– ఏరోనాటికల్ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ – డిజిటలైజేషన్‌లో ముందుండాలి: మంత్రి అశోక్‌గజపతిరాజు

రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే సంస్థలకు సింగిల్‌విండో అవసరం లేకుండా కొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. రూ.250 కోట్లకుపైగా పెట్టబడి ఉండే ప్రాజెక్టులను మెగా ప్రాజెక్టులుగా ప్రభుత్వం గుర్తిస్తుందని, వాటి స్థాపనకు మందస్తు అనుమతులు అవసరం లేదన్నారు.
ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైన రెండురోజుల సదస్సుల్లో ఆయన మాట్లాడుతూ ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని, ఏరోస్పేస్ రంగానికి కూడా హైదరాబాద్‌ను హబ్‌గా తయారు చేసేందుకు అన్ని హంగులూ ఉన్నాయన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎలిమినేడు, నగరానికి ఉత్తర దిశగా మరో ఏరో స్పేస్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నవంబర్‌లో ఈ రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబోతున్నామని, ప్రపంచంలోని వివిధ కంపెనీలు ఆ కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు. సదస్సును ప్రారంభించిన కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ర్టాలకంటే ముందుండాలని సూచించారు. యంగ్ వ్యక్తి ఐటీ మంత్రిగా ఉన్నందున ఇతర రాష్ర్టాలకంటే ముందుగా తెలంగాణలో డిజిటలైజేషన్ పూర్తి చేస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఈ సదస్సులో ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వీకే సారస్వత్, జీఎం రావు, హెచ్‌ఏఎల్ చైర్మన్ ఆర్‌కే త్యాగి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు