-కాంగ్రెస్‌తో ఫిక్సింగ్ వల్లే రాష్ట్ర ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు
-రాహుల్‌గాంధీ కాదు.. రిమోట్ గాంధీ
-దేశవ్యాప్తంగా 4 వేల పింఛన్ ప్రకటిస్తరా?
-అవినీతికి పర్యాయపదమే కాంగ్రెస్
-ఆర్‌అండ్‌బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఫైర్
-కాంగ్రెస్‌లో చేరినోళ్లంతా అవకాశవాదులే
-ఖమ్మంలో 9 సీట్లు గెలుస్తాం: మంత్రి పువ్వాడ
కాంగ్రెస్‌తో ఫిక్సింగ్ వల్లే హుజూరాబాద్ ఉప ఎన్ని క, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధ్యమైందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ హోటల్‌లో రహస్యంగా భేటీ అయిన ఫొటోలు బయటపెట్టాలా? అని ప్రశ్నించారు. తమది బీజేపీకి ‘బీ’టీం కాదని, కాంగ్రెస్సే బీజేపీకి ఏ, బీ టీం అని చురకలంటించారు. సోమవారం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విప్ ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యే లు రెడ్యానాయక్, జాజుల సురేందర్, సండ్ర వెంకటవీరయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్ ప్రెస్‌మీట్ పెట్టారు.

ఈ సందర్భంగా వేముల మాట్లాడు తూ ‘కాంగ్రెస్‌లో రాహుల్‌గాంధీకి ఏ హోదా ఉంది. ఏ పదవి లేకున్నా రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌లో అన్ని నడిపిస్తారా?.. ఆయన రాహుల్‌గాంధీ కాదు.. రిమోట్ గాంధీ’ అని విమర్శించారు. బీజేపీకి అసలైన రిష్తేదార్ కాంగ్రెస్సే అని పేర్కొన్నారు. ఖమ్మం సభలో రాహుల్ మాట్లాడిన తీరు చూస్తుంటే పప్పు అనడంలో తప్పేమీ లేదని అనిపిస్తున్నదని చెప్పారు. రాహుల్‌కు సరైన అవగాహనగానీ, విషయ పరిజ్ఞానంగానీ లేవని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు ఏ హోదాలో హామీలు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల గెలిచిన కర్ణాటకలో ఇవ్వకుండా.. తెలంగాణల రూ.4 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. దేశ వ్యాప్తంగా 4 వేల పెన్షన్ ఇస్తామని చెప్పే దమ్ము కాంగ్రెస్‌కు ఉన్నదా? అని ప్రశ్నించారు. అవినీతికి పర్యాయ పదమే కాంగ్రెస్ అన్నారు. 1956లో తెలంగాణను బలవంతంగా ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలు దక్కేవని చెప్పారు.
చేరినోళ్లంతా అవకాశవాదులే: పువ్వాడ
దేశంలో కాంగ్రెస్‌ను మించిన అవినీతి పార్టీ.. కుటుంబ పార్టీ ఏదైనా ఉందా? అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. 2009లో తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేసి యూటర్న్ తీసుకొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. ఖమ్మం సభలో కాంగ్రెస్‌లో చేరిన వారంతా అవకాశవాదులేనని, పొంగులేటిసహా ఎవరికీ సీఎం కేసీఆర్ అన్యాయం చేయలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా లో బీఆర్‌ఎస్ 9 సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హామీలకు తెలంగాణ ప్రజలు పడిపోరని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.