ఈ నెల 9న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పార్టీ తరుఫున పోటీచేసిన అభ్యర్థులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు. 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలకు టీఆర్‌ఎస్ పోటీ చేయడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సమావేశం అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు, ప్రచారం వల్ల వెలువడనున్న ఫలితాలపై సమీక్షించనున్నారు.