టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు 31 జిల్లాల్లో జోరుగా కొనసాగుతున్నది. పట్టణాలు, పల్లెల్లో ప్రజలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు విస్తృతంగా పర్యటిస్తూ సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తూ వేగవంతం చేస్తున్నారు.




రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కొనసాగుతున్నది.ఇంటి పార్టీ టీఆర్‌ఎస్‌కు అండగా ఉండేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. దీంతో నిర్దేశిత లక్ష్యానికి మించి సభ్యతాలు నమోదవుతాయని టీఆర్‌ఎస్ శ్రేణులు ధీమావ్యక్తం చేస్తున్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంత్రి పద్మారావు సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్‌ఎస్ శ్రేణులకు సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడలో సభ్యత్వ నమోదుకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శ్రీకారం చుట్టారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో సభ్యత్వ నమోదును ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్‌పేట డివిజన్‌లో ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ, మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, కార్ఖానాలో ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి టీఆర్‌ఎస్ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ సభ్యత్వ పుస్తకాలు అందజేసి, క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సభ్యత్వ నమోదు ప్రారంభించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామలోని తన నివాసంలో పార్టీశ్రేణులకు సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేశారు. ఖమ్మంలో తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ బుడాన్ బేగ్ సభ్యత్వాలను అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి జిల్లా పెబ్బేరులో మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, సభ్యత్వ నమోదును ప్రారంభించారు.