జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విడుదల చేశారు. [gview file=”https://www.trspartyonline.org/wp-content/uploads/2020/11/GHMC-Manifesto_1-6F-1.pdf”]

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భారతదేశంలోనే ఒక నిజమైన కాస్మోపాలిటన్ నగరంగా గొప్ప చారిత్రకనగరంగా హైదరాబాద్ ప్రసిద్ధిగాంచిందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకా? ప్రజా సమస్యలను పరిష్కరించినందుకా? మాపై బీజేపీ నాయకులు చార్జ్‌షీటు ఎందుకువేస్తరని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. దేశప్రజలు ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని వేయనందుకు, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వనందుకు బీజేపీ నాయకులపైనే చార్జ్‌షీట్లు వేయాలని చెప్పారు.

సుస్థిర ప్రభుత్వం, శాంతిభద్రతలతో తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని.. వీటివల్లనే హైదరాబాద్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తరలివస్తున్నాయని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. కొందరు నాలుగు ఓట్లు, సీట్ల కోసం దిగజారి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తొలి రోజు ప్రచారంతోనే టీఆర్‌ఎస్ ధూంధాం చేసింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు నిర్వహించిన రోడ్‌షోకు గ్రేటర్ ప్రజలు ప్రభంజనంలా కదిలి వచ్చారు. రెండు నియోజకవర్గాల పరిధిలో సాగిన రోడ్‌షో ఆసాంతం జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి.

మత విద్వేషా లు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ని వెంటనే అరెస్ట్‌చేసేలా ఆదేశాలు జారీచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి టీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదుచేశారు. టీఆర్‌ఎస్ ప్రధానకార్యదర్శులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశమయ్యారు.

హైదరాబాద్‌లో విభజన రాజకీయాలు కావాలా.. విశ్వాస రాజకీయాలు కావాలా.. విద్వేషపూరిత రాజకీయాలు కావాలా.. ప్రశాంత ప్రగతి కావాలా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి కేటీఆర్ హైదరాబాద్ ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.

సీఎం కేసీఆర్ కే చంద్రశేఖరరావు, మున్సిపల్, నగరాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు నాయకత్వంలో.. హైదరాబాద్ నగరాన్ని అచ్చమైన ప్రపంచ నివాసయోగ్యమైన, ఇష్టపడే నగరంగా తీర్చిదిద్దడానికి బహుముఖమైన సమగ్ర విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.

హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?.. అందరి హైదరాబాద్ కావాలా? కొందరి హైదరాబాద్ కావాలా?.. ఎవరికి ఓటువేస్తే ఏం జరుగుతుందో హైదరాబాద్ ప్రజలు విజ్ఞత, వివేకంతో ఆలోచించాలని.. పనిచేసే పార్టీకి పట్టం కట్టాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.
Please contribute generously to the BRS Party.