
కేంద్రంలో ఆరేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి అదనంగా ఒక్కపైసా నిధులు ఇచ్చిందా? ఒక్క మంచి పని అయినా చేసిందా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి పోటీయే లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. అయినప్పటికీ.. ఎన్నికలను తేలికగా తీసుకోకుండా ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు.

నామినేషన్ల అభ్యర్థుల తుది జాబితాల ప్రకారం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతుండగా.. 40 మున్సిపాలిటీలు.. కార్పొరేషన్లలో 81 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో 78 వార్డులను టీఆర్‌ఎస్ ఏకపక్షంగా కైవసం చేసుకున్నది.

ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా.. సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయానికి కృషిచేయాలని, వినూత్న ప్రచారం నిర్వహించడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఎన్నికల బరిలో మనమే ముందు న్నాం. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ ఖాళీగా ఉన్నది. టీఆర్‌ఎస్ తప్ప మరెవరూ లేరు.. ఈ ఎన్నికల్లో మన పార్టీ ఘన విజయం ఖాయం. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కు సానుకూల వాతావరణం ఉన్నది అని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు.

రాష్ట్రంలో అన్ని ద్వితీయశ్రేణి నగరాలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తరిస్తామని, వరంగల్ నుంచి ఆ విస్తరణ ప్రారంభమయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని, ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరించాలని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం (ఈ నెల 4) ఉదయం 11.30 గంటలకు తెలంగాణభవన్‌లో జరుగనున్నది.
Please contribute generously to the BRS Party.