌

స్వరాష్ట్రం వచ్చాక విద్యుత్‌, తాగు నీటి సమస్యలు తీరాయని, ముఖ్యంగా విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం భారతీనగర్‌ డివిజన్‌లోని సాయిబాబానగర్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో 2020

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విడుదల చేశారు. [gview file=”https://www.trspartyonline.org/wp-content/uploads/2020/11/GHMC-Manifesto_1-6F-1.pdf”]


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.