
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతి రంగానికీ న్యాయం చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అసాధారణ కార్యక్రమాలను అమలుచేస్తున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.

అధికారంలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలతో మంత్రులే అరెస్టయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు.

సరికొత్త విజన్, కొత్త పథకాలు, నూతన ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదాల్చిందని గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ అన్నారు.

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయచట్టాలతో దేశంలో మార్కెటింగ్ వ్యవస్థ ఎలా రూపాంతరం చెందినా రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లను కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.

వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గానికి కొత్తరూపు తెచ్చే బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నారు మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు. దత్తత సెగ్మెంట్‌లో ప్రగతి పరుగులు

ప్రభుత్వం అమలుచేస్తున్న ఐటీ విధానం రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని, భారీస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను సృష్టించిందని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

మానవాభివృద్ధి సూచీలో రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించిందని నీతిఆయోగ్ ప్రశంసించింది. గతంలో ఈ విషయంలో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం 3వ స్థానానికి ఎదగటాన్ని ప్రత్యేకంగా అభినందించింది.

పేదలకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లను భవిష్యత్‌లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

‘ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఐక్యం గా ఉండాలి. ఖమ్మం గుమ్మం మీద గులాబీజెండా రెపరెపలాడాలి’ అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.
Please contribute generously to the BRS Party.