Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

1,82,914 కోట్లతో భారీ బడ్జెట్‌

-50 వేల కోట్లతో హైదరాబాద్‌ అభివృద్ధి
-కేసీఆర్‌ సర్కారు మరో మెగా ప్రాజెక్టు
-ఈ ఏడాది 10 వేల కోట్లు కేటాయింపు
-విశ్వనగరంగా మారనున్న భాగ్యనగరి
-రైతు బంధువుగా సర్కారు
-నిరుపేదకు పెరిగిన ఆసరా
-సంక్షేమ పథకాలకు రూ. 40,000 కోట్లు
-సంక్షేమ పథకాలకు రూ. 40,000 కోట్లు
-రూ. 11,758 కోట్లకు చేరిన పింఛన్ల పద్దు
-సొంత జాగాలోనూ డబుల్‌ బెడ్‌రూం ఇల్లు
-రూ.10,500 కోట్లతో పథకం.. లక్ష మందికి లబ్ధి
-రూ.25 వేల లోపు బాకీలన్నీ ఏకమొత్తంగా మాఫ్‌
-మిగతా రైతులకు 4 వాయిదాల్లో సొమ్ము చెల్లింపు
-మద్దతు ధరకు భరోసా.. వెయ్యి కోట్లతో మార్కెట్‌ నిధి
-రైతు బంధుకు 14 వేల కోట్లు.. బీమాకు 1,141 కోట్లు
-ప్రజల కొనుగోలుశక్త

‘ఈ బడ్జెట్‌ కేవలం వార్షిక బడ్జెట్‌ అన్న దృక్పథంతో కాకుండా, వచ్చే నాలుగేండ్ల రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికారచన జరిగింది. ప్రజల అవసరాలు, ప్రాధాన్యాలపై స్పష్టమైన అవగాహనతో ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. సంక్షేమ కార్యక్రమాల నిధుల్లో ఎక్కడా కోతవిధించలేదు. పైగా సంక్షేమపథకాల లబ్ధిదారులను పెంచే నిర్ణయాలను ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం పేదప్రజల అభ్యున్నతికోసం ఎంతటి నిబద్ధతతో ఉన్నదో ఈ బడ్జెట్‌ చాటి చెప్పుతున్నది. ఇది పూర్తిగా ప్రజలే కేంద్రంగా రూపొందిన ప్రగతిశీల బడ్జెట్‌’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. సబ్బండవర్ణాల సంక్షేమంతోనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అధికప్రాధాన్యమిచ్చారు. 61 నిమిషాలు సాగిన హరీశ్‌ బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

సామాజిక విలువల స్వరూపం
స్వరాష్ట్ర ఉద్యమనాయకుడు, దార్శనిక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకొన్నది. అన్నివర్గాల సంక్షేమం.. అన్నిరంగాల అభివృద్ధి లక్ష్యంగా పూర్తి వాస్తవికదృక్పథంతో 2020-21 వార్షిక బడ్జెట్‌ రూపొందింది.

ప్రజల కొనుగోలుశక్తి పెంపు
ఆర్థిక మాంద్యానికి విరుగుడు ప్రజల కొనుగోలుశక్తిని పెంచడమే. సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నది. ప్రజల కొనుగోలుశక్తిని అంతకంతకూ పెంచడం, పెట్టుబడివ్యయానికి నిధులు వినియోగించడం అనే ద్విముఖవ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నది.

మాంద్యమున్నా ముందంజ
కేంద్రం నుంచి రావలసిన పన్నుల వాటా, గ్రాంట్లలో కోతపడినప్పటికీ ఆ లోటును స్వీయ ఆదాయవృద్ధి ద్వారా పూడ్చుకోగలిగాము. బడ్జెట్‌ అంచనాల మేరకు ఖర్చు చేసుకోగలుగుతున్నాం. మన రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే చాలా ఎక్కువ. ఇది మన ప్రగతికి స్పష్టమైన సంకేతం.

తెలంగాణ.. కోటి ఎకరాల మాగాణం
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహా కవి దాశరథి నినదిస్తే… నా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం కావాలని సీఎం కేసీఆర్‌ స్వప్నించారు. ఈ కల నెరవేరేందుకు అహరహం పరిశ్రమిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు లభించే నీటిని సమగ్రంగా వినియోగించుకునేందుకు సీఎం కేసీఆర్‌ గారు స్వయంగా పూనుకుని రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రీడిజైన్‌ చేశారు.

తీరిన ఫ్లోరైడ్‌ గోస
ఉమ్మడి రాష్ట్రంలో ఫ్లోరైడ్‌ విషం నిండిన నీటిని తాగడం వల్ల ఎముకలు బలహీనపడి, నడుములు వంగి తెలంగాణ బిడ్డలు దురవస్థలను అనుభవించారు. ఈ పరిస్థితిని మార్చితీరాలని సీఎం కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో మిషన్‌ భగీరథ పథకానికి రూపుదిద్దారు. దీని ద్వారా సురక్షితమైన తాగునీరు లభిస్తుండటంతో గత ఆరేండ్ల్లలో ఏ ఒక్కరూ ఫ్లోరోసిస్‌ వ్యాధిబారిన పడలేదని ఇండియన్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ ఎకనమిక్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌ ఫౌండేషన్‌ ఇటీవల ప్రకటించింది. ఇది రాష్ట్ర సాధన వల్ల దక్కిన సార్థకతకు నిదర్శనం.

చిత్తశుద్ధితో హామీల అమలు
-మ్యానిఫెస్టో లక్ష్యం కేవలం బ్యాలెట్‌
-బాక్సులే కాకూడదు, ప్రజల బతుకు
-నిలబెట్టడం కావాలి. ఇది సీఎం కేసీఆర్‌ నమ్మిన సిద్ధాంతం. అందుకే టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తన మ్యానిఫెస్టోలో ఆచరణసాధ్యమైన హామీలనే ఇచ్చి అమలుకు శ్రీకారం చుడుతున్నది.

ప్రగతిశీల బడ్జెట్‌
ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తి సమతుల్యతతో ఉన్నది. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌. రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్‌. అన్నివర్గాల సంక్షేమం, అన్నిరంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. దేశంలో ఆర్థికమాంద్యం వల్ల రాబడులు, కేంద్రంనుంచి వచ్చే నిధులు తగ్గినప్పటికీ రాష్ర్టాభివృద్ధి కుంటుపడకుండా బడ్జెట్‌ను రూపొందించడం అభినందనీయం. గ్రామాలు, పట్టణాల వికాసం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, సంక్షేమ పథకాల్లో మరింతమంది పేదలకు అవకాశం కల్పించాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్‌రావును అభినందిస్తున్నా. మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి, బడ్జెట్‌ రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుకు, ఇతర అధికారులకు నా శుభాకాంక్షలు.
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

ముందుగా కేసీఆర్‌ ఆశీర్వాదం..
శాసనసభలో తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రతులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకొన్నారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి బడ్జెట్‌ ప్రతులను చూపించారు. అసెంబ్లీలో మొదటిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్‌ను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందించారు.

భుజం తట్టిన కేసీఆర్‌.. ఆలింగనంతో కేటీఆర్‌
బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించిన అనంతరం హరీశ్‌రావును సీఎం కేసీఆర్‌ భుజంతట్టి అభినందించారు. శాసనసభ ప్రారంభానికి ముందు మంత్రి కేటీఆర్‌ సహచరమంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, పువ్వాడ అజయ్‌తో మాట్లాడుతుండగా హరీశ్‌రావు సభలోకి వచ్చారు. హరీశ్‌రావును చూడగానే మంత్రి కేటీఆర్‌.. ఆయనను ఆలింగనంచేసుకొని అభినందనలు తెలిపారు.

ప్రాధాన్యరంగాలు.. ప్రగతి సోపానాలు
-రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గొర్రెలు, బర్రెల పంపిణీ, చెరువుల్లో చేపల పెంపకం వంటి పథకాలు రైతుల సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికితోడ్పడుతున్నాయి.
-ఎస్సీ, ఎస్టీల విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసానికి ప్రణాళికా బద్ధంగా కృషిచేస్తున్న ప్రభుత్వం.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని తెచ్చింది.
-సమైక్య రాష్ట్రంలో నత్త నడకన సాగిన పెండింగ్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తున్నది.
-కుల వృత్తులు, చేతి వృత్తులపై ఆధారపడిన బీసీలకు ప్రత్యేక ఆర్థిక ప్రేరణ అందించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను చేపట్టింది.
-మహిళలపై జరిగే లైంగికదాడులు, అకృత్యాలను అరికట్టేందుకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌, షీటీమ్స్‌ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.

అతివలకు అసెంబ్లీ శుభాకాంక్షలు
-అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళలకు శాసనసభ తరఫున స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు శాసనసభ కొలువుదీరగానే స్పీకర్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

మందగమనానికి లొంగకుండా, జాతీయ ఆర్థిక కష్టాలకు తలొగ్గకుండా, కేంద్ర నిధుల్లో కోత పడ్డా బెదరకుండా, అభివృద్ధి- సంక్షేమం జోడెడ్లుగా, తెలంగాణ ప్రగతి రథం మరోసారి పరుగులు తీసేందుకు సిద్ధమైంది. నిరుపేదల నిన్నటి కష్టాలను సైతం తీరుస్తూ, రైతన్నల నేటి నష్టాలను సాంతం పూడుస్తూ, తెలంగాణ రేపటి అవసరాలను గుర్తిస్తూ జమా ఖర్చుల లెక్కను తీర్చిదిద్దుకున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను సమర్పించారు. కేంద్రం నుంచి తగినంత సహకారం లభించకున్నా వెరవకుండా, ఆశావహ దృక్పథంతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. తొలి ఐదేండ్ల హయాంలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును చేపట్టి విజయవంతంగా పూర్తిచేస్తున్న ప్రభుత్వం, మలి దశకు హైదరాబాద్‌ మెగా సిటీ అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నది. జాతీయ స్థాయి వలసలతో నానాటికీ విస్తరిస్తున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే ఐదేండ్లలో 50 వేల కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా భాగ్యనగరికి ఈ ఏడాది 10 వేల కోట్ల రూపాయలు కేటాయించింది.

సంతులిత బడ్జెట్‌
ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పూర్తి సమతుల్యతతో ఉన్నది. ఇది సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌. తెలంగాణ ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్‌. అన్నివర్గాల సంక్షేమం, అన్నిరంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి.
– కే చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి

గతంలో మా బాధలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కేసీఆర్‌ సీఎం అయ్యాక పంటపెట్టుబడికి రూ.10 వేలు.. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల బీమా ఇస్తున్న డు. ఇప్పుడు రుణాలుమాఫీ చేసి దేవుడయ్యిండు.
– గుగులోత్‌ దేవానాయక్‌, రైతు మల్లంపల్లి,పాలకుర్తి మండలం, జనగామ జిల్లా

ఆర్థిక మాంద్యానికి విరుగుడు కొనుగోలు శక్తిని పెంచడమే. సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడం ద్వారా జీవన ప్రమాణాలనుమెరుగుపరుస్తున్నాం. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించడమనే ద్విముఖ వ్యూహంతో ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నాం.
– బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

నేతల మాటలు ఇది రైతు బడ్జెట్‌
ఇది రైతు బడ్జెట్‌. వ్యవసాయం, దాని అనుబంధరంగాలకు ఎక్కువ నిధులు కేటాయించడం సంతోషకరం. కోటి ఎకరాల మాగాణం సీఎం కేసీఆర్‌ లక్ష్యం, చిత్తశుద్ధి, పట్టుదలకు బడ్జెట్‌ కేటాయింపులు అద్దం పడుతున్నాయి. ఆరేండ్లలో సీఎం కేసీఆర్‌ నిర్ణయాలతో తెలంగాణ పచ్చబడుతున్నది.
– నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

సంక్షేమానికి పెద్దపీట
ఆర్థికమాంద్యం ఉన్నా, కేంద్రం సహకరించకపోయినా బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేయడం గొప్ప విషయం. పేదలు, రైతుల పక్షాన నిలిచినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. కేసీఆర్‌ రైతు కాబట్టే వారి బాగు కోసం భారీగా కేటాయింపులు చేశారు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి

గ్రామీణాభివృద్ధికి భారీ నిధులు
వార్షిక బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కోసం రూ. 23,005 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఈ నిధులతో గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చు.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి

మరింత సుందరంగా భాగ్యనగరం
భాగ్యనగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడానికి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నగర సమగ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఐదేండ్లలో రూ.50 వేల కోట్లతో అభివృద్ధిచేస్తాం.
– తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి

అన్నదాతకు ప్రాధాన్యం
రైతులు, నీటిపారుదలరంగం, సంక్షే మానికి పెద్దపీట వేశారు. రూ.25 వేలలోపు రుణాలున్న రైతులకు ఈ నెలలోనే చెక్కులు ఇస్తామనడం సంతోషకరం. సీఎం కేసీఆర్‌ సామాజిక ఇంజినీర్‌లా ఆలోచించి, బడుగుజీవులకు భరోసా ఇచ్చారు. మాం ద్యంలోనూ కోత విధించలేదు.
– నామా నాగేశ్వరరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.