Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మనం నిలవాలి అడవి గెలవాలి

మనం పోగొట్టుకొన్న అడవిని మనమే తిరిగి తెచ్చుకోవాలని.. అందరం కలిసి అడవులను రక్షించుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మనం మేలుకొంటేనే అడవులు బాగవుతాయన్నారు.


మన భూమి పుత్రుడి స్మరణలో..

పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశగతిని మార్చిన గొప్పవారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హుడు. పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రధాని వద్దకు స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తా: సీఎం కేసీఆర్


కల్నల్ ‌సంతోష్‌ బాబు కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ ఆత్మీయ ఓదార్పు

భారత్‌, చైనా సరిహద్దుల్లోని గల్వాన్‌ దగ్గర జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. సంతోష్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


పీవీకి భారతరత్న ఇవ్వాలి

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని మరోసారి కోరనున్నట్టు తెలిపారు. పార్లమెంట్‌లో పీవీ విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చెప్పారు.


కొత్త జిల్లాల్లో అభివృద్ధి కనిపించాలి

కొత్త జిల్లాలుగా మారిన నారాయణపేట, గద్వాల్‌లలో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని చెప్పారు.


రూ.750 కోట్లతో లక్ష కల్లాల నిర్మాణం

రాష్ట్రవ్యాప్తంగా రూ.750 కోట్లతో లక్ష కల్లాలను ప్రభుత్వం నిర్మించనున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దేశంలోనే అతి ఎక్కువగా వడ్లు పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు కేటాయించామని, ఈ వానకాలంలో రైతులందరికీ వారం రోజుల్లో రైతుబంధు అందిస్తామన్నారు.


లాక్‌డౌన్‌ ఉండదు

కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ బుధవారం వీడియో కాన్ఫ్‌రెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నామని సీఎం కేసీఆర్‌ ప్రధానికి వివరించారు.


మరువం.. మీ త్యాగం

భారత్‌ – చైనా సరిహద్దులో లఢక్‌ వద్ద ఘర్షణలో అసువులుబాసిన కర్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహానికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, మంత్రులు కే తారకరామారావు, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, నగర మేయర్‌ రామ్మోహన్‌, విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ నివాళులర్పించారు.


పల్లె తల్లిని.. కాపాడుకొందాం

పల్లె తల్లిని కాపాడుకొంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంతమంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడితీరాలని స్పష్టంచేశారు.


ఉజ్వల ప్రస్థానానికి నాంది

నియంత్రిత సాగు విధానం ద్వారా తెలంగాణ వ్యవసాయరంగంలో ఉజ్వల ప్రస్థానానికి నాంది పలుకుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ విధానంద్వారా భూసారాన్ని పరిరక్షించవచ్చని, అనేక ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.