
తెలంగాణలో కరంటు సమస్యపై చర్చించేందుకు సిద్ధమా? అని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సవాలు విసిరారు.

బాల్కొండ నియోజకవర్గానికి వద్దన్నదాక నీళ్లుంటాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

డిచ్‌పల్లిలో వచ్చే రెండేండ్లలో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందిస్త. మీకు హామీ ఇస్తున్న ఇక్కడ పంట పొలాలను పచ్చగా మార్చే బాధ్యత తీస్కుంటున్న అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

అభివృద్ధిని నమ్ముకొనే ముందుకుపోతున్నాం. 18 ఏండ్లు నిండినవారందరికీ ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం.

తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందని శాపాలు పెట్టారని, కానీ.. వారందరి అంచనాలను తలకిందులుచేస్తూ ఎలాంటి విద్యుత్‌కోతలు లేకుండా రాష్ట్రం దూసుకుపోతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

ఇవి ఆషామాషీ, తమాషా ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో వేసే ఓటు మన తలరాతను మార్చుతుంది. మన భవిషత్తును రక్షిస్తుంది అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

గత ప్రభుత్వాలు అవినీతితో ప్రజల సొమ్ము దోచుకుంటే.. తాము ప్రభుత్వంలో అవినీతిని బంద్‌చేసి.. సంపద పెంచామని, పెంచిన సంపదను అనేక సం క్షేమ పథకాల రూపంలో ప్రజలకు పంచుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే తండాలకు మహర్దశ పట్టిందని మంత్రి, సిరిసిల్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కే తారకరామారావు అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంటే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీకి బాధ ఎందుకని, ఎందుకు కడుపు తరుక్కుపోతున్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సూటిగా ప్రశ్నించారు.

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గులాబీ పార్టీ అభ్యర్థులు ప్ర చారంలో జోరు పెంచారు.
Please contribute generously to the BRS Party.