Author Archives: BRSpartyonline

నేడు గులాబీ పండుగ
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అత్యధికంగా ప్రజాప్రతినిధులను కలిగిన ఉన్న పార్టీగా గుర్తింపు పొందిన టీఆర్‌ఎస్ సంస్థాగతంగా పటిష్ఠం కావడానికి ప్రతి జిల్లాలో శాశ్వత కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నది.
పండుగలా ప్రారంభోత్సవం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించగా, అదే సమయానికి మేడిగడ్డకు ఎగువన వివిధ ప్రాంతాల్లో నిర్మించిన పంప్‌హౌస్‌లు, బరాజ్‌లను మంత్రులు పూజలు చేసి ప్రారంభించారు.

అద్భుతఘట్టం ఆవిష్కృతం
ఈ రోజు తెలంగాణలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమయింది. మానవ ఇతిహాసంలో ఎవరూ ఊహించని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం.. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తిచేసుకుని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.

నడకనేర్చిన గోదావరి.. తెలంగాణకు జలసిరి
ఉరుకుల గోదావరి వెనుకకు నడక మొదలుపెట్టింది. గంగమ్మను ఒడుపుగా ఒడిసిపట్టుకొని తెలంగాణ భూ ములవైపు మళ్లించి.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణకు మహాశివుడై నిలిచాడు.

కాళేశ్వర గంగ పొంగేది నేడే
మరికొన్ని గంటల్లో తెలంగాణ యవనికపై మహా జలదృశ్యం ఆవిష్కారమవుతున్నది. పాతాళ గంగమ్మ ఉరికురికి.. ఉబికుబికి.. పైపైకి ఎగిసిపడే క్షణంకోసం యావత్ తెలంగాణ సమాజం ఆత్రంగా ఎదురుచూస్తున్నది.
తెలంగాణ గడ్డపై గంగావతరణం
తెలంగాణ నీటిపారుదలలో కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక మలుపు. గోదావరి జలాల వినియోగంలో కాళేశ్వరానికి ముందు.. కాళేశ్వరానికి తరువాత అని చెప్పుకొనేలా సరికొత్త అధ్యాయానికి నాంది.

కాళేశ్వరం..అద్భుత ఆవిష్కరణ
అసలు ఇన్నేండ్లల్ల ఇంత తక్కువ టైముల ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినోళ్లు ఈ దునియ మీద ఎవ్వలన్న ఉన్నరా! నాకు తెల్సి లేరు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల ప్రమాణం
స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, తేరా చిన్నపురెడ్డి, ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన నవీన్‌కుమార్‌తో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణం చేయించారు.



