Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అర్హులందరికీ ఆసరా

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పింఛన్ల పంపిణీ పథకం శనివారం ప్రారంభమవుతున్నది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శనివారం ఉదయం పింఛన్ల పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లో సంబంధిత మంత్రులు కూడా ఈ పథకాన్ని మొదలుపెడతారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులను ఆర్థికంగా ఆదుకునేందుకు చేపడుతున్న ఈ పథకాన్ని ఆసరా పేరుతో వ్యవహరిస్తున్న విష యం తెలిసిందే. అధికారం లోకి వస్తే ఈ పథకాన్ని చేపడతామని టీఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది.

KTR

ప్రతి అర్హుడికీ పింఛన్.. రాష్ట్రంలో ప్రతి అర్హుడికీ పింఛన్ అంది తీరుతుందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఈ పథకానికి దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతం ఎవరైనా అర్హుడికి పింఛన్ రాకపోయినా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత కేటీఆర్ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాకు ఆసరా పథకం వివరాలు వెల్లడించారు.

-నేటినుంచి పింఛన్ల పంపిణీ -పాలమూరులో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ -జిల్లాల్లో మంత్రుల చేతుల మీదుగా.. -నెలాఖరులోగా పంపిణీ ప్రక్రియ పూర్తి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు ఏ ఒక్క అర్హుడు లబ్ధి పొందకుండా మిగిలిపోవద్దు.. అలాగే ఏ అనర్హుడూ లబ్ధి పొందవద్దు. కచ్చితంగా అర్హులందరికీ పింఛన్లు అందుతాయి. ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు మిస్సయి ఉంటే దరఖాస్తులను తీసుకోవడమనేది నిరంతర ప్రక్రియ కాబట్టి భయం లేదు. కొందరు పనిగట్టుకొని చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు.. అని కేటీఆర్ స్పష్టం చేశా రు.

గతంలో చెప్పిన ప్రకారం శనివారం పంపిణీ ప్రారంభించాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో ఒక నియోజకవర్గ కేంద్రం, ఒక గ్రామాన్ని ఎంచుకొని కొంతమందికి పింఛన్లు ఇచ్చి పథకానికి శ్రీకారం చుడుతున్నామని కేటీఆర్ వివరించారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ నెల చివరిలోగా పూర్తిస్థాయిలో పింఛన్ల పంపిణీ ముగిస్తామమని చెప్పారు. సంతోషంగా… సగర్వంగా… టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నది.

నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న పేద, బలహీనవర్గాలకు ఆసరా అందించాలని గత ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదు. అందుకే ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వమే పూర్తిగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేసారి మూడున్నర రెట్ల అదనపు భారం పడుతున్నా ఈ విప్లవాత్మక పెంపునకు శ్రీకారం చుట్టామన్నారు.

కుటుంబంలో వికలాంగులు ఎందరున్నా అర్హులే.. ఆసరా పథకంలోని ప్రధానమైన అంశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే అందులో ఒక్కరికి మాత్రమే వృద్ధాప్య పింఛను వస్తుంది. ఎందుకంటే గతంలో ఒక్కరికి రూ.200 మాత్రమే వచ్చేవి. ఇద్దరికి కలిపితే రూ.400. కానీ ఇప్పుడు ఒక్కరికే రూ.వెయ్యి వస్తున్నయి. అందుకే ఈ నిబంధన ఉంచామని చెప్పారు. అదే సమయంలో ఒక ఇంట్లో ఒక్క వృద్ధాప్య పింఛను వచ్చినా అదే ఇంట్లో వికలాంగులుగానీ, వితంతువులుగానీ ఉంటే వారికి కూడా పింఛన్లు వస్తాయని చెప్పారు. అలాగే ఇంట్లో ఎంతమంది వికలాంగులున్నా అందరికీ రూ.1500 చొప్పున పింఛన్లు వస్తాయని వెల్లడించారు. అంటే ఒక్క ఇంట్లో రెండు వృద్ధాప్య పింఛన్లు మాత్రమే రావు. వితంతువులు ఎందరున్నా..వికలాంగులు ఎందరున్నా అందరికీ వస్తాయి. వాటికి వృద్ధాప్య పింఛన్‌తో సంబంధం లేదు.

ధ్రువీకరణ పత్రాలు తర్వాత ఇవ్వవచ్చు.. ఇక ఆయా పథకాల్లో ధుృవీకరణ పత్రాలు సమర్పించే వరకూ పింఛన్ ఇవ్వడం ఆలస్యం చేయవద్దని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. ఆధార్ కార్డు లేకున్నా అర్హులైతే ముందుగా పింఛన్లు ఇవ్వాలని చెప్పినం. అయితే మూడు నెలల్లోపు ధుృవీకరణ పత్రాలుగానీ, ఆధార్ కార్డుగానీ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిచోట్ల అర్హులు ఉన్నప్పటికీ ఆధారాలు ఉండవు. అలాంటి చోట్ల సర్పంచు, కార్యదర్శి, ఎంపీటీసీ, ఎస్సీ/ఎస్టీ వార్డుమెంబరు, స్వయం సహాయక బృందంలోని సభ్యురాలు ఒకరితో ఏర్పాటు చేసుకునే కమిటీ సంబంధిత వ్యక్తి అర్హులని తేలిస్తే పింఛను ఇవ్వాలని చెప్పామని తెలిపారు. అందుకు సంబంధించి జీవో కూడా జారీ చేశామని పేర్కొన్నారు.

మొదటి నెల నగదు రూపంలో..: ఆసరా పథకం కింద ఇచ్చే పింఛన్లను మొదటి నెల (నవంబరు) నగదు రూపంలోనే ఇస్తామని, ఇందుకు సంబంధించిన రశీదు కూడా ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే నెల నుంచి మాత్రం బ్యాంకుగానీ, పోస్టాఫీసులో లబ్ధిదారుడి అకౌంట్‌లో నేరుగా పడుతుందన్నారు. కచ్చితంగా ఎంతమంది అర్హులున్నారనే దానిపై తుది వివరాలు తేలలేదని కేటీఆర్ చెప్పారు.

నిన్నటివరకు ఈ పింఛన్ల ద్వారా ప్రభుత్వంపై రూ.833 కోట్ల భారం ఉంటే తెలంగాణ ప్రభుత్వం మొత్తాన్ని భారీగా పెంచినందున రూ.3వేల కోట్ల పైచిలుకు భారం పడవచ్చని తెలిపారు. అయితే ఎంత భారమైనా… నిరుపేదలకు ఇచ్చిన వాగ్దానం కాబట్టి అర్హులు ఎందరు ఉన్నా… ఇస్తామన్నారు. 65 ఏండ్ల నిబంధన అనేది గతంలోనే ఉందని, ఇది ఈ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నిబంధన కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మరోవైపు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులకు పింఛను ఇవ్వాలనే తమ పార్టీ తరపున గతంలో వెయ్యి రూపాయల కోసం పోరాటం చేశామని, ఇప్పుడు వారికి రూ.1500 పింఛను ఇస్తున్నామని చెప్పారు. ఫ్లోరైడ్ బాధితుల్లో స్కెల్టన్ ఫ్లోరోసిస్ (ఎముకల్లో వచ్చే ఫ్లోరోసిస్) అంటే 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉంటున్నందున వారు వికలాంగుల జాబితాలోకి వస్తారని అన్నారు.

44 లక్షల దరఖాస్తులు..: ఈ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44 లక్షల దరఖాస్తులు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. ఇంత పెద్దసంఖ్యలో పింఛన్లు ఇచ్చే ప్రక్రియలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరగొచ్చు… మా దృష్టికి వస్తే వెంటనే సరిదిద్దుకోవడం జరుగుతుంది.. ఈ విషయంలో ప్రజలు మాత్రం ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరంలేదు అని తారకరామారావు భరోసా ఇచ్చారు.

అర్హులందరికీ కచ్చితంగా పింఛన్లు అందుతాయని.. ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదల కోసం ఈ పథకం అమలు చేస్తున్నదని.. అయితే కొందరు కావాలని, పనిగట్టుకొని దుష్ప్రచారాలకు దిగుతున్నారని అన్నారు. ప్రజలు అవేవీ విశ్వసించవద్దని కోరారు. పథకం సజావుగా సాగేందుకు మీడియా కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 99 శాతం వరకు అర్హుల నుంచి దరఖాస్తులు వచ్చినయి. ఒకరిద్దరు మిగిలి ఉంటె దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. దానికి కాలపరమితి లేదని ఎప్పుడు ఇచ్చినా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, గాదరి కిషోర్, రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.