Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

అజేయశక్తి టీఆర్‌ఎస్

-ప్రజలకు, ప్రభుత్వానికి కార్యకర్తలే వారధి
-ప్రతి సంక్షేమ పథకం గడపగడపకూ చేరాలి
-తెలంగాణకు కేసీఆర్, టీఆర్‌ఎస్ శ్రీరామరక్ష
-ప్రజాశీస్సులతోనే అన్ని ఎన్నికల్లో అద్భుత ఫలితాలు
-దసరాకల్లా కార్యాలయాలు పూర్తికావాలి: కేటీఆర్
-27 నుంచి పండుగలా సభ్యత్వ నమోదు
-ప్రతి జిల్లాలో పార్టీ శిక్షణా తరగతులు: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
-29 జిల్లా కార్యాలయాలకు ఒకేసారి భూమిపూజ
-శంకుస్థాపనలు చేసిన మంత్రులు, జెడ్పీ చైర్మన్లు
-సిరిసిల్లలో కార్యక్రమానికి హాజరైన కేటీఆర్
-ఒక్కో కార్యాలయ నిర్మాణానికి రూ.60 లక్షలు
-నిధులు కేటాయించిన పార్టీ అధినేత కేసీఆర్

రాష్ట్రంలో అభివృద్ధిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరుగులు పెట్టిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే ఎలా నిర్మించారన్న చర్చ దేశమంతా జరుగుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత రాష్ర్టాన్ని సాధించి, రెండోసారి అధికారంలోకి వస్తుందని, అజేయమైనశక్తిగా ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు మొదలుకొని మండల, జిల్లాపరిషత్ ఎన్నికల వరకు చరిత్రను తిరుగరాస్తూ ప్రజలు అద్భుతమైన ఫలితాలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో పాలన చేపట్టి, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ చేరవేసేందుకు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రు లు, జెడ్పీ చైర్మన్లు, చైర్‌పర్సన్లు, పార్టీ ముఖ్యనేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్ట్రమంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల భూమి పూజల్లో, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గద్వాలలో, జీ జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో, ఈటల రాజేందర్ కరీంనగర్‌లో, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో, ఎర్రబె ల్లి దయాకర్‌రావు జనగామలో, మల్లారెడ్డి మేడ్చల్‌లో, కొప్పుల ఈశ్వర్ జగిత్యాలలో, వేముల ప్రశాంత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. ఇతర జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్మన్లు, చైర్‌పర్సన్లు భూమి పూజ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డు వద్ద సమీకృత కలెక్టరేట్ సమీపంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ, నా తెలంగాణ కోటి ఎకరాల వీణ అన్న దాశరథిని గుర్తుచేస్తూ తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. మనం చేస్తున్న పనులకు భగవంతుడి ఆశీస్సులు ఉన్నందునే కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసుకున్నామని అన్నారు. భవిష్యత్తులో పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, డిండి ఎత్తిపోతలను పూర్తిచేసుకుని తెలంగాణ సస్యశ్యామలం కానున్నదని చెప్పారు.

ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్న కేటీఆర్.. వారి త్యాగాలను భవిష్యత్‌తరాలు గుర్తుచేసుకుంటాయని కొనియాడారు. ఇంజినీర్ల పని అద్భుతమని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం బాగుండాలన్నా, కృష్ణా, గోదావరి జలాలు రావాలన్నా అది కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకత్వంలోనే సాధ్యమని స్పష్టంచేశారు. ప్రతి ఇంటిలో కేసీఆర్ ఫొటో పెట్టుకునే రోజులు త్వరలో వస్తాయన్నారు. కార్యదక్షుడు, సత్తా ఉన్న నాయకుడు ఆనాడు ఉద్యమాన్ని, ఈ రోజు ప్రభుత్వాన్ని అద్భుతంగా నిర్వహించినందునే ప్రజల ఆశీర్వాదం మనకు ఉన్నదని, ఆ విషయం ప్రతి ఎన్నికల్లోనూ నిరూపితమయ్యిందని చెప్పారు. కేసీఆర్‌లాంటి నాయకుడు, టీఆర్‌ఎస్ ఉన్నంతకాలం తెలంగాణకు టీఆర్‌ఎస్ శ్రీరామ రక్ష అనే మాటను గ్రామగ్రామానా గుండెగుండెకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని కార్యకర్తలకు గుర్తుచేశారు.

ఒకేసారి 29 జిల్లా పార్టీ కార్యాలయాలకు భూమి పూజ
ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాలకు భూమి పూజలు నిర్వహించడం ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ ఏ రాజకీయ పార్టీ చేయలేదని, దేశంలోని ఇతర పార్టీలు కూడా ఒకేసారి ఇంత పెద్దసంఖ్యలో నిర్మాణాలు ప్రారంభించలేదని పలువురు గుర్తుచేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ నుంచే ఒక్కో కార్యాలయం నిర్మాణానికి పార్టీ అధినేత కేసీఆర్ రూ.60 లక్షల చొప్పున కేటాయించారు. దసరానాటికి అన్ని కార్యాలయాలను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 29 జిల్లాల్లో ఒక్కో ఎకరం చొప్పున స్థలాలను టీఆర్‌ఎస్ కొనుగోలుచేసింది. అన్ని కార్యాలయాలు ఒకే నమునాలో ఉండేలా కేసీఆర్ ప్రణాళిక సిద్ధంచేశారు.

27నుంచి పార్టీ సభ్యత్వ నమోదు
అజేయమైన రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 27న పార్టీ సభ్యత్వాన్ని తొలుత సీఎం కేసీఆర్ తీసుకున్న తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో జిల్లాలవారీగా చేపట్టనున్నట్టు చెప్పారు. పార్టీ కార్యాలయాలను దసరా పండుగ నాటికి పూర్తిచేసుకుని, అందులోనే శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఇచ్చిన ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సుశిక్షితులైన గులాబీ కార్యకర్తలను తయారుచేయాలన్నది పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధార్మిక, కార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దసరా పండుగకు సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.

సిరిసిల్ల జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు
కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. మధ్యమానేరు నుంచి 11 టీఎంసీల నీటితో ఎగువ మానేరును నింపి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండులక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పా రు. వంటి పథకాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్.. అన్నదాతలు అభివృద్ధి చెందాలంటే ఇంకేమి చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, లోక బాపురెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ప్రవీణ్, చీటి నర్సింగరావు, చిక్కాల రామారావు, జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగ

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.