Author Archives: BRSpartyonline

కేంద్ర బకాయిలు 29,891 కోట్లు
జీఎస్టీ బకాయిలు రూ.4531 కోట్లు సహా రాష్ట్రానికి రావాల్సిన రూ.29,891 కోట్ల నిధులు సత్వరమే విడుదలచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

కాళేశ్వరంతో వ్యవసాయ స్థిరీకరణ
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావడంతో వ్యవసాయ స్థిరీకరణ జరిగి గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారుతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

దుమ్ముగూడెం వద్ద బరాజ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద జలవిద్యుత్ ఉత్పత్తికి, గోదావరి నీటి నిల్వకు ఉపయోగపడేలా బరాజ్ నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.

కాళేశ్వరం బలం 110 టీఎంసీలు
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 110 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

తెలంగాణ ప్రయోజనాలే టీఆర్ఎస్ పార్టీ పరమావధి
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ రోజు తెలంగాణ భవన్ లో జరిగింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ పార్లమెంట్ సభ్యులకు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపైన దిశానిర్దేశం చేశారు.
టీఆర్‌ఎస్ కార్యకర్తలకు కొండంత ధీమా
ప్రమాదవశాత్తూ మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కుల పంపిణీ చేసిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే తారకరామారావు.

హుజూర్‌నగర్ విజయంతో ఉత్సాహం
ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, లేవనెత్తిన అర్థరహిత ప్రశ్నలన్నింటికీ హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ప్రజలే సమాధానం చెప్పారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
పన్నెండు లక్షల ఉద్యోగాలు
రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 12 లక్షలమందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.

ప్రతి ఎకరాకు సాగునీరు
తెలంగాణ యావత్తు 1.25 కోట్ల ఎకరాలకు నీళ్లు రావాలె. తెలంగాణ పచ్చబడాలె.. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొండి పట్టుదలతో ముందుకు పోతున్న అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


