Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సంక్షేమ దరహాసం

30వేల కోట్లు! 35కు పైగా పథకాలు! పసి పిల్లల పౌష్టికాహార పథకం నుంచి గురుకుల విద్య దాకా.. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి నుంచి ముదిమిలో ఉన్నవారికి వృద్ధాప్య పింఛన్ దాకా.. మత్యకారులకు చేపవిత్తనాల సరఫరానుంచి గీత, చేనేత కార్మికుల పింఛను దాక.. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నది. దేశంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటే. ఒకటి కాదు రెండు కాదు 32 లక్షల మందికి నెలకు వెయ్యి, వెయ్యిన్నర పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. మైనారిటీ బాలబాలికలకు వందకుపైగా గురుకులాలు ప్రారంభించిన తొలిరాష్ట్రం మనదే. దళిత, మైనారిటీ, బీసీ కుటుంబాల్లోని ఆడపిల్లల పెండ్లికి దేశంలోనే అత్యధికంగా రూ.51వేలు అందిస్తున్న రాష్ట్రమూ మనదే. ఇలా ఈ జాబితా చాలా పెద్దది. ఇందు కే కేసీఆర్ ప్రభుత్వం పేదలను మనసుతో చూసే ప్రభుత్వంగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది.

cm-kcr రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం తొలుత సంక్షేమ రంగానికే పెద్దపీట వేసిం ది. మౌలికరంగాల పునర్నిర్మాణంతో తప్ప తెలంగాణలోని దారిద్య్రం పోదనే విషయం నిజమే అయినా, దశాబ్దాలపాటు దుర్భర దారిద్య్రానికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తక్షణ వెసులుబాటు ముఖ్యమని కేసీఆర్ గుర్తించారు. ఆయా వర్గాలకు పలు పథకాలు అమలులోకి తెచ్చారు.

ఎన్నో పథకాలు.. కేసీఆర్ ప్రభుత్వం పేద దళిత, బీసీ, మైనారిటీ ఆడపిల్లల వివాహానికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 90వేల మందికిపైగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కుటుంబాలు లబ్ధి పొందాయి. 2016-17 సంవత్సరానికి సంబంధించి కల్యాణలక్ష్మి పథకానికి ప్రభుత్వం రూ.738 కోట్లు కేటాయించింది. రాష్ట్ర విభజనలో తెలంగాణకు 124 గురుకులవిద్యాలయాలు రాగా గతేడాది ప్రభు త్వం 10 గురుకులాలు ఏర్పరిచింది. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 250 గురుకులా లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత, గీత కార్మికులకు పింఛను, మత్య్సకారుల సంక్షేమానికి ఉచితంగా చేప విత్తనాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టింది. బీడీ కార్మికులకు నెలకు రూ.1000 జీవన భృతి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. వక్ఫ్ ఆస్తుల వివాదాలను తీర్చేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. గిరిజనులు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల అమలుకు రెండు విచారణ కమిషన్లను ఏర్పాటు చేసింది. దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నది. 2016-17 బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూ. 13,412 కోట్లు కేటాయించింది.

సబ్ ప్లాన్‌తో అభివృద్ధికి ప్రణాళిక దళిత, గిరిజనులు అన్ని విధాలా అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వ శాఖల ద్వారా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు నిధులు కేటాయించి వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులను కేటాయించి వారు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేందుకు ఆయా శాఖలకు ప్రత్యేకంగా నిధులను విభజించింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించి 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.2537కోట్లు బడ్జెట్ కేటాయించగా తెలంగాణ రజక, నాయిబ్రాహ్మణ, వడ్డెర, కృష్ణబలిజ/పూసల, సాగర/ఉప్పర, వాల్మీకి/బోయ, భట్రాజు, కుమ్మరి/శాలివాహన సహకార సంఘాల సమాఖ్య, మేదర, విశ్వబ్రాహ్మణ సహకార సంస్థ లిమిటెడ్, గీతకార్మిక ఆర్థిక సంస్థ లిమిటెడ్, సంచార జాతుల సమాఖ్య లిమిటెడ్ కార్పొరేషన్‌ల ద్వారా ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.