
ప్రతిసభలో జనసందోహం! ప్రతి నియోజకవర్గంలో ప్రగతినినాదం! సభలంటే ఇవేననిపించేలా.. ప్రచారమంటే ఇదీ అనిపించేలా! రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో 87 సభల్లో ఉపన్యాసాలు.

ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటలే సమయం ఉండటంతో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

జనం.. జనం.. ప్రభంజనం! కడలి పోటెత్తినట్టు.. జనసునామీని తలపిస్తూ.. ప్రజాకోటి! ఇక్కడా.. అక్కడా అనిలేదు.. ఏ నియోజకవర్గంలోనైనా అదే హోరు!
కూటమి నేతల కుట్రలు, కుతంత్రాలతో తెలంగాణ ఉనికి ప్రమాదంలో పడిందని, 1956 నాటి పరిస్థితి పునరావృతమయ్యే ముప్పు పొంచి ఉన్నదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు హెచ్చరించారు.

తాను తెలంగాణ ప్రజల ఏజెంటునని, రైతులు, పేదల ఏజెంటునని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.

తెలంగాణ ప్రజల అవసరాలు, అభీష్టాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను రూపొందించారు.

స్వార్థ రాజకీయాలతో తెలుగుప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు.

కూటమికి ఓటేస్తే శనేశ్వరమేనని, అదే టీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే కాళేశ్వరం లాంటి మహత్తరమైన ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, మారుమూల ప్రాంతాలకు కూడా సాగునీరు, తాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు.

డబ్బు, కొన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుని బాబు రాజకీయం సమయం వచ్చినప్పుడు బాబుకు ఎలా బుద్ధిచెప్పాలో కేసీఆర్‌కు తెలుసు కుల, ప్రాంతీయ రాజకీయాలను కచ్చితంగా తిప్పికొడతాం.

రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు సానుకూల వాతావర ణమే! పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా కేసీఆర్ పాలనపైనే చర్చ జరుగుతున్నది!
Please contribute generously to the BRS Party.