
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది

ఉద్యమకాలంలో ఏవైతే ఆశించామో.. స్వరాష్ట్రంలో వాటన్నింటినీ సాధించుకొన్నామని.. యావత్ దేశమే నివ్వెరపోయేలా పురోగమిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

తెలంగాణకు ప్రధాని మోదీ శత్రువుగా మారారని సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఎనిమిదేండ్లలో మోదీ కల్లబొల్లి కథలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదన్నారు.

రైతుబంధుతో అప్పుల బాధ తప్పిందని ఖమ్మం రూరల్ మండల రైతుబంధు సమితి కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న తెలిపారు. ‘ఇదివరకు కరెంట్ లేక, నీళ్లు రాక చాలా గోసపడ్డం. సాగుకు నీళ్లు పుష్కలం ఉన్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు రంది లేకుంట జేశిండు. నాకు ఏడాదికి రూ.5వేలు బ్యాంకుల పడ్తానయ్. పొలం నాటు వేసేందుకు పైసలు సరిపోతున్నయ్’ అని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటవాసి దూరు శ్రీమతి సంతోషం వ్యక్తం చేశారు.

దేశ ఐటీ రంగ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైంది. ప్రపంచ స్టార్టప్ వ్యవస్థల చరిత్రలో ఒక కొత్త పుట ఏర్పడింది. ఈ దేశ యువత భవిష్యత్తుకు బంగారు బాట పరిచేందుకు.. వారి ఆలోచనలను సాకారం చేసేందుకు.. ఆవిష్కరణల కేంద్రం హైదరాబాద్‌లో టీ హబ్ 2.0 అవతరించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా ఈ దేశ యువతకు అంకితమైంది.

హైదరాబాద్‌లో మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేసేందుకు ఉద్దేశించిన సమీకృత మురుగునీటి శుద్ధి మాస్టర్ ప్లాన్ (సీఎస్‌ఎంపీ)కి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రాన్ని కోరారు.

దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నెటిజనులు ‘బై బై మోడీ’ హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ట్విటర్‌లో దేశవ్యాప్తంగా ఈ హాష్‌ట్యాగ్ గురువారం నంబర్ వన్‌గా నిలిచింది. దేశాన్ని పాలించడం లో మోడీ ప్రభుత్వం అన్ని విధాల విఫలమైందని, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమయ్యేందుకు కారణం మోడీ ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమంటూ నెటిజన్లు ట్వీట్లతో చెలరేగిపోయారు.

అభివృద్ధిలో పరుగులు పెడుతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి దమ్ముంటే తెలంగాణ పురపాలకశాఖ మంత్రిగా తనపై కేసు పెట్టాలని ఐటీ, మున్సిపల్, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు సవాలు విసిరారు. ‘హైదరాబాద్ నగరంలోని ఐడీపీఎల్ నుంచి రోడ్లు వేస్తుంటే కేసులు పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశాలిస్తున్నరంట.. అధికారులు.. కార్మికుల మీద కేసులు పెట్టడం కాదు.. నీకు చేతనైతే.. కేసు పెట్టాల్సివస్తే మున్సిపల్‌శాఖ మంత్రిగా నా మీద, ప్రభుత్వం మీద కేసు పెట్టండి’ అని అన్నారు.

నాలుగేండ్ల పాటు సైన్యంలో కాంట్రాక్టు పద్ధతిన పని చేయించుకొని విసిరికొట్టే దుర్మార్గ విధానం ‘అగ్నిపథ్’. ఇది అటు సైన్యానికీ, ఇటు యువతకూ అవమానం. యువత ఆగ్రహానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు కూడా అట్టుడుకుతూ ఉంటే కేంద్ర పాలకులకు చీమకుట్టినట్టు కూడా లేదు. అందుకే యువత తిరుగుబాటును ప్రతిపక్షాల రాజకీయంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నరు.
Please contribute generously to the BRS Party.