Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సభ్యత్వ నమోదులో దూసుకెళ్తున్న గులాబీ పార్టీ

టీఆర్‌ఎస్‌కు జైకొడుతున్న జనం

పార్టీ సభ్యత్వ నమోదులో టీఆర్‌ఎస్ దూసుకెళ్తున్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ మరింత పెరిగింది. దీంతో గులాబీ శ్రేణులు కూడా అంతే ఉత్సాహంతో ఇంటింటికీ తిరుగుతూ పార్టీ సభ్యత్వాలు చేయిస్తున్నారు. ఇందుకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. బుధవారం గ్రేటర్ హైదరాబాద్‌లోని రాంనగర్ గోల్కొండ క్రాస్ రోడ్డులో గల ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో ముషీరాబాద్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నియోజకవర్గం ఇన్‌చార్జి ముఠాగోపాల్, కార్పొరేటర్ వీ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల ద్వారానే తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు స్వచ్ఛందగా లభిస్తున్నదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముఠా పద్మ, హేమలత జయరాంరెడ్డి, నాయకులు రెబ్బరామారావు, ఎడ్ల హరిబాబు యాదవ్, రేషం మల్లేశ్, ఎస్ యాదగరి, సీ ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా శామిర్‌పేట మండలంలోని తూంకుంట, శామీర్‌పేట గ్రామాల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్‌రెడ్డి పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంటలో సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జగిత్యాల పట్టణంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, నేరేడుచర్ల, మేళ్లచెర్వు మండలాల్లో సభ్యత్వ నమోదుపై సమీక్షలో మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నియోజక వర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ పార్టీ సభ్యత్వాలు అందజేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, వరంగల్ నగరంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వనపర్తి జిల్లా పెద్దమందడిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలంలో మాజీ మంత్రి బీ రాములు సభ్యత్వాలు అందజేశారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దుబాయ్‌లో ఉంటున్న బల్మూర్ మండలం గోదల్‌కు చెందిన వెంకట్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.

మరోసారి స్ఫూర్తి నింపిన మోతె వేల్పూర్: తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నిలిచిన మోతె మరోసారి ఊరంతా టీఆర్‌ఎస్ వైపు నిలిచి బంగారు తెలంగాణకు స్ఫూర్తి నింపింది. సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామం మొత్తం టీఆర్‌ఎస్ వెంటే నిలువడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. బుధవారం మోతెవాసులంతా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకొన్నారు. మొన్న బాల్కొండ మండలం బస్సాపూర్, నిన్న మెండోర మండలం చాకిర్యాల్ ఇలా ఊరంతా సభ్యత్వం తీసుకున్నట్టే.. నేడు ఉద్యమ గడ్డ మోతె గ్రామస్థులు ఆదే బాటలో నడిచారు.

గులాబీమయమైన ఎర్రవల్లి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దత్తత గ్రామమైన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి మరో అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నది. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో భాగంగా ఊరంతా ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. గ్రామ సర్పంచ్ భాగ్యబాల్‌రాజ్ నేతృత్వంలో బుధవారం గ్రామంలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించి, మరో పార్టీని గ్రామ పొలిమేరల్లోకి రానివ్వమని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞలో సర్పంచ్ భాగ్యబాల్‌రాజ్, వీడీసీ కమిటీ చైర్మన్ కిష్టారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భాగ్యవెంకటయ్య, గ్రామ పెద్దలు మొండి సత్తయ్య, జీ మల్లేశం, ఆనందాచారి, భిక్షపతి, రామయ్యతోపాటు సుమారు 300 మంది గ్రామస్థులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.