కాలం కడుపుతో ఉండి కవిని కంటుంది.. తెలంగాణ తల్లి కడుపుతో ఉండి కేసీఆర్‌ని కన్నది.. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకుంటం.., సాధించుకున్న తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసుకుంటం… ఇది 2010లో టీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపడుతూ తెలంగాణ భవన్‌లో కాళోజీ హాల్లో కేసీఆర్ సమక్షంలో జరిగిన సమావేశంలో నేను అన్న మాటలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతమైన చెన్నూ రు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నేను, తెలంగాణ వరదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా.. తెలంగాణ ఉద్యమకారుడిగా సంబురపడుతున్నా. ఎందుకంటే కాళేశ్వరం నీళ్లు, మా చెన్నూరు నియోజకవర్గాన్ని అలుముకోనే ఉంటయ్.
అసలు ఇన్నేండ్లల్ల ఇంత తక్కువ టైముల ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినోళ్లు ఈ దునియ మీద ఎవ్వలన్న ఉన్నరా! నాకు తెల్సి లేరు. ఇంకొస్తరో రారో కూడా తెల్వద్. చెయ్యాలనే కసి, కన్నీళ్లు తుడ్వాలనే ప్రేమ, దానికోసం ఎంతకైనా తెగించే ధైర్యం.. అన్నింటినీ సమన్వయం చేసుకునే చతురత, క్షణక్షణం అణువణువునా కార్యదీక్షా సంకల్పుడై కదిలితేనే కరిగే గమ్యం వైపుకు ఎంతమంది వెళ్తారు. ఎవరు సాహసిస్తారు. నేను దగ్గరుండి కేసీఆర్ గారిని కళ్లారా చూసిన కాబట్టే చెప్తున్నా.. ఒక్క కేసీఆర్ గారి వల్లనే ఇది అయితది. ఇంకెవల వల్ల కాకపోవు.. కాదుగూడా.
తెలంగాణ ఉద్యమ సందర్భంలో గోదావరి నదీ జలాలకు సంబంధించి మనం ఎన్నో పాటలు రాసుకున్నం. పాడుకున్నం. తలాపున పారుతుం ది గోదారీ.. మన చేను మన చెలక ఎడారి.., గోదారీ గోదారీ.. ఓహో పారేటీ గోదారీ, చుట్టూ నీళ్లున్నా.. చుక్క దొరకని ఎడారి నా భూమి.. ఇది తెలంగాణ భూమి.. అని గొంతు చించుకుని, కాళ్లకు గజ్జెకట్టుకుని పోరాటం చేసినం. ఆనాడు మన బాధను, గోసను పట్టించుకున్నోడు లేడు. సమైక్యపాలనలో గోదారి తల్లి సముద్రం పాలైతే.. తెలంగాణ రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుని, పొట్ట చేతపట్టుకుని, కన్నతల్లిని, ఉన్న ఊరుని వదిలేసి దుబాయ్ బొంబాయికి వలసలు పోయిండ్రు. అయినా ఆనాడు సమైక్యపాలకుల రాతిగుండెలు కరుగలే. తెలంగాణల ప్రాజెక్టులు కట్ట లే. గోదారి నీళ్లను మన బీళ్లకు మలపలే. కానీ మన తెలంగాణ బిడ్డ, ఉద్యమంల ఊళ్లన్నీ తిరిగి, మన కష్టాలను తెలుసుకున్న అప్పటి ఉద్యమనేత, ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. గోదా రి జలాలను ఒడిసి పట్టి, తెలంగాణ రైతన్నల గోస తీర్చాలని, తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేయాలని మొండిగా ఒక్కడే.. పగలనక, రాత్రనక, ఒక ఇంజినీరై, ఆర్కిటెక్క్ అయ్యి, శాస్త్రవేత్తలాగా.. ప్లాన్లు గీసిండు. ఆచరణల పెట్టిండు. ఆ అద్భుత ఆవిష్కరణే తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు. దీన్ని రికార్డ్ టైంలో మూడేండ్లలో పూర్తి చేయటం దేశం లోనే ఇతర ప్రాజెక్టులకు స్ఫూర్తి.
మొన్నీమధ్య ఒక టీవీ చర్చా కార్యక్రమంలో నేను కుండబద్దలు కొట్టినట్టు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు చెప్పిన. ప్రభుత్వాలు నడిపే మామూ లు నాయకులు.. కిందికిపొయ్యే నీళ్లకు అడ్డుకట్టలు కట్టి, నీళ్లిడుస్తరు. కానీ మా దమ్మున్న కేసీఆర్ లాంటి లీడర్ మాత్రమే, కిందికి పొయ్యే నది ని.. మీదికి మలుపుతడు. అదే మేడిగడ్డ నుంచి గోదారమ్మను పోచంపాడు ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు మలిపేదే ఈ కాళేశ్వరం.
నదికే నీళ్లిచ్చి గోదావరిని జీవనదిగా మార్చుతున్న మాగొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఎక్కడి మేడిగడ్డ.. ఎక్కడి ఎస్సారెస్పీ.. ఎక్కడి ప్రాణహిత. అప్పుడెప్పుడో 1960లో శాంతికపోతం ఎగిరేసి ఓ పెద్దాయన 90 టీఎంసీల నిలువ సామర్థ్యం అని చెప్పి, ఎస్సారెస్పీ కట్టిండు. అది ఏనా డు నిండింది లేదు. నీళ్లు ఆఖరు ఆయకట్టుకు పొయ్యిందీ లేదు. అసలు గోదావరిని పట్టించుకున్నోడే లేడు. పాపం ఆ తల్లి ఏం చేస్తది. వల వల ఏడ్చుకుంటూ ఓ తెలంగాణమా క్షమించంటూ.. కిందికెళ్లి సముద్రంలో కల్సింది. మన బతుకులు మట్టిల కల్సినయ్. మళ్లీ ఇన్నాళ్లకు మన ముఖ్యమంత్రిగారి పుణ్యమా అని.. గోదారి మీద ఇయ్యాల ఒకటి కాదు రెండు కాదు, గోదారి దారి పొడుగునా గోదారి తల్లి సైతం మురిసిపోయేలా ఆ తల్లికి పాదాభివందనం చేస్తూ నేటి ఆధునిక దేవాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి బరాజ్‌లు, నందిమేడారం, మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయ క సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ జలాశయాలు.., 22 లిఫ్ట్‌లు, 22 పంప్‌హౌజ్‌లు, 19కొత్త జలాశయాలు, 19విద్యుత్ సబ్ స్టేషన్లు, 203 కి.మీ సొరంగమార్గాలు, 1531కి.మీ పొడవైన గ్రావిటీ ప్రెషర్ కాలువలు.., 1832 కి.మీ మేర నీటిని సరఫరా చేసే మార్గాలతో మేడిగడ్డ నుంచి గోదావరి నీళ్లను ఎత్తిపోస్తూ.. ఉత్తర, మధ్య తెలంగాణ, అవసరమైన సందర్భంలో దక్షిణ తెలంగాణ అవసరాలు కూడా తీర్చేలా డిజైన్ అయ్యి.. ఫేజ్-వన్, ఫేజ్-2లు కలుపుకు ని, 45లక్షల ఎకరాలకు సాగు నీరందించే వరప్రదాయినిగా నిలువబోతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు.
సాగునీటి అవసరాలే కాకుండా పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలకు నిరంతరాయంగా నీళ్లందించే బృహత్తర ప్రాజెక్టు ఇది. గత వారం రోజులుగా చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాల్లో తాగునీటికి జనాలు ఇబ్బందులు పడుతున్నరు. కానీ మన కేసీఆర్ దూరదృష్టితో, హైద్రాబాద్ మహానగరానికి ఇంకో వందేండ్లయినా తాగునీటి సమస్యరాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కాపాడుతుంది. దాంట్లో భాగంగా కేశవ పూర్ దగ్గర, హైద్రాబాద్ తాగునీటి అవసరాల కోసం భారీ రిజర్వాయర్ ను ప్రభుత్వం నిర్మిస్తున్నది. అసలు ఇన్నేండ్లల్ల ఇంత తక్కువ టైముల ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినోళ్లు ఈ దునియ మీద ఎవ్వలన్న ఉన్నరా! నాకు తెల్సి లేరు. ఇంకొస్తరో రారో కూడా తెల్వద్. చెయ్యాలనే కసి, కన్నీళ్లు తుడ్వాలనే ప్రేమ, దానికోసం ఎంతకైనా తెగించే ధైర్యం.. అన్నింటినీ సమన్వయం చేసుకునే చతురత, క్షణక్షణం అణువణువునా కార్యదీక్షా సంకల్పుడై కదిలితేనే కరిగే గమ్యం వైపుకు ఎంతమంది వెళ్తారు. ఎవరు సాహసిస్తారు. నేను దగ్గరుండి కేసీఆర్ గారిని కళ్లారా చూసిన కాబట్టే చెప్తున్నా.. ఒక్క కేసీఆర్ గారి వల్లనే ఇది అయితది. ఇంకెవల వల్ల కాకపోవు.. కాదుగూడా. అంతెందుకు మహారాష్ట్రతో ఒప్పందానికి సారుతోటి నేను కూడా ప్రత్యేక విమానంలో పోయిన. దగ్గరుండి ఆ చారిత్రక ఒప్పందాన్ని సూశిన.
ఇన్నేండ్లల్ల.. ఇంతపొడుగు పార్టీలని చెప్పుకుంటూన్నయి కదా.. మరి ఆ రోజు ఏంచేసిండ్రు. అప్పుడు ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేండ్లపాటు కాంగ్రేస్ ప్రభుత్వాలే ఉండి.. గోదావరి నదీ జలాలకు సంబంధించి ఒక్క ఒప్పందం కూడా చేసుకోలేకపోవడం.. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ కపట ప్రేమ తేటతెల్లం అవుతుంది. అదేవిధంగా కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని, మన ముఖ్యమంత్రి ఎన్నోసార్లు అడిగినా పార్లమెంటులో మేము టీఆర్‌ఎస్ ఎంపీలం గొంతె త్తి నినదించినా పట్టించుకోకపోవడం బీజీపీ వంతయ్యింది. ఇదీ ఈ రెండు జాతీయపార్టీలకు, తెలంగాణ, ఈ ప్రాంత రైతులపై ఉన్న ప్రేమ. ముఖ్యమంత్రి గారి రాజనీతిజ్ఞత, ఇరుగు పొరుగుతో కలిసిమెలిసుండాలనే భావన వల్ల మహారాష్ట్రతో చరిత్రాత్మక గోదావరి జలాల ఒప్పందానికి మార్గం సుగమం అయింది. 2016 మార్చి 8న మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని.. 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేయడం జరిగింది. ఆ ప్రాంత పార్లమెంటు సభ్యుడుగా ఈ రెండు చారిత్రక ఘట్టాల్లో భాగస్వామిగా నేనుండటం నా అదృష్టంగా భావిస్తాను. ఈ సందర్భంలో ఒకటి చెప్పాలి- కేసీఆర్ లాగా సామరస్యపూర్వక వాతావరణంలో ఇరుగుపొరుగు రాష్ర్టాలతో సత్ససంబంధాలు కల్గి ఉంటే.. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ముళ్ల పెరియార్ డ్యావ్‌ు విషయం లో కేరళ-తమిళనాడు ప్రజల మధ్య, అలాగే ఆల్మట్టి డ్యావ్‌ు విషయంలో.. కర్ణాటక-ఆంధ్ర ప్రజల మధ్య, అలాగే కావేరీ నదీ జలాల విషయంలో.. కర్ణాటక-తమిళనాడు మధ్య గొడవలకు ఆస్కారం ఉండకపోయేది. ఈ సమస్యలన్నీ ఎప్పుడో పరిష్కారం అయ్యుండేవి.
కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వం ఈ దేశానికి తప్పక అవసరమని నేను భావిస్తా. ఆ రోజలు వస్తే.. ఈ దేశంలో ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యలకు, వివాదాలకు, సత్వర పరిష్కారాలు దొరుకుతాయి. మొన్నీమధ్య ఒక టీవీ చర్చా కార్యక్రమంలో నేను కుండబద్దలు కొట్టిన ట్టు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు చెప్పిన. ప్రభుత్వాలు నడిపే మామూ లు నాయకులు.. కిందికిపొయ్యే నీళ్లకు అడ్డుకట్టలు కట్టి, నీళ్లిడుస్తరు. కానీ మా దమ్మున్న కేసీఆర్ లాంటి లీడర్ మాత్రమే, కిందికి పొయ్యే నది ని.. మీదికి మలుపుతడు. అదే మేడిగడ్డ నుంచి గోదారమ్మను పోచంపాడు ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు మలిపేదే ఈ కాళేశ్వరం. ఈ ప్రస్థానం కాళేశ్వరంతోటే ఆగదు. సమైక్యపాలనలో ఆగమైన పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల బీళ్లకు కూడా.. పాలమూ రు -రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాల ద్వారా కృష్ణమ్మను మన బీళ్ల కు మళ్లించటంతో.. ఆ భూముల్లో బంగారం లాంటి పంటలు పండించే రోజులు మరెంతో దూరంలో లేవు.
బాల్క సుమన్ (వ్యాసకర్త: చెన్నూరు శాసనసభ్యులు, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు)