Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రజాకోటితో కేసీఆర్

-సీఎం సుడిగాలి పర్యటనలకు అద్భుత స్పందన
-తనదైన శైలిలో అచ్చతెలంగాణ యాసలో
-87 సభల్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి
-ఒకేరోజు 15 నియోజకవర్గాల్లో ప్రచారం
-నేడు గజ్వేల్ సభతో ప్రచారం ముగింపు

ప్రతిసభలో జనసందోహం! ప్రతి నియోజకవర్గంలో ప్రగతినినాదం! సభలంటే ఇవేననిపించేలా.. ప్రచారమంటే ఇదీ అనిపించేలా! రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో 87 సభల్లో ఉపన్యాసాలు.. వాటిని ఆలకించేందుకు వచ్చిన దాదాపు కోటిమందికిపైగా ప్రజలు! ఇది సీఎం కేసీఆర్ ఆల్‌టైమ్ రికార్డ్! పెద్ద నాయకులమని చెప్పుకొన్న కూటమినేతలు సైతం నియోజకవర్గాలకే పరిమితమైన నేపథ్యంలో తన సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించిన సీఎం.. రాష్ట్రం మొత్తాన్నీ చుట్టేశారు. అలుపెరుగకుండా.. దాదాపు కోటిమందికిపైగా ప్రజలతో.. అందరిలో ఒకడిగా, అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో ప్రజలనే అడుగుతూ, చంద్రబాబు పెత్తనం మనపై అవసరమా? అని ప్రశ్నిస్తూ.. సభల్లో ప్రజలను కూడా భాగస్వాములను చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. బుధవారం సాయంత్రం ఐదుగంటలతో ప్రచారాలకు తెరపడుతున్న నేపథ్యంలో తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్వహించనున్న ైక్లెమాక్స్ సభలో సీఎం పాల్గొనబోతున్నారు. గత ఎన్నికల సందర్భంలోనూ గజ్వేల్‌లో చివరిసభను నిర్వహించి ప్రచారాన్ని ముగించారు.

ఈసారి కూడా అదేవిధంగా గజ్వేల్‌తోనే ప్రచారాన్ని ముగించనున్నారు. సీఎం పాల్గొన్న సభలన్నీ అద్భుత ప్రజాస్పందనతో సూపర్‌హిట్ అయ్యాయనటానికి ఆయా సభలకు వచ్చిన ప్రజలే సాక్ష్యం. జిల్లాస్థాయి సభలకు వచ్చేంతమంది టీఆర్‌ఎస్ నిర్వహించిన నియోజకవర్గాలస్థాయి సభలకు రావడం విశేషం. అన్నింటిలోనూ గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన సభ జనసముద్రాన్ని తలపించింది. సభాస్థలి నిండిపోవడమేకాకుండా.. పరిసర ప్రాంతాల్లోని రోడ్లన్నీ జనంతో కిక్కిరిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల సభలకు మహిళలు, రైతులు, యువకులు, మైనార్టీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంచనాలకు మించి ప్రజలు తరలిరావడంతో పార్టీ నాయకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

ఒకేరోజు 15 నియోజకవర్గాల్లో
ఎన్నికల ప్రచార బాధ్యతలను తన భుజాలపై వేసుకుని, అన్నీ తానై వ్యవహరించిన కేసీఆర్.. రోజూ ఐదారు నియోజకవర్గాలకు తగ్గకుండా సభల్లో పాల్గొన్నారు. సెప్టెంబర్ 2న కొంగరకలాన్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి, ఆరున అసెంబ్లీని రద్దుచేశారు. ఆ మరుసటిరోజే హుస్నాబాద్‌లో తొలి ప్రజా ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఆ తరువాత అక్టోబర్ 2 నుంచి 4వరకు తొలి విడుతలో నిజామాబాద్, నల్లగొండ, వనపర్తి జిల్లాస్థాయి సభలు నిర్వహించారు. నవంబర్ 19 నుంచి సుడిగాలి పర్యటన మొదలుపెట్టి, అన్ని నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 87 సభల్లో పాల్గొన్నారు. నవంబర్ 26న ఒకేరోజు 15 నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది సభల్లో ప్రసంగించటంద్వారా ఈ ఎన్నికల్లో అత్యధిక సభలకు హాజరైన రికార్డు సృష్టించారు. నవంబర్ 24, డిసెంబర్ 1న మినహా మిగిలిన అన్ని రోజులూ ప్రజలమధ్యే ఉన్నారు. ఉదయాన్నే హెలికాప్టర్‌లో బయలుదేరటం, అందులోనే భోజనం చేయటం, రాత్రి అయితే.. హెలికాప్టర్ ప్రయాణం అనుకూలించకపోతే రోడ్డు మార్గంలో వెళ్లటం.. ఇలా సాగింది ఆయన పర్యటనల తీరు. కేసీఆర్ వెంట హెలికాప్టర్‌లో పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, స్థానిక లోక్‌సభ సభ్యులు, జిల్లా మంత్రులు ఉన్నారు.

అద్భుతమైన స్పందన
సీఎం సభలకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అచ్చ తెలంగాణయాసలో ఆయన ప్రసంగిస్తున్నంతసేపు మహిళలు, యువత ఉత్సాహంతో కేరింతలు, చప్పట్లు కొట్టారు. ప్రధానంగా ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు సీఎం ప్రయత్నించారు. ఎవరెవరు ఏమేం అన్యాయాలు చేశారో, మళ్లీ వాళ్లు అధికారంలోకి వస్తే ఎలాంటి ప్రమాదాలుంటాయో విడమర్చి చెప్తూ.. టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మనసులకు హత్తుకునేలా వివరించారు. ప్రతి సభలోనూ స్థానిక సమస్యలు ప్రస్తావించడం, గత ఎన్నికల సందర్భంగా చెప్పినవి అమలుచేశామని గుర్తుచేయడంతోపాటు.. రాబోయే రోజుల్లో చేయబోయే పనులపై హామీలు ఇవ్వడంతో ప్రజలు కేసీఆర్‌కు మరింత దగ్గరయ్యారు. దీనికితోడు స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రస్తావించేటప్పుడు.. వారిని ప్రశంసించటం.. వారికి ఉన్న ప్రత్యేకతలను వివరించడంతో ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.