బంగారు తెలంగాణే ధ్యేయంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం వరంగల్‌లోని కేఎంసీ ఎన్‌ఆర్‌ఐ భవన్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ముఖ్యఅతిథులుగా మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పీ సాంబశివరావులు పాల్గొన్నారు.
-ఓరుగల్లు అభివృద్ధికి ప్రత్యేక కృషి.. 9న పనులపై సమీక్ష -భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
ఈ సందర్బంగా ఐఎంఏ నూతన అధ్యక్షుడు డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అన్వర్, కోశాధికారి డాక్టర్ ప్రవీన్‌రెడ్డితోపాటు కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. హరీశ్‌రావు మాట్లాడుతూ ఉద్యమ నేపథ్యంలో జిల్లాలోని అన్ని వర్గాలతో అవినాభావ సంబంధం ఉందని, ఇందులో ఐఎంఏ వైద్యులతో తనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఇదే క్రమంలో జిల్లాపై ఉన్న అభిమానంతో వరంగల్‌లో హెల్త్‌యూనివర్సిటీకి సర్కారు శ్రీకారం చుట్టిందన్నారు. కాకతీయ వైద్య కళాశాలకు అదనంగా 50మెడికల్ సీట్లను తెప్పించిన ఘనత ప్రభుత్వానికే దక్కిందన్నారు.
జిల్లాను ఇండస్ట్రీయల్ కారిడార్‌గా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈనెల 9న జిల్లాలో అభివృద్ధి పనులను సమీక్షించి ప్రధానంగా దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రత్యేక సమీక్షా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేశ్‌కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, సీనియర్ వైద్యులు డాక్టర్ విశ్వనాథం, డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కంకాల మల్లేశం, డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ బందెల మోహన్‌రావు, డాక్టర్ రాజ్‌స్దిద్ధార్థ, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్, డాక్టర్ కృపాదానం, డాక్టర్ కాళీప్రసాద్‌రావు పాల్గొన్నారు.