Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పండుగలా సభ్యత్వ నమోదు

-గులాబీ మయమవుతున్న ఊరూవాడ -కదిలి వస్తున్న సకల జనులు

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో ఊరూరా పండుగ వాతావరణం నెలకొన్నది. వాడవాడలా సకల జనులు కదిలివచ్చి పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సభ్యత్వాల నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కార్యకర్తలు, ప్రజలు అండగా నిలువాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమ కోసం కృషి చేస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

పార్టీకి గ్రామస్థాయిలో కార్యకర్తలు పట్టుగొమ్మలుగా నిలిచి సభ్యత్వాలను నమోదు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద భీమా వర్తిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు జీ సాయన్న, కనకారెడ్డి, మలిపెద్ది సుదీర్‌రెడ్డి, వివేకానంద్, ఆరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సంజీవరావు పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఖమ్మం జిల్లాలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి, బెజ్జంకి మండలంలో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ సభ్యత్వాలు నమోదు చేయించారు. సూర్యాపేటలో సతీసమేతంగా విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు పార్టీ సభ్యత్వం పొందారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, నిర్మల్ జిల్లాలో పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖాశ్యాంనాయక్ పాల్గొన్నారు. కామారెడ్డిలో విప్ గంప గోవర్ధన్, నిజామాబాద్‌లో ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ నిర్వహించారు. పుట్టగతులుండవనే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు: డిప్యూటీ సీఎం కడియం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని గుర్తించి ఆ పార్టీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. హన్మకొండ నయీంనగర్‌లోని అర్బన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో, వరంగల్ హంటర్‌రోడ్‌లోని అభిరాం గార్డెన్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయనతోపాటు కరీంనగర్ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పార్టీ ప్రతిష్ఠ పెరిగిందన్నారు. 2017-18 వార్షిక బడ్జెట్ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు చెందిన బడ్జెట్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన పాలనా కాలంలో ధనయజ్ఞాన్ని కొనసాగించిందని, ఇప్పుడు ప్రాజెక్ట్‌లను అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్‌కు పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చురుకైన కార్యకర్తలకు భవిష్యత్తులో పార్టీ సరైన గుర్తింపు ఇస్తుందని భరోసా ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌పై ఈగ వాలనివ్వరాదు: ఎంపీ వినోద్ వరంగల్ జిల్లాలో టీఆర్‌ఎస్‌పై ఈగవాలనివ్వరాదని ఎంపీ వినోద్‌కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నగరాలల్లోని మేధావి వర్గాన్ని పార్టీ సభ్యత్వం వైపు ఆకర్షించాలని సూచించారు. రాష్ట్రంలో కొత్త తరం రాజకీయనాయకులను తయారుచేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీలో నేడు ప్రతిపక్ష హోదాలో మాట్లాడే నాయకుడే లేడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పశ్చిమ ఎమ్యేల్యే దాస్యం వినయభాస్కర్, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మేకలు, గొర్రెల అభివృద్ధి సంస్థ చైర్మన్ కన్నబోయిన రాజయ్య యాదవ్, నగర మేయర్ నన్నపనేని నరేందర్, కుడ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ గద్దల పద్మ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.